Saturday, April 20, 2024

రణబీర్ కపూర్, అలియాభట్ వివాహం

బాలీవుడ్ అందాల నటీమణి అలియాభట్, అందాల నటుడు రణబీర్ కపూర్ లు గురువారంనాడు ఒక్కటైనారు. సుమారు అయిదు సంవత్సరాల నుంచి వారు కలుసుకుంటూ, ఊసులాడుకుంటూ, పెళ్ళిచేసుకునే విషయం ఆలోచిస్తూ గడిపారు. ముంబయ్ లోని ‘వాస్తు’ అపార్ట్ మెంట్ లో ఏ బాల్కనీలో కూర్చొని అయిదేళ్ళూ కబుర్లు చెప్పుకున్నారో ఆ బాల్కనీలోనే పెళ్ళి జరగడం విశేషం.  కుటుంబసభ్యులూ, కొద్దిమంది మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్ళి జరిగిన తర్వాత పెళ్ళికొడుకూ, పెళ్ళి కూతురూ విడియోగ్రాఫర్లకీ, ఫోటోగ్రాఫర్లకీ సమయం ఇచ్చారు. కెమెరాలు రెచ్చిపోయాయి. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను రణబీర్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అలియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

అలియా ఇలా రాసింది: ‘‘మాకు ఇష్టమైన మా ఇంట్లో మా కుటుంబ సభ్యులూ, దగ్గరి స్నేహితుల సమక్షంలో పెళ్ళి చేసుకున్నాం. గత అయిదేళ్ళూ ఏ వరండాలో కూర్చొని మాట్లాడుకున్నామో అక్కడే పెళ్ళి జరిగింది. ఇంకా జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ  కూర్చోవడం అనవసరమనిపించింది. ప్రేమించుకున్న క్షణాలూ, మనసారా నవ్వుకున్న సందర్భాలూ, మౌనంగా ఉంటూ హాయిని అనుభవించిన సమయాలూ, సినిమాలు చూస్తూ గడిపిన రాత్రులూ, చిన్నచిన్న వాదులాటలూ, పోట్లాటలూ, వైన్ చప్పరిస్తూ చైనీస్ వంటలు తింటూ గడిపిన గడియలూ అన్ని జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. మా జీవితాలలో ఈ మధురమైన క్షణాలలో మా పట్ల ప్రేమనీ, వెలుగునీ పంచిన మీకు ధన్యవాదాలు. ఈ క్షణాలను మరింత ప్రత్యేకమైనవిగా మీ ప్రేమాభిమానాలు చేశాయి. భవదీయులు రణబీర్, అలియా.’’

వారాల తరబడి ఊహాగానాలూ, అంచనాల అనంతరం పెళ్ళి జరిగింది. గురువారం ఉదయం. పెళ్ళిక ముందు చందనోత్సవం జరిగింది. ఈ వివాహాన్ని ప్రత్యక్షంగా తిలకించినవారిలో కరీనా కపూర్, సయిఫ్ అలీ ఖాన్, నీతూ కపూర్, రిధిమాసాహ్నీ, ప్రఖ్యాత కపూర్ కుటుంబాలకు చెందిన మరికొందరు బంధువులు ఉన్నారు. ఆలియా తండ్రి మహేష్ భట్, తల్లి సోనీ రాజ్దాన్, సోదరీమణులు పూజా, షహీన్ భట్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కుమార్తె స్వేతా బచ్చన్, ఆమె భర్త నిఖిల్ నందా పెళ్ళి పెద్దలలో ఉన్నారు. నిఖిల్, రణ్ బీర్ కజిన్స్ అవుతారు. మిత్రులలో ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, అతడి భార్య శ్లోకా అంబానీ, కరణ్ జోహార్, తదితరులు ఉన్నారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles