Tuesday, August 9, 2022

ఆమె

నేను  ఓ కొత్త ఇంటికై వెతికాను ..

అంతపెద్దదేమీ అవసరంలేదు…

బాగా గాలి తోలేటట్లు విశాలమైన కిటికీలు,

కాస్త పెద్ద తలుపులు, 

ముఖ్య రహదారులకు దగ్గరగా…

అప్పుడప్పుడు సాయంకాల  విహారానికి

…అందరికి తానెవరో తెలియాలిగా…

తన సుదీర్ఘ చరిత్ర,  మంచితనం!

ఆ సాయంత్రం వాహ్యాళికి వెళ్ళాను.

అలవాటుగా… నూలు చీర, 

నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు,

పసుపు అద్దిన ముఖాన చిరునవ్వు.

ఒకళ్ళిద్దరిని పలకరించాను…

“నాపేరు స… “

వినకుండా వెళ్లి పోయారు.

కొందరు ఎగ దిగ చూసి నవ్వుకున్నారు.

నా ప్రస్తావన లన్నింటికీ నిశ్శబ్దమే సమాధానం అయ్యింది.

నాకేం తక్కువ?  అందంగా లేనా… కళ గా లేనా?

నా నడక సూటిగా,  మాట నిక్కచ్చి గా…

అందరు ముచ్చట పడి తీరాలిగా?!

నిరాశ గా,  నిస్పృహతో,  తిరుగుతూ,  తిరుగుతూ,

సందడిగా ఉన్న ఒక ఇంట్లోకి తొంగి చూసాను,

తప్పనిపించినా.

వరుసల లో కూర్చొని చాలా మంది…

ఎదో ఎవరినో శ్రద్ద గా తిలకిస్తున్నారు…

తలతిప్పి చూచా…

ఆ గది కి ఒక దిక్కులో బంగారు సింహాసనం పై,…

పట్టువస్త్రాలు,  సువర్ణాభరణాలు ధరించి,

మసకచీకటిలో కూర్చుని ఒక నల్లని స్త్రీ…

ఎదో చెపుతోంది… ప్రేక్షకులు ఆనందంగా, 

కొందరు కేరింతలు కొట్టుతూ వింటున్నారు…

కళ్లు చికిలించి  చూసా… గుర్తుపట్టా…

ఆమె పేరు అబద్దం.

Also read: సమయం లేదు మిత్రమా

Also read: నీతో

Also read: కవిత్వం ఒక విచిత్రం

Also read: గాలిపటం

Also read: పంది కొక్కులు

MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

1 COMMENT

  1. It isn’t often that you come across a article like this one. We’ll be sure to check back in to see what’s changed. Thank you for taking the initiative to write that article.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles