Friday, April 26, 2024

ఇల్లు

నా ఇల్లు పాతబడింది.

విరిగిన తలుపులు,  పగిలిన నేల, మాసిన గోడలు, 

పెచ్చులు ఊడి ఏ క్షణా న అయినా కూలేట్లు ఉన్న  కప్పు.

యజమానిని అడిగాను కాస్త బాగుచేయించ గూడదా అని.

ఒక్క నవ్వు నవ్వి ఊరుకున్నాడు.

అర్థం కాలేదు.

ఉంటే ఉండు,  లేకపోతే పో అనా?

నేనే పూనుకొన్న…

గోడలకు కొత్త రంగులు అద్దా…

గచ్చుకు,  కప్పుకు  సిమెంట్ పులిమా…

వన్నె వన్నె పరదాలతో ఇంటిని అలంకరించా…

ప్చ్… వృద్ధ వధూ శోభ !

నవ్వాలో, ఏడ్వాలో తెలియలే.

సంవత్సరాలు ఇలాగే గడిచి పోయాయి.

నా అవశిష్టం దిన దిన క్షీణత చెందుతూనే ఉంది.

ఇక తప్పదు.  ఈ ఇల్లు వదలాలి.

క్రొత్త ఇల్లు వెతకాలి.

 చిన్నదో, పెద్దదో,  ఇక్కడో,  ఇంకెక్కడో.

ఇదుగో నేనుసిద్ధం,  నూతన గృహప్రవేశానికి…

ఒక దయగల తల్లి వెచ్చని గర్భం!

Also read: జ్ఞాపకాలు

Also read: ఆమె

Also read: సమయం లేదు మిత్రమా

Also read: నీతో

Also read: కవిత్వం ఒక విచిత్రం

MAHATHI
MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles