Saturday, February 24, 2024

ఎన్నిక‌ల్లో ఆత్మగౌర‌వం సంగతేమిటి?

నిన్న, నవంబర్ 26న,  74వ రాజ్యాంగ దినోత్సవం(నేష‌న‌ల్ లా డే) మనమంతా జరుపుకున్నాం. దీన్నే జాతీయ న్యాయ దినోత్స‌వంగా ప‌రిగ‌ణిస్తారు. 75 ఏళ్ల క్రితం జ‌రిగిన విష‌య‌మిది. మ‌న‌కు 1947లో స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టికీ, 1950 సంవ‌త్స‌రంలో మ‌న‌దేశ రాజ్యాంగం త‌యారై, అమ‌లులోకి వ‌చ్చింది. అయితే ఓటు హ‌క్కుతో పాటుగా భార‌త రాజ్యంగంలోని అతి ముఖ్య‌మైన భాగం మాత్రం గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి అంటే 26 జనవరి 1950 కి స‌రిగ్గా రెండు నెల‌ల ముందు 1949, న‌వంబ‌ర్ 26న ప్రారంభ‌మైంది. అంటే, రాజ్యంగం అమ‌లులోకి రావ‌డానికి రెండు నెల‌ల ముందే “ఓటు హ‌క్కు” ఇవ్వ‌టం అనే  ఆస‌క్తిక‌ర‌మైన అంశంపైన చర్చ జరిగింది. కానీ “జీవించే హ‌క్కు” మాత్రం రిప‌బ్లిక్ డే నాడు గుర్తించ‌బ‌డింది (ఇది “ఇవ్వ‌బ‌డింది” కాదు). అంటే, ఓటు హ‌క్కు అనేది కేవ‌లం ఒక వ్య‌క్తీక‌ర‌ణ మాత్ర‌మే అనుకోవ‌చ్చు. ఇది మాట్లాడే హ‌క్కుతో స‌మానం. ఇది మ‌న ప్రాథ‌మిక హ‌క్కు. కానీ యువ‌త‌, విద్యార్థులు దీన్ని గుర్తుంచుకోవ‌డం లేదు.

Sridhar, JUstice Sudershan Reddy, Chukka Ramaiah and K. Ramachandra Murthy

రాజ్యాంగ ప్రవేశిక 

సాధార‌ణంగా, రాజ్యంగ ప్ర‌వేశిక‌లోభార‌త రాజ్యాంగ నిర్మాత‌లు, ప్ర‌త్యేకించి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, సూచించిన ప్ర‌తీ ఒక ప‌ద‌బంధాన్నీ రాజ్యాంగ నిపుణులు అభినందిస్తారు. 22 జనవరి 1947న జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ప్ర‌వేశ‌పెట్టిన అంశాల‌ తీర్మానాన్నిరాజ్యాంగ ప‌రిష‌త్తు ఆమోదించింది. రాజ్యాంగ ప్ర‌వేశికను ఈ ఆద‌ర్శాల ఆధారంగానే రూపొందించారు. ప్ర‌వేశిక‌లోని అంశాల‌ను న్యాయ స్థానంలో అమ‌లుచేయ‌డం సాధ్యం కాక‌పోయినప్ప‌టికీ, భాషలో అస్ప‌ష్ట‌త ఉన్న‌ప్పుడు దానిలోని ఆర్టిక‌ల్స్‌ను వివ‌రించ‌డానికి ఈ ప్ర‌వేశిక లోని అంశాలు ఉప‌యోగ‌ప‌డుతాయి. 

రాజ్యాంగ ప్ర‌వేశిక ల‌క్ష్యాల‌ను చాలామంది అర్థం చేసుకుంటారు. కానీ అందులో ఆత్మగౌర‌వం అనే ప‌దాన్ని వివ‌రించాలి. విద్యావేత్త అయిన చుక్కా రామ‌య్య గురించి తెలియ‌నివాళ్లుండ‌రు. “ఐఐటి రామ‌య్య‌” గా సుప్ర‌సిద్ధులైన ఆయ‌న 1925వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 20న జ‌న్మించారు. ఇటీవ‌లే అభిమానులంద‌రూ ఆయ‌న 99వ జ‌న్మ‌దిన వేడుక‌ను జ‌రుపుకున్నారు. కొన్ని త‌రాలుగా ఇంజ‌నీర్లను త‌యారుచేయ‌డంలో ఆయ‌న పేరుపొందారు. 

రామ‌య్య‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి, ప్ర‌ముఖ ఎడిట‌ర్ కె. రామ‌చంద్ర‌మూర్తి. (www.primepost.in,   www.sakalam.in వెబ్‌సైట్‌లకు ఎడిట‌ర్)కలిసి నమస్కరించారు. 8 జులై 1946న జ‌న్మించిన జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి గోవా మొద‌టి లోకాయుక్త‌, ఉస్మానియా యూనివ‌ర్స‌టీకి న్యాయ స‌ల‌హాదారుగా కూడా ప‌నిచేశారు. 2 మే 1993న ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తి అయ్యారు. 2005లో డిసెంబ‌ర్ 5వ గౌహ‌తి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. ఆ త‌ర్వాత 12 జ‌న‌వ‌రి 2007న సుప్రీంకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి పొందారు. 8 జులై 2011న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఇండియాటుడే జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి గురించి ఇలా ప్ర‌చురించింది:

అనేక అంశాల‌ గురించి మాట్లాడుతుంటారు. కానీ ‘‘ఆత్మగౌర‌వం” గురించి నొక్కి చెప్పాల్సిన అవ‌స‌రం ఉందంటారు. ఈ ముఖ్య‌మైన విష‌యాన్నే ప్రజలు విస్మ‌రిస్తున్నార‌ని జ‌స్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిన‌డానికి తిండి, ఉండ‌టానికి ఇల్లు, క‌ట్టుకునేందుకు బ‌ట్టల గురించి అటు పీఎం, ఇటు సీఎంల మేనిఫెస్టోలు హామీలు ఇస్తుంటాయి. కానీ ఈ మూడు వాగ్దానాలు స‌రిపోతాయా? “గౌర‌వం” మాటేమిటి? జ‌స్టిస్ లేవ‌నెత్తిన విష‌యం రెచ్చ‌గొట్టేదిగా క‌నిపించిన‌ప్ప‌టికీ, ఇది చాలా ముఖ్య‌మైన అంశం. 

ఆత్మగౌర‌వం”తో పాటుగా సౌభ్రాతృత్వం కూడా చాలా ముఖ్య‌మైన‌ది. సాధార‌ణంగా “సౌభ్రాతృత్వం” అంటే సోద‌ర‌భావాన్ని క‌లిగివుండ‌టం. దేశం, దేశ ప్ర‌జ‌లంద‌రితోనూ ఒక భావోద్వేగ‌ప‌ర‌మైన అనుబంధాన్ని క‌లిగివుండ‌టం. అయితే, ఈ సౌభ్రాతృత్వం దేశ ఐక్య‌త‌ను, గౌర‌వాన్ని పెంపొందించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. “ఆత్మగౌర‌వం” అనేదాన్ని నొక్కి చెప్ప‌డ‌మే మ‌న జీవన‌విధానం. సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ‌, స‌మాన‌త్వాలే సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని ఇస్తాయి. 

స‌మాన‌త్వం నుండి స్వేచ్ఛ గానీ, స్వేచ్ఛ నుండి స‌మాన‌త్వం గానీ ఎప్ప‌టికీ విడిపోలేవు. అదేవిధంగా సౌభ్రాతృత్వం నుండి స్వేచ్ఛా, స‌మాన‌త్వాలు విడిపోలేవు. అయితే, స‌మాన‌త్వం లేని స్వేచ్ఛ కొంద‌రు, ఎంతోమందిపై ఆధిపత్యం చెలాయించేలా చేస్తుంది. స్వేచ్ఛ లేని స‌మాన‌త్వం వ్య‌క్తి ప్ర‌య‌త్నాల‌ను చంపేస్తుంది. అదేవిధంగా సౌభ్రాతృత్వం లేని స్వేచ్ఛ కూడా చాలామందిపై కొంద‌రి ఆధిపత్యానికి దోహ‌దం చేస్తుంది. సౌభ్రాతృత్వ భావ‌న‌, స్వేచ్ఛా, స‌మాన‌త్వాలు లేక‌పోతే ఏవి కూడా స‌హ‌జ‌సిద్ధంగా జ‌ర‌గ‌వు. ఎటువంటి వివ‌క్ష లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవితాన్ని జీవించే హ‌క్కు క‌లిగివుండాలి. ఇలా ఒక మ‌నిషిగా గౌర‌వంగా బ‌త‌క‌గ‌ల‌గ‌డం అనేది ఆర్టిక‌ల్ 21 అందించిన ప్రాథ‌మిక హ‌క్కు. రాష్ట్రం నుంచి గానీ, ఇత‌ర వ్య‌క్తుల నుంచి గానీ స‌మాన‌మైన గౌర‌వాన్ని పొందేందుకు దావా వేయ‌డానికి కూడా వారు అర్హులు. మేన‌కాగాంధీ వ‌ర్సెస్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆర్టిక‌ల్ 21లో కొత్త కోణాన్నిచేర్చింది. జీవించే హ‌క్కు కేవ‌లం భౌతిక హ‌క్కు కాదు. ఒక మ‌నిషిగా గౌర‌వంతో త‌న ప‌రిధిలో త‌లెత్తుకుని జీవించే హ‌క్కును ఇది చేర్చింది. 

సుప్రీంకోర్టు పునరుద్ఘాటన

ఆధార్‌, ఐపిసి 377, గోప్య‌త హ‌క్కుల‌పై నిర్ణ‌యాల వ‌ల్ల మాన‌వ ఆత్మగౌర‌వానికి ఉన్న కేంద్రీయ‌త విష‌యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని పున‌రుద్ఘాటించింది. గోప్య‌త (ప్రైవ‌సీ) గురించిన నిర్ణయంలో 120 సార్లు, న‌వ‌తేజ్ జోహార్ కేసులో 128 సార్లు ఈ అంశం ప్ర‌స్తావించ‌బ‌డింది. న్యాయ‌స్థానాలు ఉత్సాహం చూపించిన‌ప్ప‌టికీ, గౌర‌వాన్ని వ‌ర్తింప‌చేయ‌డమ‌నేది సందేహ‌స్ప‌ద‌మే. 

జ‌స్టిస్ కెన్నెడీ న్యాయ‌స్థానాన్ని ఉద్దేశించి రాస్తూ, టెక్సాస్ సోడ‌మీ శాస‌న “స్టిగ్మ” గురించి ఇలా అభివ‌ర్ణించారు. “ఇప్ప‌టికీ కూడా అభియోగాలు మోప‌బ‌డిన వ్య‌క్తికి గౌర‌వం ఇవ్వ‌డ‌మ‌నేది ఒక క్రిమిన‌ల్ నేరంగానే మిగిలిపోయింది”. (లారెన్స్, 539 U.S. వద్ద 575. నెబ్రాస్కా లా రివ్యూ పేజీ 742) రచయిత నియోమి రావ్. “త్రీ కాన్సెప్ట్స్ ఆఫ్ డిగ్నిటీ ఇన్ కాన్‌స్టిట్యూషనల్ లా”, (86 నోట్రే డామ్ ఎల్. రెవ్. 183 (2013).

వాక్ స్వాతంత్య్రం, పునరుత్పత్తి హక్కులు, జాతి సమానత్వం, స్వలింగ సంపర్కుల వివాహం, జీవ‌న విలువ‌ల‌కు సంబంధించిన కేసులను నిర్ణయించేటప్పుడు అమెరికా సుప్రీంకోర్టు, ప్రపంచవ్యాప్తంగా ఇత‌ర రాజ్యాంగ న్యాయస్థానాలు క్రమం తప్పకుండా మానవ ఆత్మగౌరవం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాయి. న్యాయ‌మూర్తులైనా, మేధావులైనా ఆత్మగౌర‌వం అనేది చ‌ట్ట‌ప‌రంగా ఒక ముఖ్య‌మైన విలువ‌గా ప‌రిగ‌ణిస్తారు. కానీ దాని లోతైన అర్థం ఏమిటో మాత్రం ఎవ‌రూ వివ‌రించ‌రు. 

ఆత్మగౌరవం

అయితే, రాజ్యాంగ నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తే.. న్యాయస్థానాలు ఆత్మగౌర‌వం ప‌ట్ల రకరకాల ఆలోచనలు క‌లిగి ఉండ‌వు. సామాజిక విధానం, సమాజంలోని విలువల డిమాండ్లతో వ్యక్తిగత హక్కులను ఎలా సమతుల్యం చేయాల‌నే అంశంపై ఆధారపడి భిన్నమైన భావనలు ఉంటాయి. రాజ‌కీయ సిద్ధాంతం, తత్వ‌శాస్త్రాలు చెప్పే లోతైన అంశాల‌ను బ‌ట్టి రాజ్యాంగ న్యాయ‌స్థానాలు ఆత్మగౌర‌వం గురించి చెప్పే మూడు ర‌కాల భావ‌న‌ల‌ను ఈ ఆర్టిక‌ల్ గుర్తిస్తుంది. రాజ్యాంగ చ‌ట్ట ప‌రిధిలో ఈ అంశాలు ప్రాథ‌మికంగా ఎలా విభిన్నంగా ఉన్నాయో వివ‌రిస్తుంది.  వివాదాస్ప‌ద‌మైన కేసుల్లో ఆత్మగౌర‌వానికి సంబంధించిన అంశాలు త‌ర‌చుగా విభేదిస్తాయి. రాజ్యాంగ న్యాయస్థానాలు మ‌నిషి ఆత్మగౌర‌వంపై ఆధార‌ప‌డితే, దానికి సంబంధించిన వివిధ ర‌కాల భావ‌న‌ల ప‌ట్ల న్యాయ‌మూర్తులు అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అమెరికా రాజ్యాంగ సంప్ర‌దాయాల‌తో క‌లిసి గౌర‌వం అనే ఈ భావ‌న‌ను స‌మ‌ర్థించ‌డానికి ఈ అంశాల‌ను ఎంచుకునేందుకు అవ‌స‌ర‌మైన గ్రౌండ్ వ‌ర్క్ అందించేవిధంగా ఈ రాజ్యాంగ ఆర్టిక‌ల్‌ను రాశారు. ప్రధానమంత్రులుగానో, ముఖ్యమంత్రులుగానో, ఎంపీలుగానో, ఎమ్మెల్యేలుగానో అధికారం చేజిక్కించుకోవాలని ఆశించే రాజకీయ నాయకులు డబ్బుని వెద‌జ‌ల్లుతున్నారు. ఆహార, వ‌స‌తి, దుస్తుల కోసం లెక్క‌లేనంత ఖ‌ర్చుపెడుతున్నారు. స‌బ్సిడీల పేరుతో మేనిఫెస్టోలు త‌యారుచేసినా, ఆక‌ర్ష‌ణీయ‌మైన ప‌థ‌కాలు ఎర చూపినా ఓటమి పాలవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే.. తాము అవ‌మానం భరించలేము అని ప్రజలు అనుకుంటారు. అదొక దారుణంగా భావిస్తారు. అదే ఆత్మగౌర‌వం. దాన్ని భంగపరకుండా కాపాడుకోవాలి. పోలింగ్ బూత్ లో కనిపించని నిర్ణయం అది. అది ఆత్మగౌరవం.  

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles