Friday, April 26, 2024

సన్యాసి – జంతుజాలం

                        ————  ————

                   Hermit and the Beasts

                  ————————————

(From ‘The Wanderer’ by KAHLIL GIBRAN)

అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్

                 11.సంచారి తత్వాలు

                 —————    ——————-

          ఒకానొకప్పుడు  పచ్చని కొండల మధ్య  ఒక సన్యాసి నివాసం ఉండేవాడు. అతడు ఆత్మశుద్ధి మరియు స్వచ్ఛమైన మనసు కల వాడు.  భూచరాలైన  జంతువులు, ఆకాశ యానం చేసే గ్రద్ద, రాబందుల లాంటి పక్షులు జంటలుగా అతని వద్దకు వచ్చేవి.  వాటితో ఆ సన్యాసి మాట్లాడేవాడు. అవి ఆయన చెప్పే మాటలు సంతోషంగా వినేవి. రాత్రి అయ్యే వరకు కదిలేవి కావు. అప్పుడాయన వాటిని ఆశీర్వదిస్తూ , వాటి నివాసాలకు సాగనంపేవాడు.

           ఒక సాయంత్రం వేళ ఆ సన్యాసి వాటికి ప్రేమగురించి చెప్పసాగాడు. ఇంతలో ఒక చిరుత పులి ఇలా అంది ” స్వామీ ! మీరు ప్రేమ గురించి చెబుతున్నారు. మరి మీ సహచరి ఎక్కడ?”

          “నాకు సహచరి లేదు.” అని సన్యాసి జవాబిచ్చాడు.

           జంతువులు, పక్షులు ఒక్కసారిగా  ఆశ్చర్యంతో  అరిచి వాటిలో అవి ఇలా అనుకోసాగాయి ! ” సహచరియే లేనప్పుడు  ఈయన మనకు ప్రేమ, శృంగారం గురించి ఏమి తెలుసునని చెబుతాడు ?!’

             అవి నెమ్మదిగా తృణీకార భావంతో  అక్కడినుండి వెళ్లిపోయాయి.

             ఆ రాత్రి సన్యాసి  పడక మీద బోర్లా పడుకొని  గుండెలవిసేలా దుఃఖించాడు.

Also read: సంచారి తత్త్వాలు

Also read: సంచారి తత్త్వాలు

Also read: హేతువు– తృష్ణ

Also read: సందేహం – సంకల్పం – సందేశం

Also read: ప్రేమా , అసహ్యమూ

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles