Saturday, October 16, 2021

వర్షం

ఓ గట్టి జల్లు పడింది

అందరూ చూర్ల కిందికి పరుగెత్తారు

అరగంటనుండి ఆగకుండా

కురుస్తున్నాయి చినుకులు

కొంతమంది తడుస్తూ వెళుతున్నారు.

ఒకసారి చుట్టూ చూస్తే

బిల్డింగులన్నీ స్నానం చేస్తునట్లున్నాయ్.

వర్షం ఆగింది.

పులుకడిగిన ముత్యంలా

మబ్బుల చాటునుండి

బయటికి వచ్చాడు సూర్యుడు.

దుమ్ము ధూళి పోయి

చెట్లు ఆనందంగా ఊగుతున్నాయ్.

తలారా స్నానం చేసిన తర్వాత

తడి జుట్టు

టవల్ తో దులుపుకుంటున్న

మా అమ్మలా ప్రకృతి.

Also read: రణం

Also read: నాగరికథ

Also read: మహర్షి

Also read: నవ్వుల జల్లు

Also read: వీరభోజ్యం

Prof. Rajendra Singh B
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles