Tag: mahati
జాతీయం-అంతర్జాతీయం
అనాథ
అతనో అనాథ...నాటకాలంటే ఎంత ఇష్టమో!
ఆ నాటకాలలో అతనొక్కడే నటుడు, అతనొక్కడే ప్రేక్షకుడు.
అదే నాటకం ఎన్నిసార్లు ఆడాడో, అన్నిసార్లూ చూసాడు.
అలసట లేదు, చూసింది చూస్తున్నాననే విసుగు రాదు.
వైవిద్యం కోరుకుంటాడు...అతనే రాముడు...విగ్రహవాన్ ధర్మః
'రతి ప్రతిక్షణం మమ'...
జాతీయం-అంతర్జాతీయం
రూపం
నన్ను సూస్తే నవ్వులాట అందరికి
మరదంతే!
అమ్మోరి మచ్చల నల్ల మొకం,
బఱ్ఱె పెదాలు, చాటంత సెవులు,
బట్టతల, దిబ్బ ముక్కు, మెల్ల కళ్ళు,
బాన పొట్ట, వంకర కాళ్ళు.
నేల నుండి నాలుగడుగుల పొడుగు!
మరి నవ్వరా!?
ఏలకోళం సేస్తారు, ఎటకారాలు పడతారు,
చతుర్లాడతారు,...
జాతీయం-అంతర్జాతీయం
గాయం
ప్రేయసీ!
పోతూ పోతూ నీవు నాచుట్టూ
వెదజల్లిన శూన్యం
చిక్కనై, ఉక్కిరిబిక్కి చేసి,
ఊపిరి సలపనివ్వక
నన్ను ఎప్పుడో ఒక రాయిగా మార్చేసింది.
ఎందుకో కొందరు నన్ను
సాలిగ్రామం అంటుంటే తడిమి చూసుకున్నా...
నా గుండెపై వ్యక్తావ్యక్తం గా
గజిబిజి రూపాలతో చెక్కినట్లు కనుపిస్తున్న
నీవుచేసిన మాసిపోని...
జాతీయం-అంతర్జాతీయం
పగిలిన గాజు పెంకు
మనసు కన్నా పెళుసు ఈ గాజు పెంకు...
నాతి హృదయం వంటి రాతికి తగిలి
వేయి వ్రక్కలు అవుతుంది.
ఇక ఈ మధువో, కన్నీటికన్నా పలుచన
ఎగసిపడి, ఎగసిపడి, తూలి, తూలి, జారీ, జారి
గుండెలోని ఏ గుహ్య తీరాలకో...
జాతీయం-అంతర్జాతీయం
జగన్నాథ రథచక్రాలు
వసంత కోయిల తొలి వలపు గీతం ఆలపిస్తే
ఆహా ఓహో అంటూ తలలూపుతాం
నువ్వూ నేనూ...
మన ప్రక్కన్నే తప్పులు వెతుకుతూ సంగీతజ్ఞుడు
ఒకడు వెక్కసంతో!
పేదరాలి చిరిగిన చీర చూసి
అయ్యో పాపం అని ఆక్రోశిస్తాము
నువ్వు నేనూ ..
చిరుగులలో చిగురు...
జాతీయం-అంతర్జాతీయం
నేను చెప్పని కతలు
నీ కెన్ని కథలు చెప్పానో కదా మిత్రమా!
చిలిపివి, గిలిగింతలు పెట్టేవి, హాయిగా నవ్వుకొనేవి
సరదాసరదా వృతాంతాలు;
అనవద్యమైన, నిర్వివాదమైన, తేలికపాటి పిట్ట కథలు,
విచిత్ర విశేషాలు, సాదాసీదా చమత్కారాలు,
హస్యాలు, వెటకారాలు...
అప్పుడప్పుడు, స్వంత డప్పు కొట్టుకోడానికి,
Modesty చూపుకోడానికి
చేసిన చిన్న...
జాతీయం-అంతర్జాతీయం
నా ఇష్టాయిష్టాలు
నాన్న మాట వినడం కష్టం
అందుకే రాముడంటే నాకయిష్టం.
మంచివారికి మంచిచేయడం
అబ్బో మనవల్లకాదు.
అందుకే కృష్ణుడి పై వేస్తా అపవాదు.
ఉపవాసాలు, సహనాలు, శాంతాలు,
అహింసా వ్రతాలూ... చేతకాని మతాలు.
అందుకే గాంధీ అంటే వెటకారాలు.
రావణుడు రంభనే ధర్షించిన రమ్య రసరాజు
రారాజు...
జాతీయం-అంతర్జాతీయం
మా రైతు
రేగళ్లను రక్తంతో తడిపిందెవరు,
నాగళ్లను క్రూర నారాచాలుగా మార్చిందెవరు,
చల్లని కళ్ళకు క్రోధారుణ కలికం పెట్టినదెవరు,
కోతలు కోసే కత్తితో కుత్తుకలు
కత్తిరించ వచ్చని చెప్పిందెవరు!?
విత్తు విత్తడం, నీళ్లు పట్టడం, కలుపు తీయడం,
కుప్ప నూర్చడం తప్ప తెలీని స్వేచ్చా...