Friday, April 26, 2024

కవిత్వం ఒక విచిత్రం

వింత వింత ఉపమానాలు వందలు వందలు,

కవి కలం చిందులు,  మృష్టాన్న విందులు.

 ప్రేమలేఖలు మోసే మబ్బులు

పలుకరించు పూలు, అవునని తలలు ఊచుచెట్లు

 సూచనలు చేయుగాలులు ,

 కోరికలు రగిలించు  చంద్రుని శీతల కిరణాలు

ప్రవహించే పచ్చిక బయళ్లు… వర్షించే ఆశీస్సులు…

కోయిల కూనిరాగాలలో సరిగమలు

ఉషోదయపు మంచు బిందువులో, ప్రథమ ప్రేమ రుచి…

నాగుపాము వంటి జడ, ఆకాశం వంటి కనులు…

వింత వింత ఉపమానాలు వందలు వందలు,

కవి కలం చిందులు,  మృష్టాన్న విందులు.

ప్రేమ జాలువారితే జావళి

విరహంతో చంద్ర ఉపాలంబం

సంరంభంలో  వృత్యనుప్రాసం,

బాధ కలిగితే భ, ర, న, భ, భ, ర, వ,

కోపమొస్తే ముక్త పద గ్రస్తం…

చెమ్చాలలో తుఫానులు, ఎరుపెక్కిన సముద్రం అలలు!

వాస్తవికత వారిని కదిలిస్తే , అధి వాస్తవికతతో వాపోతారు…

ఆహా… వారిలో ఊరే భావాలతో మారే సిరా రంగు.

 అలుసు చేస్తున్నానని అలుగకండి

కవి మిత్రులారా

నేను మీ జాతే,  ఒప్పుకొందాం

మనందరి లక్షణం,  విలక్షణం

Also read: గాలిపటం

Also read: పంది కొక్కులు

Also read: చరిత్రకారుడు

Also read: యుద్ధం

Also read: ఎవ్వడు వాడు

MAHATHI
MAHATHI
మైదవోలు వేంకటశేష సత్యనారాయణ కలం పేరు మహతి. ఆయన ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన కవి. భారతీయ ఇతిహాసాన్నీ, పురాణాలనూ తన సుదీర్ఘమైన గేయాల ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసే మహాప్రయత్నంలో ఉన్నారు. ఛందోబద్ధంగా ప్రాచీన శైలిలో గేయాలు రాయడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛాగీతాల రచనకు విముఖులేమీ కాదు. ‘ఫైండింగ్ ద మదర్ (శ్రీ సుందరకాండ),’ ‘హరే కృష్ణ,’ ‘ఓషన్ బ్లూస్,’ ‘ద గాంజెస్ అండ్ అదర్ పోయెమ్స్’ వంటి గ్రంథాలు ఆయనకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ఆయన రచనలు అనేకం ప్రచురితమైనాయి. కవి ఫొన్ నంబర్ +91 83093 76172

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles