Friday, May 3, 2024

అనుకరణ మానవ నైజం

భగవద్గీత 11

‘‘వాడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడు, ఆ నడక గానీ, ఆ ప్రవర్తన గానీ అంతా తండ్రి పోలికే’’ ఈ మాటలు దాదాపు మనందరికీ పరిచయమయినవే. ఏదో ఒక సందర్భంలో మనం విన్నాం! MODELLING అని అంటారు.

దానికి తెలుగు అనువాదం దాదాపుగా ‘‘అనుకరణ’’ అని చెప్పవచ్చు. విషయ పరిశీలన, విశ్లేషణలతొ తను చూసినవారిలో లేదా పరిచయమున్న వారిలోని ఒక నైపుణ్యాన్ని తనదిగా చేసుకొని అనుకరించటం Modelling అంటే.

Also read: సోమరులకు ప్రపంచంలో స్థానం లేదు

మనలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకే ఈ విషయం బోధపడతుంది. ప్రతి విషయంలో మన ప్రవర్తన అంతకు ముందు ఎవరో ఒకరిని చూసి అనుకరించి మనకు అనుగుణంగా మలుచుకున్నదే అయివుంటుంది. ..We emulate!

మన తల్లిదండ్రులో, గురువులో, ఆఫీసులో మన పై అధికారో. ఎవరో ఒకరు అయి ఉంటారు. ప్రతి ప్రవర్తన ఒక యూనిట్‌ అనుకుంటే ఒక మనిషిలో ఎన్నో యూనిట్లు!

ఎవరికి వారే విభిన్నం!

ఒకే తల్లి తండ్రులు కన్న పిల్లలు కూడా ఒక్కలాగ ప్రవర్తించకపోవటానికి కారణం ఇదే!

అసలు ఎందుకు MODELLING చేస్తాం?

Also read: సత్యాన్వేషణలో మూడు మార్గాలు

MODELLING IS THE PROCESS OF REPRODUCING EXELLENCE! అంటే అత్యుత్తమం అని అనుకున్నదానినే మనం అనుకరిస్తాం!

Sri Aurobindo says like this….

The animal is a living LABORATORY in which Nature has, it is said, worked out man. Man himself may well be a thinking and living LABORATORY in whom and with whose conscious Co-operation she wills to work out the SUPER MAN….

మనిషి ఆ స్థితికి ఎప్పుడు చేరుకుంటాడు?

శ్రేష్ఠమైన వాటిని ఎప్పటికప్పుడు అనుకరిస్తూ ముందుకు వెళితేనే!

అందుకే మనిషట భగవానుడు చెపుతున్నారు!

యద్యదాచరతి శ్రేష్ఠః తత్తత్‌ ఏవం ఇతరో జనః

స యః ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే!

ఉత్తములయినవారు దేనిని ఆచరింతురో ఇతర జనులు దానినే ప్రమాణంగా స్వీకరించి తదనుగుణంగా ప్రవర్తిస్తారు.. అంటే శ్రేష్టములయిన (లేదా తాను శ్రేష్ఠులు అని భావించిన వారిని) వారిని అనుకరిస్తారు!

Also read: ప్రసాదభక్తి అంటే ఏమిటి?

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles