Saturday, April 20, 2024

గ్రామాల్లో మార్మోగుతున్న రామ నామం !గందరగోళంలో నాయక గణం

  • పక్కా నెట్ వర్క్
  • పకడ్బందీ ప్రణాళికతోనే విరాళాల వసూలు
  • అయోధ్య వారి హైకమాండ్

రాష్ట్రంలోని మారుమూల అటవీ గ్రామాల్లోనూ శ్రీ రామ నామం మారుమోగుతుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల నాయకగణంలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో మందిర నిర్మాణం విరాళాల సేకరణలో భాగంగా కాషాయ దళాలు  మారుమూల అటవీ గ్రామాలలో ప్రతి ఇంటికి శ్రీరాముని చిత్రపటాన్ని అంటించి, శ్రీరామ మందిరం నిర్మాణం ఆవశ్యకత హిందూ జాగరణ కరపత్రాలు పంపిణీ చేస్తూ జై శ్రీరామ్ అంటూ మేళతాళాలతో కాషాయ జెండాలతో బైక్ ర్యాలీలతో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. హిందూ భావజాలం గల బిజెపి పార్టీకి, తోడుగా అదే భావజాలం ఉన్న విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు విరాళాల సేకరణ లో  ఉత్సాహంగా ఉరకలు వేస్తున్న తీరుతెన్నుల తో వివిధ పార్టీల రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు మొదలైందని చెప్పవచ్చు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలు  గెలిచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గణనీయమైన కార్పొరేటర్ స్థానాలు కైవసం చేసుకున్న బిజెపికి గ్రామాల్లో ఇంతటి ఆదరణ లభించడం తో అధికార పార్టీ ఆందోళనచెందుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు అయోధ్య నగరం హైకమాండ్ నుంచే దిశానిర్దేశం చేస్తూ పక్కా స్కెచ్ తో పకడ్బందీ ప్రణాళికతో  కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలో కొందరు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు పట్ల పార్టీ మారడ మా ?  ఇదే పార్టీలో కొనసాగడం ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా? అనే తర్జనభర్జన ల తొ కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం.

అసెంబ్లీ నియోజకవర్గాలు టార్గెట్ !

దేశవ్యాప్తంగా మందిర నిర్మాణానికి  విరాళాల సేకరణ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ  ప్రత్యేకంగా రాష్ట్రంలో మాత్రం హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి వ్యక్తిగతంగా కలిసి బీజేపీ శ్రేణులు విరాళాలు సేకరిస్తున్నారు.

సేకరణ తీరు ఇలా:

మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కై జిల్లాలోని మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖండ గా నామకరణం చేశారు. ఇందులో కరుడుగట్టిన హిందుత్వ వాదులు 10 నుంచి 15 మంది వరకు ఉంటారు. ప్రతి  నియోజకవర్గంకు ఒక్కరు సమ్ యూజక ( ఇంచార్జ్)  అతడికి మరో సహాయ సమ్  యూజక్ ఉంటారు. ఆ నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి కీలక వ్యక్తులు ఇద్దరు బాధ్యులుగా ఉంటారు. వారు మండలంలోని ప్రతి గ్రామానికి నలుగురు వ్యక్తులకు బాధ్యత లను అప్పగిస్తారు. వారు ప్రతి గ్రామానికి 25 నుంచి 100 మంది వరకు కార్యకర్తలను నియమించుకొని విరాళాలను సేకరిస్తుంటారు. గ్రామాల్లో ముందుగా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు కొన్ని గ్రామాల్లో రాము డి  చిత్రపటాన్ని పట్టుకొని జై శ్రీరామ్ అంటూ మేళతాళాలతో ఊరేగింపుగా కాషాయ జెండాలు, నగర సంకీర్తనలు భజనలు చేస్తూ వారు గ్రామాన్ని  కలియ తిరుగుతారు. మరుసటి రోజు గ్రామంలోని వాడ వాడలా   తిరుగుతూ ఇంటి తలుపులకు శ్రీ రాముడి మందిరం గల స్టిక్కర్లు అంటించి  “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం” విజ్ఞప్తి జాతీయ స్వాభిమాన పున:ప్రతిష్ట అనే రెండు పేజీల కరపత్రాన్ని పంపిణీ చేస్తారు. అందులో సమగ్రంగా అయోధ్య రామమందిర నిర్మాణం, ఆవశ్యకత, నిర్మాణం పొడవు, వెడల్పు, మండపాల సంఖ్య, మొత్తం అంతస్తులాంటి వివరాలు  ఉంటాయి. విరాళాలు ఇచ్చే దాతల కోసం  బ్యాంకు పేరు, అకౌంట్ నెంబర్, సేవింగ్ ఖాతా, కరెంట్ ఖాతా ఐఎఫ్ సికోడ్, పాన్ కార్డు వివరాలు శ్రీ రామ్ జన్మభూమి క్షేత్రం క్యాంపు కార్యాలయం అయోధ్య పట్టణం అడ్రస్, ఈమెయిల్, వెబ్సైట్ వివరాలను అందులో ముద్రించబడి ఉంటాయి.

దాతల పేర్లు ఫోన్ నెంబర్లు నమోదు తప్పనిసరి:

రూపాయలు 10 /-  100/- 1000 /- 5000/- విలువగల రసీదు పుస్తకాలు కార్యకర్తల వద్ద ఉంటాయి విరాళాలు ఇచ్చిన వారి పేరు ఫోన్ నెంబరు  నమోదు చేసి వారికి రసీదు ఇస్తారు. ఇదే సమాచారం కార్యకర్తల వద్ద గల కౌంటర్ ఫైల్ నమోదు చేస్తారు, రసీదు బుక్కు లకు. కోడ్ తో  సీరియల్ నెంబర్ ముద్రించబడి ఉంటాయి. రూపాయలు 5000 చెల్లించిన దాతల రసీదుల లో  పన్ను మినహాయింపు వివరాలు నమోదు అయి ఉంటుంది , ఏరోజు సేకరించిన విరాళాలు మొత్తం నగదును, అదే రోజు బ్యాంకు ద్వారా ట్రస్ట్ కు జమ చేస్తారు ఆలస్యం జరిగితే మరుసటి రోజున తప్పక జమ చేయాల్సి ఉంటుంది.  జిల్లా అసెంబ్లీ బాధ్యులు సమయానుకూల లేదా యాప్ ద్వారా దిశ నిర్దేశిస్తూ సమావేశాలను నిర్వహిస్తూ తమ ప్రధాన బాధ్యు ల.కు సూచనలు సలహాలు ఇస్తుంటారు.

ఫిబ్రవరి మాసం 10 లోగా టార్గెట్ :

విరాళాల సేకరణ వచ్చేనెల ఫిబ్రవరి 10 లోపు దాదాపు వంద శాతం గ్రామాలు పూర్తి చేయాలని లక్ష్యం కాగా జగిత్యాల జిల్లాలో 30వ తేదీ నాటికి దాదాపు 60 నుంచి 70 శాతం లక్ష్యం పూర్తి చేసినట్టు సమాచారం విరాళాలు ఇచ్చిన వారి కొందరి సెల్ఫోన్లకు శ్రీరామ్ తీర్థక్షేత్రం ట్రస్ట్  నుండి మీ విరాళాలు ముట్టి నట్టు  సందేశంతో పాటు వారు మెసేజ్ లు పంపిస్తున్నారు.

హైకమాండ్ అయోధ్య :

ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ నాయకుడు మహారాష్ట్రలోని నాగపూర్ ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కేంద్ర కార్యాలయంతో సంబంధం గల ఓ వ్యక్తిని కలిసి తాను పెద్ద మొత్తంలో శ్రీ రామ్ మందిర్ నిర్మాణం విరాళం ఇవ్వనున్నట్టు తెలపగా ఈ కార్యక్రమానికి  ” హై కమాండ్ అయోధ్య” మీ వద్దకు రామ సేవకులు  వస్తారు వారికి ఇవ్వండి లేదా నేరుగా బ్యాంక్ అకౌంట్ లో వేయండి అంటూ సున్నితంగా తిరస్కరించి హెచ్చరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇక్కడివారు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తూ రామమందిరం నిర్మాణానికి మన వంతుగా విరాళాలివ్వండి అంటూ తమ కుటుంబ సభ్యుల ద్వారా నిర్వాహకులకు విరాళాలు అందిస్తున్నారు.

ప్రజాధనంతో నిర్మాణం” ప్రముఖ” నరసయ్య !

అయోధ్య నగరం లో నిర్మించనున్నారు భవ్య రామ మందిరం కోసం ప్రభుత్వం నుంచి పైసా ఆశించకుండా అట్టి సొమ్ము తీసుకోకుండా దేశ ప్రజలను భాగస్వాములను చేస్తూ వారందించిన ధనంతోనే నిర్మాణం జరుగుతుందని జగిత్యాల జిల్లా “ధర్మ జాగరణ” ప్రముఖు సంగీ నర్సయ్య స్పష్టం చేశారు. అయోధ్య నగరం నుంచి 100  కిలోమీటర్ల వరకు విస్తరింపజేసి నిర్మించనున్న  దేవాలయాలు వివిధ రాష్ట్రాలలోని హిందూ ఆరాధ్య దేవతల ఉప ఆలయాలు సనాతన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఉట్టిపడేలా నిర్మాణాలు జరుగనున్నట్లు ఆయన వివరించారు. దీంతోపాటు  అధునాతనమైన రైల్వే స్టేషన్ వివిధ రాష్ట్రాలకు అనుసంధానం చేస్తూ రైల్వే లైన్లు ట్రాకులు త్వరితగతిన ట్రస్టు వారి ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నట్లు, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం ,అద్భుత కట్టడాలు అయోధ్య నగరం సుందరీకరణకు  పూదోటలు ఇతిహాస లలో ఉన్న ప్రధాన ఘట్టాలు ,ఈ క్షేత్రంలో   హిందూ బంధువులు చూడబోతున్నారు వాటికోసమే సాధుపుంగవులు ,ఆర్ఎస్ఎస్ ప్రముఖులు నిరంతరం శ్రమిస్తున్న టు ఆయన వివరించారు.

భయాందోళనలకు ఇదే కారణమా ?

వివిధ రాజకీయ పార్టీలు ఆయా పార్టీల కార్యవర్గం సంస్థాగత కమిటీలు బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం తదితర అంశాలు తెలిసినవే. ప్రధానంగా ఎన్నికల వేళ ఆయా పార్టీలకు ఉపయోగపడే బూత్ కమిటీల పైన అత్యధిక  శ్రద్ధ కనపరుస్తారు ఎన్నికల్లో బూత్ కమిటీలు కీలకం కావడం తెలిసిందే. గ్రామస్థాయిలో సభ్యత్వ నమోదు కాని, కార్యకర్తలు లేని, గ్రామాల్లోనూ బిజెపి పార్టీ జెండాలు, లీడర్లు, క్యాడర్ లేని  అనేక  గ్రామాలు, మారుమూల అటవీ గ్రామాల్లో  శ్రీ రామ మందిర నిర్మాణం పేరిట జరుగుతున్న జాతర ఓటర్లు , ప్రజల పేర్లు ఫోన్ నెంబర్లు ,గ్రామ సంపూర్ణ భౌగోళిక స్థితిగతులు. దాదాపు 80 శాతం వారి పేర్లు ఫోన్ నెంబర్లు అయోధ్య హైకమాండ్ వద్ద  ఉండడంతో ఆయా పార్టీలలో నాయకగణం లో గుబులు పుట్టిస్తున్న ది.  ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా వారి వద్ద సిద్ధంగా ఉన్న ఈ సమాచారం మేరకు హిందుత్వ భావజాలం గల బిజెపి పార్టీకి ఈ సమాచారం అందిస్తే తమ పార్టీ పరిస్థితి ,తమ నాయకత్వం ,తమ క్యాడర్ పరిస్థితి, ఏం కానున్న దొ? అనివారు భయాందోళన చెందుతున్నట్లు యువతలో, రాజకీయ విశ్లేషకుల లో చర్చ నెలకొంది..

Surendra Kumar
Surendra Kumar
Sakalam Correspondent, Dharmapuri

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles