సమయం లేదు మిత్రమా
ఆలస్యం అయిపొయింది.
శాంతి, శాంతి అంటూ భ్రాoతిలో గడిపిన
ఆ గాంధీ ఇప్పుడు లేడు
నమ్మి మోసపోయేటoదుకు నెహ్రు లేడు
ఇప్పుడు ఉన్నది కొండ ను ఢీ కొట్టి
పొడి పొడి చేసే మొండి మోడీ
ఏ విషాన్నయినా విరగ్గోట్టే
అపర వినతా సుతుడు అమిత్ షా.
అదిగో, నిరంతర నిర్వీ కార భారతీ మాత
రక్త రుణ నేత్రలతో శూలం త్రిప్పుతూ…
ఇదిగో ప్రళయ కాల మేఘ మై
ఆక్రోశం తో, ఆక్రoదనల తో
మిమ్మల్ని ఆక్రమించు కొంటున్న
అంకిత్ శర్మ ఆత్మ
ఇక రణం లేదు, రక్తం లేదు …
మీరెప్పుడు కనని, వినని
కర్కశ మారుతాలు మిమ్మల్ని
దూరం గా విసిరి వేయక ముందే
పారిపో మిత్రమా, పారిపో!
నీవు తెచ్చిన డబ్బుల మూటలు
తీసుకొని నీ దేశానికే
తోక ముడుచుకొని పారిపో.
ఇక్కడి వాళ్ళు నా వాళ్ళు,
నా భారతీయులు… నా దగ్గర క్షేమం.
జప మాల, నెల బాల, సిలువ
మావే,
సుత్తి, కొడవలి, ఖడ్గం, కమలం, హస్తం
అన్నీ మేమే.
వినే వాడికి నచ్చ చెప్పు కుంటాం
మొండి వాడి కి మొట్టి కాయలు వేస్తాం.
అందరు మా వాళ్లే, భారతీయు లే.
ఇక పో మిత్రమా…
సమయం లేదు మిత్రమా
ఆలస్యం అయిపొయింది.
ఈ దేశం ఎప్పటి కి నీకు దక్కదు.
పారిపో మిత్రమా, పారిపో !
మాలో ఇంకా మిగిలి ఉన్న క్షమా గుణం
అమానుష బలం గా మారక ముందే
పారిపో మిత్రమా, పారిపో !