Sunday, April 28, 2024

పిన్న వయస్సులోనే పిహెచ్.డి పూర్తి చేసిన టిటి క్రీడాకారిణి

వోలెటి దివాకర్

రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం  నుండి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 22 సంవత్సరాల చిన్న వయస్సులోనే పిహెచ్‌డి డిగ్రీ పూర్తి చేసి భారతదేశంలోనే తొలి పిన్న వయస్కురాలైన డాక్టరేట్ గా నిలిచారు. పిహెచ్.డి అవార్డును ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ అందజేసి నైనా జైస్వాల్ ను అభినందించారు.

“భారతదేశంలో 22 సంవత్సరాల వయస్సులో డాక్టరేట్ పొందిన అతి పిన్న వయస్కురాలిగానూ, మొట్టమొదటి అమ్మాయిని అయినందుకు గానూ చాలా ఆనందం వ్యక్తం చేశారు నైనా. ‘తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’. అనే అంశంపై నన్నయ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు మార్గదర్శకంలో ఆమె పరిశోధన పూర్తి చేశారు. స్వయం సహాయక బృందాలు, మైక్రోఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించానని చెప్పారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, మహిళా సాధికారత పరంగా మైక్రోఫైనాన్స్ పాత్ర , ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనదని తెలియజేసారు.

తన విజయ ప్రస్థానం 8 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైందని నైనా తెలిపారు.  లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి 8 సంవత్సరాల వయస్సులో 10వ తరగతి పూర్తి చేసిన ఆసియాలో అతి పిన్న వయస్కురాలుగా, 10 సంవత్సరాల వయస్సులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 13 సంవత్సరాల వయస్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి భారతదేశంలో పిన్న వయస్సులో పట్టభద్రురాలినయ్యానని తెలిపారు. ఆ తర్వాత ఎంఏ పూర్తి చేసి ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలినైన పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యానని చెప్పారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో 16 సంవత్సరాల వయస్సులో పిహెచ్.డి ప్రవేశం పొందానని, ప్రస్తుతం 22 ఏళ్ళ వయస్సులో విజయవంతంగా పిహెచ్.డి పూర్తి చేశానని పేర్కొన్నారు.సివిల్‌ సర్వీసెస్‌కి వెళ్లాలన్నది తన తదుపరి ఆశయమని అన్నారు.

అలాగే  క్రీడా కెరీర్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.. ‘‘నేను అనేక అంతర్జాతీయ టోర్నమెంట్‌లు, కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పాల్గొనాలనుకుంటున్నాను’’ అని అన్నారు.

నైనా జైస్వాల్ పీహెచ్‌డీకి గైడ్ పూర్వ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు మాట్లాడుతూ ఆదికవి నన్నయ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌ గా పని చేస్తున్నప్పుడు ఒక మీటింగ్‌లో నైనా జైస్వాల్‌ని కలిశానని, అప్పటికే ఆమె చాలా చిన్న వయస్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందని ఆమె చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానన్నారు. ఆమె ఇంకా పరిశోధన చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసిందని వెంటనే ఆమెకు నన్నయ యూనివర్సిటీలో చేరమని ప్రతిపాదన చేశాను. ఆమె తన తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తరువాత రోజు విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి అధికారులతో చర్చించి ప్రత్యేక అడ్మిషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పరిశోధనకు గైడ్ మరియు సూపర్‌వైజర్‌గా ఉండి దాదాపుఐదు సంవత్సరాలు ఆమెకు మార్గనిర్దేశం చేసానని చెప్పారు. చాలా మంచి టాపిక్‌ని ఎంచుకుని ప్రత్యేక శ్రద్దతో పరిశోధనను చేసి అద్భుతమైన పుస్తకాన్ని రూపొందించారని చెప్పారు. ఇటీవల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నిష్ణుతులైన మేనేజ్మెంట్ ఆచార్యుల సమక్షంలో పిహెచ్.డి వైవా ను నైనా సడ్మిట్ చేసారని తెలిపారు. తన మార్గదర్శకంలో భారతదేశంలోనే అతిపిన్న వయస్సులో పరిశోధన పూర్తి చేసిన తొలి అమ్మాయి నైనా జైస్వాల్ కావడం, ఆమెకు తాను గైడ్ గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles