Wednesday, September 27, 2023

చింతాక్రాంతుడైన ఆంజనేయస్వామి

రామాయణమ్130

స్వామి‌ చింతాక్రాంతుడయ్యాడు. ఏమైంది సీతమ్మ?

‘‘ఇంత వెతికినప్పటికీ ఆ తల్లి కానరాలేదు ని శ్చయముగా చనిపోయి ఉండును. దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు ఆవిడ తనకు లొంగలేదని చంపివేసి ఉండును. లేక భయంకరాకారులైన ఈ రాక్షస స్త్రీలను చూసి గుండె పగిలి చనిపోయి ఉండును. ఊహూ! ఆ తల్లి జాడ కానరాలేదు. అయ్యో నా శ్రమ వృధా అయినదే. సుగ్రీవుడు చండశాసనుడు. సీతమ్మను చూడకనే కిష్కింధకు మరలి వెళ్ళుట సాధ్యముకాదు. నేను సీతాదేవిని చూడక మరలి వెళ్ళినచో నాతో కలిసి ఆవిడని వెదుక వచ్చిన యోధులందరూ ప్రాయోపవేశము చేయుదురు. పాపము వృద్ధుడైన జాంబవంతుడు ఏమగునో! ఏది ఏమయినప్పటికీ మరల ఇంకొకసారి వెదికెదను’’ అని తనను తాను ఉత్సాహపరచుకొని  మరల ధైర్యము తెచ్చుకొని, ‘‘సంపాతి లంకలోనే సీతాదేవి ఉన్నదని చెప్పినాడు కదా! ఇంకొక సారి వెదికి వచ్చెదను‘’ అని అంగుళమంగుళము మరలమరల అంతఃపురమంతా జల్లెడ పట్టాడు హనుమ.

ఆ తల్లి కానరాలేదు.

Also read: హనుమ ఎంత వెదికినా కానరాని సీతమ్మ

(ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకము వ్రాశారు మహర్షి వాల్మీకి

అనిర్వేదః శ్రియోమూలం అనిర్వేదః పరం సుఖం

అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః

కరోతి సఫలం జన్తోః కర్మ యత్తత్కరోతి సః

తస్మాదనిర్వేదకృతం యత్నం చేష్టేహముత్తమమ్ ..

.దిగులుచెందకుండ ఉత్సాహముగా ఉండటమే ఐశ్వర్యమునకు మూలము. ఉత్సాహమే ఉత్తమమగు సుఖము. ఉత్సాహమే సర్వార్ధములయందు మానవుని ప్రవర్తింపచేయును. మనము చేయు ఏ పని అయినను ఉత్సాహమే ఫలవంతముగా చేయును…కావున ఉత్సాహముగా మరల ప్రయత్నించెదను ….

This is a Self motivating thought by

Lord Hanuman)

లంకానగరం మొత్తం జల్లెడ పట్టాడు స్వామి. అయినా ఎక్కడా సీతమ్మజాడ కనపడలేదు.

విదేహ రాజపుత్రి …మైథిలి. ఒక వేళ చేయునది లేక రావణుని చేరియుండునా? ఏదో ఒక సందేహము పొడసూపింది ఆయన మదిలో….వెంటనే ….జనకరాజర్షి  కూతురు జనని జానకి వానికి లొంగదుగాక లొంగదు…అని మరల అనుకొన్నాడు.

Also read: లంకలో హనుమ సీతాన్వేషణ

లేక

రాముడు వచ్చి  తన నిశిత శరములతో కడతేర్చునేమో అని తొందరపడుతూ అతి వేగంగా రావణుడు ప్రయాణించునప్పుడు మధ్యలో క్రింద పడిపోయెనా?

ఆకాశమార్గాన రావణుడు సముద్రము దాటునప్పుడు ఆ మహోదధిని చూసి సీతాదేవి గుండెజారి సముద్రములో జారిపడిపోయెనేమో!

రావణుడు అదిమి పట్టిలాగుకొని వచ్చి గట్టిగా పట్డుకొనినప్పుడు సుకుమారి సీతమ్మ ప్రాణములు విడిచియుండునేమో?

లేదా పెనుగులాడుచూ సముద్రములో పడిపోయెనేమో!

Also read: లంకా నగరిలో సీతమ్మకోసం హనుమ అన్వేషణ

లేక

రావణుడు భక్షించెనా ఏమి? రావణుని భార్యలైనా ఆపని చేసియుండవచ్చును!

లేక

రామవియోగ దుఃఖము భరించలేక ఆమె తనువు చాలించెనేమో?

సీతాదేవి కనపడలేదు. బ్రతికియుండినదా లేక మరణించెనా? ఇది నిశ్చయముగా తెలియుటలేదు. ఏది ఏమైనను సీతాదేవి జాడ తెలియలేదు అను వార్త రామునికి చెప్పుట ఎంతమాత్రము సరికాదు.

Also read: లంకిణితో హనుమ ఘర్షణ

రామునకు చెప్పినా దోషమే !

రామునకు చెప్పక పోయిననూ దోషమే!

ఇప్పుడు నేను ఏమి చేయవలెను?

అంతా విషమము గా ఉన్నది ….అని హనుమంతుడుఆలోచించసాగాడు.

Also read: సముద్రాన్ని లంఘించిన హనుమ

(ఒక uncertainty ,లేదా అనిశ్చితిలో మన మనస్సు పరిపరి విధాలుగా పోతుంది

Fact (వాస్తవము) ఒకటయితే మన Opinion (అభిప్రాయము) మరొకటి ఉంటుంది! …

ఈ Opinions రకరకాలుగా ఉంటాయి. మనలో దాదాపు చాలామంది ఇలాంటి opinions ను Base చేసుకొనే నిర్ణయాలు తీసుకుంటాము. Proper assessment of ..FACT ..we almost never do …there may be few people ,who do like that …

ఇక్కడ తనకు కలిగిన అభిప్రాయాలన్నింటివలన ప్రభావితుడయ్యి హనుమ ఏం ఆలోచిస్తున్నారో రేపు)

Also read: సరస నోటిలోదూరి బయటకు వచ్చిన హనుమ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles