కరోనా వైరస్ కారణంగా ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ సేవలను రైల్వే శాఖ రద్దు చేసింది. కొవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ రైలు సేవలను ప్రయాణికుల అవసరాల నిమిత్తం మళ్లీ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రారంభించింది. ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య సేవలు అందించనుంది. సీట్లన్నింటికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
రైలు నెంబర్ 02795 విజయవాడ-లింగంపల్లి రూట్‌లో ఇవాల్టి నుంచి నడుస్తోంది. ఈ రైలు ప్రతీ రోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయల్దేరుతుంది. రాత్రి 10.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రాత్రి 11.20 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. విజయవాడ-లింగంపల్లి రూట్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ రైలు బేగంపేట్, సికింద్రాబాద్ జంక్షన్, గుంటూరు జంక్షన్, మంగళగిరిలో రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
రైలు నెంబర్ 02796 లింగంపల్లి-విజయవాడ రూట్‌లో డిసెంబర్ 10 నుంచి నడుస్తుంది. ప్రతీ రోజు తెల్లవారుజామున 4.40 గంటలకు లింగంపల్లిలో బయల్దేరుతుంది. సికింద్రాబాద్ స్టేషన్‌కు ఉదయం 5.20 గంటలకు చేరుకుంటుంది. పది నిమిషాలు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగి 5.30 గంటలకు బయల్దేరుతుంది. ఉదయం 10.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.