Monday, March 20, 2023

సప్తతి పూర్వార్ధం……లో

———————————————————————

BETWEEN SEVENTY AND SEVENTY FIVE

BY K.SATCHINANDAN

( ORIGINAL POEM — MALAYALAM

ENGLISH TRANSLATION BY THE SAME AUTHOR)

అనువాదం:  డా.సి.బి.చంద్ర మోహన్

——————————————————————–

సప్తతి పూర్వార్ధం

ఓ కృష్ణ బిలం

  సువిశాల జ్ఞాపకాల మైదానం అది

  మృత్యువులా లోతైనది కూడా!

  దానిలో చిక్కుకుంటే తిరోగతి లేదు మరి !

  వారు (సప్తతి వయస్కులు)–

         పసితనపు పొదల్లో విహరిస్తారు

         వార్ధక్యపు అగాధాల్లోకి

         తలకిందులుగా దూకేస్తారు!

         ఆ వృధ్ధులే యువకులౌతారు!!

          నిజానికి వారు యవ్వనులే!

          వారు ప్రేమించగలరు

           గానానికి చిందులెయ్యగలరు

            సంగ్రామానికీ సంసిధ్ధులే

            విప్లవాలు తెస్తారు కూడా

            కొందరు యువకుల్లా —

            వారు జీవఛ్చవాలు కాదు!

            ఈ సప్తతి వృధ్ధులు

            ఒకోసారి  —

            నిర్హేతుకంగా , నిజాలకు దూరంగా జీవిస్తారు!

            కొన్నిసార్లు, అశ్వారాఢులౌదామను కుంటారు

            పర్వతాలపై, సాగరాలపై

            యధేఛ్చగా ఎగరాలని తలపోస్తారు!

            ఎడారుల్లో గరుడ వాహనంపై

            కానరాని నీటి చుక్కల కోసం

            సంచారం చేస్తారు

            నగ్నంగా వాన చినుకులని ఆస్వాదిస్తారు.

            కవి అవ్యక్త గీతాన్ని కూడా చదువుతారు!

    కొన్నిసార్లు —

             ‘ చరిత్ర వచ్చిన త్రోవనే వెతుక్కుంటోంది

              అనుకుంటారు

              బిగ్గరగా దుఃఖంతో

              అరవాలని కోరుకుంటారు !

   సప్తతి వృధ్ధుల ఏకాకితనం

         వెలసిన రంగులా ఉంటుంది —

         … ఉషోదయ స్వప్నంలా,

         … ఆల్బంలో నిదురిస్తున్న పాత స్నేహంలా!

   వారు నవ్వితే ,

            రవి కిరణాలు

            పల్లె వీధుల్లో తారట్లాడి నట్లుంటాయి !

    వారి స్వేదం —

             నువ్వుల పువ్వుల్లా, మెత్తటి వాసన

             విరజిమ్ముతుంది !

   వారి మాట —

             సావేరి రాగ అవరోహణం

    వారి మధుర ప్రసంగం–

             ఒక గమకం

   ఇవన్నీ మగ వారికే ఎందుకు … అంటారా?!

    మహిళలు —

         ఈ డెబ్బయి, డెబ్బయైదు వయసు

          దాటినట్లే అనిపించదు!

         — సువాసనలు వెదజల్లే

         అమర లోకపు దేవకన్యల

         సుగంధ భరిత చరణాలతో

          గన్నేరు పూల నవ్వుతో

          ముక్తికి ఆహ్వానం పలుకుతూ–

          ఆప్యాయత అనే మెత్తటి ఇంద్రధనసుపై

          అలా … జారి పోతారు !!

( మలయాళం కవితలు తెలుగు పాఠకులకు పరిచయం చేయటానికి, పై కవిత అనువదించబడినది.)

Also read: విగ్రహం

Also read: ఇద్దరు సంరక్షక దేవ దూతలు

Also read: యుద్ధమంటే ఏమిటో…..అడుగు

Also read: దేశాన్ని చూసి జాలిపడు

Also read: పరిపూర్ణ జీవనం

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles