Friday, April 26, 2024

విరాట్ కుమార్తె పేరు వమిక

  • ఇన్ స్టాగ్రామ్ ద్వారా తొలి చిత్రం

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్కల కుమార్తె ఫోటో ఎట్టకేలకు బయటకు వచ్చింది. అనుష్క స్వయంగా ఫోటోతో పాటు వివరాలను వెల్లడించింది. విరాట్, అనుష్క తమ ఫ్యామిలీ ఫోటోను తొలిసారిగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా బయట పెట్టారు. అనుష్క పండంటి పాపకు జన్మనిచ్చిన తర్వాత నుంచి బాహ్యప్రపంచానికి తెలియకుండా వివరాలను గోప్యంగా ఉంచారు. పైగా తమ కుమార్తె ఫోటోను సైతం మీడియాకు అందకుండా గోప్యత పాటించారు. బాహ్యప్రపంచానికి తెలియకుండా తమ బిడ్డను పెంచుతామంటూ అనుష్క ట్విట్టర్ ద్వారా తరచూ చెబుతూ వచ్చింది. విరాట్ కొహ్లీ, అనుష్కశర్మల పేర్లలోని అక్షరాలు ప్రతిధ్వనించేలా వమిక అన్నపేరును తమ కుమార్తెకు ఖాయం చేశారు. వమిక రాకతో ఇప్పుడు తమకు ఓ కుటుంబం ఏర్పడిందని, నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిపిన క్షణాలు, ఉత్కంఠతో ఎదురుచూసిన రోజులు ముగిసి ఇప్పుడు ఆనందసమయం వచ్చిందంటూ అనుష్క తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. తన ప్రపంచాన్నంతా ఓ ఫోటో ద్వారా పంచుకొంటున్నట్లు అభివర్ణించింది. మొత్తం మీద విరాట్ కొహ్లీ- అనుష్కల కూతురి ఫోటోతో పాటు పేరు కూడా  బయటకు రావడం విశేషం.

ఇది చదవండి: కెప్టెన్ గా విరాట్ కొహ్లీ స్టయిలే అంత…!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles