Monday, April 29, 2024

వైఎస్సార్ జగనన్న “శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం”

  • సర్వే ఆఫ్ ఇండియాతో జగన్ సర్కార్ ఒప్పందం
  • గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
  • ప్రతి యజమానికి డిజిటల్ కార్డు
  • సులభతరం కానున్న రిజిస్ట్రేషన్లు
  • సమగ్ర భూ సర్వేతో  కబ్జాలకు చెక్

ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలను జగన్ సర్కార్ ఒక్కొక్కటిగా నేరవేరేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న ‘శాశ్వత భూ హక్కు-భూరక్ష’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వేఆఫ్ ఇండియాతో ప్రతిష్ఠాత్మక ఒప్పందం చేసుకుంది. అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి,  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పథకం ప్రత్యేకతలను వివరించారు. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియాతో కలిపి సమగ్ర సర్వే జరిపి భూమి వివరాలను సవివరంగా పొందు పరుస్తుంది. ఇంటి స్థలం, పొలం, స్థిరాస్తులపై టైటిల్ ఇచ్చిన తరువాత రెండేళ్ల వరకు పరిశీలన నిమిత్తం సంబంధిత గ్రామ సచివాలయంలో ఉంచుతారు. టైటిల్ మీద అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాల్సిఉంటుందిప రెండేళ్ల తరువాత టైటిల్ కు శాశ్వత భూ భూహక్కు లభించడంతో పాటు టైటిల్ ఖరారు చేస్తుంది. అయినా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిహారం చెల్లిస్తుంది.

వందేళ్ల తర్వాత జరుగుతున్న సర్వే     

వందేళ్ల తరువాత జరుగుతున్నందున ఈ వందేళ్లలో ఎన్నో మార్పులు జరిగాయని వాటన్నంటిని సర్వేలో పొందుపరచనున్నారు.  సర్వేలో అటవీ ప్రాంతాన్ని మినహాయిస్తారు. గ్రామాలు, నివాస సముదాయాలు, పట్టణాలు, నగరాలతో కలిపి 1.26 లక్షల చదరపు కిలో మీటర్ల మేర సర్వే నిర్వహిస్తారు. మూడు విడతల్లో మొత్తం 17 వేల 460 గ్రామాలలో సర్వే జరుగుతుంది. పట్టణాలు, నగరాల పరిథిలో 3345.93 చదరపు కిలోమీటర్ల పరిథిలో 10 లక్షల ఓపెన్ ప్లాట్లు, 90 లక్షల మందికి చిందిన 2.26 కోట్ల ఎకరాలను, 40 లక్షల అసెస్ మెంట్ల భూముల్లో సర్వే నిర్వహిస్తారు.

మూడు దశల్లో సర్వే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ సర్వేకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిపి 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఇవి సర్వే ఆఫ్ ఇండియాలో భాగమవుతాయని అన్నారు. ఖచ్చితమైన కొలతలు ఉంటాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. సర్వేలో దోషాలు తలెత్తితే అవి అత్యంత సూక్ష్మ స్థాయిలో రెండు సెంటీ మీటర్లకు మించి ఉండవని  అన్నారు. దీంతో భూ కబ్జాలకు చెక్ పెట్టవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. సర్వేకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 1.26 లక్షల చదరపు కిలో మీటర్లు సర్వేచేస్తున్నట్లు తెలిపారు. 5 వేల రెవెన్యూ గ్రామాల్లో జరిగే ఈ సర్వే తొలివిడత  ఈ నెల 21న ప్రారంభమై జులై 2021 వరకూ కొనసాగుతుందన్నారు. రెండో విడత ఆగస్టు 2021 నుంచి 6500 రెవెన్యూ గ్రామాల్లో 2022 ఏప్రిల్ వరకూ కొనసాగుతుందన్నారు. మిగిలిన గ్రామాల్లో జులై 2022 నుంచి ప్రారంభమై 2023 జనవరితో సర్వే పూర్తవుతుంది. రెండోవిడత సర్వే ప్రారంభమయ్యే నాటికి సంబంధిత గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. సర్వేలో తలెత్తే వివాదాల పరిష్కారానికి 660 మొబైల్ మెజిస్ట్రేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రతి యజమానికి డిజిటల్ కార్డు

భూ సర్వే పూర్తయ్యాక ప్రతి యజమానికి ల్యాండ్ టైటిలింగ్ కార్డు అందిస్తారు. దీనిపై ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుందని సీఎం అన్నారు. ఆస్తి విస్తీర్ణం, కొలతలు, యాజమానికి సంబంధించిన వివరాలతో పాటు ఫొటో క్యూఆర్ కోడ్ లో పొందుపరుస్తారు. సర్వే అనంతరం డిజిటలైజ్డ్ కెడస్ట్రల్ మ్యాప్ తయారు చేస్తారని గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు మ్యాప్ లో ఉంటాయని తెలిపారు. కొలతలు పూర్తయ్యాక సర్వే రాళ్లు పాతుతారని గ్రామ సచివాలయంలో డిజిటలైజ్ చేసిన ఆస్తుల వివరాలను, టైటిల్ రిజిస్టర్ లను ఉంచుతారు. వివాదాల నమోదుకు ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారని సీఎం వెల్లడించారు.

సిబ్బంది నియామకం

భూముల  సర్వేకు  14వేల మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. సర్వే సక్రమంగా నిర్వహించేందుకు సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది కి శిక్షణ ఇస్తుందని వీరికి శిక్షణనిచ్చిన తర్వాతే విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే 9400 మంది సర్వేయర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. జనవరి 26 నాటికి మిగతా సర్వేయర్లకు శిక్షణ పూర్తికానుంది.

సర్వేపై అవగాహన

జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేతో యజమానులకు కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రసార మాధ్యమాలు సర్వేపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని తెలిపారు.

కలెక్టర్లపై గురుతర బాధ్యత

భూసర్వే విధి విధానాలను కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. సర్వేకు సన్నద్ధతపై కలెక్టర్లకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ట్యాండ్‌ టైటిలింగ్‌ అథారిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్నందున జాగరూకతతో వ్యవహరించాలని సీఎం అన్నారు.  జిల్లా స్థాయిలో రిటైర్డ్ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలని అన్నారు.  డ్రోన్స్‌ ద్వారా సర్వే మొదలుపెట్టే సమయానికి గ్రామాల సరిహద్దులు, వాటి మార్కింగ్ ను   పూర్తి చేయాల్సి ఉంటుంది. సర్వే చేసేందుకు ప్రతి మండలంలో ఒక డ్రోన్‌ టీం, డాటా ప్రాసెసింగ్, రీ సర్వే టీంల ఏర్పాటు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.

సర్వే పట్ల హర్షం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు జరుగుతున్న భూ కబ్జాలకు అక్రమ దందాలకు సర్వేతో స్వస్తి పలకవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Also Read: పాల వెల్లువ ద్వారా మహిళా సాధికారత దిశగా జగన్ సర్కార్

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles