Friday, March 29, 2024

నీతో

నీతో కలిసి అడుగులు వేయడం

…అది ఒక అపురూప  అనుభవం…

తారలు త్రుళ్లి పడుతున్న ఆకాశం నీడలో

అడవి జాడలవెంట…

ఎప్పటి లాగే ప్రకృతి అందాలను ధిక్కరిస్తూ నావెంట నీవు

చిలిపి నవ్వుల ఖడ్గం తోఁ నా గుండెపై గాటు లు వేస్తూ…

అదేమిటో ఎప్పుడు మాటలన్నీ నావే…

నీవు మాత్రం నిశ్శబ్దంగా నడుస్తూ

అప్పుడప్పుడు వంగి గడ్డి పూలను కోస్తూ

ఒ క్కో  సారి ఆకుల సందుల నుండి తొంగి

చూస్తున్న చందమామ ను పలుకరిస్తూ…

మౌనం గా  అలాగే రాత్రి కరిగే దాక గడిపేస్తావు

నా గుండె కొట్టు కోవడం నాకు ఒక వ్యర్ధ   నిరీక్షణ స్వరంలా

బిగ్గరగా,  మరింత బిగ్గరగా,  భయ పెట్టేటంతగా

నాకే వినిపిస్తూ ఉంటె…

అవే ఆలోచన లు, అదే భావోద్వేగం

 నా గుండె ను నలిపేస్తుంటే…

కొంత శూన్య ప్రహారం… కొంత శబ్ద ప్రకంపనం…

ఏమో నిన్ను ఎప్పటికి అర్థం చేసికో లేనేమో…

 తడిసి తడిసి ముద్దై

వెచ్చని ఇసుక తీరాల  కోసం ఎదురు చూస్తూ

సాగరం లో కొట్టుకు పోతున్న

 చెక్క దుంగ లా ఎప్పటి కి ఇలాగే  ఉండిపోతానేమో !

ఇంతలో తూరుపు దిక్కులో ఒక పలుచని సూర్యకిరణం మెరిసింది…

ఇంకోక్కసారి ఆశ గా నిన్ను చూసి ఒక గాఢ మైన నిట్టూర్పు విడుస్తాను

…గుండెలో అప్పుడే మొదలై న ఒక రగిల్చే  మంట !

Also read: కవిత్వం ఒక విచిత్రం

Also read: గాలిపటం

Also read: పంది కొక్కులు

Also read: చరిత్రకారుడు

Also read: యుద్ధం

MAHATHI
MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles