Monday, March 20, 2023

మతి లేని మనిషి

                          ————————-

( ‘ MAD MAN ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN )

  అనువాదం: డా. సి. బి.చంద్ర మోహన్

                     19. సంచారి తత్త్వాలు

                     ————- —————-

            సుందరమూ, ఆశ్చర్యకరమూ మరియు పాలి పోయిన ముఖంతో ఉన్న ఒక యువకుణ్ణి ఒక పిచ్చి  ఇంటి(Mad house ) తోటలో కలిశాను.

            నేను అతని ప్రక్కనే బెంచి మీద కూర్చొని      ” ఇక్కడెందుకున్నావు? ” అని అడిగాను.

            ఆ యువకుడు నన్ను ఆశ్చర్యంతో చూసి ఇట్లా అన్నాడు. ” ఇది ఒక అనాలోచితమైన ప్రశ్న. ఐనా గాని, నేను నీకుజవాబు చెబుతాను. మా నాన్న నన్ను అచ్ఛం తన లాగా ఉండాలనుకుంటున్నాడు. నా మామ కూడా నేను తన లాగా ఉండాలని వాంఛిస్తున్నాడు. మా అమ్మ — నేను తన తండ్రిలా విశిష్టంగా ఉండాలని కోరుకుంటోంది. నా సోదరి — ఎప్పుడూ సముద్ర ప్రయాణాలు చేసే మా బావే నాకు ఆదర్శం అంటుంది. నా అన్న — తనలా నేను కూడా మంచి ఆటగాణ్ణి కావాలని అనుకుంటున్నాడు.

             ఇంకా నా టీచర్లు — ఒకరు తత్వ శాస్త్రంలో డాక్టరేట్. ఒకరు సంగీత నిధి, మరొకరు తర్క శాస్త్రంలో దిట్ట — వీరందరూ కూడా, నేను అద్దంలో వారి ప్రతిబింబాలుగా తయారవాలని తహ తహ లాడుతున్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను కొంచెం తెలివిగా , నాకు నేనుగా ఉండగలుగుతున్నాను.”

              అకస్మాత్తుగా, అతను నా వైపు తిరిగి ” మీరు కూడా నా లానే మంచి ‘  చదువు, ‘ మంచి సలహాలతో ఊపిరాడక ఇక్కడికి వచ్చారా ?” అన్నాడు.

             నేను ” కాదు.నేనొక సందర్శకుణ్ణి ” అన్నాను.

            “అయితే గోడకు ఆవలి వైపున ఉన్న పిచ్చి గృహం నుండి వచ్చిన వాళ్లలో మీరూ ఒకరన్నమాట!” అన్నాడా యువకుడు.

Also read: చట్టాలు

Also read: సప్తతి పూర్వార్ధం……లో

Also read: విగ్రహం

Also read: ఇద్దరు సంరక్షక దేవ దూతలు

Also read: యుద్ధమంటే ఏమిటో…..అడుగు

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles