Tuesday, September 10, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు – సి.ఎస్. సోమేశ్ కుమార్

  • జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు
  • అధికారులతో చీఫ్ సెక్రటరీ టెలికాన్ఫరెన్స్
  • క్వింటాల్ కు మద్దతు ధర రూ.1960

రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై  జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రతీ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు.

Also read: యాసంగిలో ధాన్యం ఎంత వచ్చినా మేమే కొంటాం : సీఎం కేసీఆర్‌

మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం  చేయాలని  చేప్పారు. జిల్లా కలెక్టరేట్ లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటర్ తోపాటు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తమ జిల్లాలో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారులతోవెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని  సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులచే వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు.

Also read: ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పది ప్రశ్నలు

జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలిని చేప్పారు. గత యాసంగిలో ఏర్పాటు చేసినన్ని కేంద్రాలు గానీ అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలి. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలి. ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. గన్ని బ్యాగుల సేకరణకై ప్రత్యేక దృష్టిని సాధించాలి. దీనికై ప్రత్యేక అధికారిని నియమించి తగు పర్యవేక్షణ చేయాలి. క్వింటాల్ కు రూ. 1960 కనీస మద్దతు ధర గా నిర్ణయించడం జరిగింది. వ్యవసాయవిస్తరణ అధికారుల సేవలను ధాన్యం కొనుగోలు లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. తమ జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఏవిధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలి.సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు తగు వాహనాల ఏర్పాట్లను చేసుకోవాలి. ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలు సమర్పించాలి. జిల్లాలో వారి కోతల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉన్నాయి. వీటి ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలి.పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలి. దీనికై పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలి. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి లు కూడా పాల్గొన్నారు.

Also read: సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఏచూరి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles