Monday, October 7, 2024

అంబేడ్కర్ : బౌద్ధ ప్రమాణాలు

14 అక్టోబర్ 1956న నాగపూర్ లో ఆరు లక్షల మందితో బౌద్ధం స్వీకరిస్తూ డా. బి.ఆర్. అంబేడ్కర్ చేసిన 22 ప్రమాణాలు ఇలా ఉన్నాయి. అందొక చారిత్రాత్మక ఘట్టం. కొన్ని వేల ఏళ్ళ పాటు ఈ దేశంలో వర్థిల్లిన జీవన విధానాన్ని ఆయన ‘నవయానం’ పేరుతో పునరుద్ధరించారు. దాని ప్రభావం అక్కడక్కడ సమకాలీనంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కులమతాల్ని త్యజించి వేలమంది బౌద్ధం స్వీకరిస్తున్నారు. ఈ కృషిలో స్వయం సైనిక్ దళ్ – సమతా సైనిక్ దళ్ (SSD)ల పాత్ర విశేషంగా ఉంది.

  1. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను నేను విశ్వసించను, పూజించను. దేవుడి అవతారాలని భావించబడుతున్న రాముణ్ణి, కృష్ణుణ్ణి నేను విశ్వసించను, పూజించను.
  2. గౌరీ-గణపతి వంటి దేవీదేవతలను కడా నేను విశ్వసించను, పూజించను.
  3. దేవుడి అవతారాలను విశ్వసించను.
  4. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారాలలో ఒకడని విశ్వసించను. అదొక పిచ్చిపనని , అదొక అబద్ధపు ప్రచారమని నమ్ముతాను.
  5. శ్రాద్ధకర్మలు నిర్వహించను. పిండ ప్రదానం చేయను.
  6. బుద్ధుడి బోధనలు అతిక్రమించే విధంగా వ్యవహరించను.
  7. బ్రాహ్మణులతో ఏ పూజాకార్యక్రమాలు జరిపించను.
  8. మానవ సమానత్వాన్ని సంపూర్ణంగా నమ్ముతాను.
  9. సమాజంలో సమానత్వ స్థాపనకు సంపూర్ణంగా కృషి చేస్తాను.
  10. బుద్ధుడి అష్టసమ్యన్ మార్గాన్ని అనుసరిస్తాను.
  11. బుద్ధుడు నియమించిన పది పరిపూర్ణత్వ – పరిమితులు అనుసరిస్తాను.
  12. జీవరాసులన్నింటి పట్ల ప్రేమ – సుహృద్భావంతో వ్యవహరిస్తాను. వాటన్నింటినీ కాపాడుకుంటాను.
  13. దొంగతనం చేయను.
  14. అబద్ధాలు చెప్పను.
  15. కామ, క్రోధాలకు సంబంధించిన నేరాలు చేయను.
  16. మద్యపానానికి గాని, మాదక ద్రవ్యాలకు గానీ బానిసను కాను. (13-17 వరకూ ఉన్నవి నైతికతకు సంబంధించిన అయిదు ముఖ్య సూత్రాలు)
  17. నిత్య జీవితంలో ఆర్యాష్టాంగమార్గాలు  NOBLE EIGHT FOLD PATH (పాలి: అరియ అత్తంగిక మగ్గ) అనుసరిస్తాను. (1. సరైన దృష్టికోణం 2. సరైన పరిష్కారం 3.సరైన మాట 4. సరైన గుణం 5. సరైన జీవన విధానం 6. సరైన ప్రయత్నం 7. సరైన ప్రజ్ఞ 8. సరైన సమాధి. ఈ ఎనిమిది  మార్గాలు ప్రతిఫలించే విధంగా బుద్ధుడి ధమ్మచక్రం రూపొందించబడింది)
  18. అసమానతను, అమానవీయ కార్యాలను ప్రోత్సహిస్తూ, ప్రగతి నిరోధకంగా ఉన్న హిందూమమతాన్ని త్యజించి, నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను.
  19. బౌద్ధధమ్మం మాత్రమే మానవాళికి మేలు చేస్తుందని నమ్ముతున్నాను.
  20. బౌద్ధం స్వీకరించడం వల్ల నాకు ఒక కొత్త జన్మ లభించినట్లు భావిస్తున్నాను.
  21. ఇక నుండి నా జీవితాన్ని బుద్ధుడి బోధనలను అనుసరించి మాత్రమే తీర్చిదిద్దుకుంటానని, బౌద్ధధమ్మం ప్రకారమే జీవిస్తాననీ మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నాగపూర్ లో ధమ్మదీక్ష తీసుకున్న ఆ స్థలం ‘దీక్షభూమి’గా ప్రసిద్ధికెక్కింది. అక్కడ ఈ ఇరవై రెండు ప్రమాణాలతో ఒక శిలాఫలకం ఏర్పాటయింది.

Also read: వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు

(మెల్బోర్న్ నుంచి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles