Wednesday, February 1, 2023

చవటాయ్

నాకు వోటు వెయ్యి, ఈ సారా పాకెట్ తీసుకో

నన్ను గెలిపించు, ఈ చీర తీసుకో

నేను మీ వాణ్ణి, ఈ టీవి అందుకో

మనం గెలవాలి, ఈ నోట్లు తీసుకో

ఇదిగో నీకో స్వంత ఇల్లు

ఇదిగో విత్తనాలకు డబ్బు

గిట్టుబాటు అయ్యేటట్టు చూస్తా

రుణ మిప్పిస్తా

తర్వాత మాఫీ చేసేస్తా

నీకు అన్నీ ఇచ్చేస్తా

పేదరికం తరిమేస్తా

నిన్ను కుర్చోబెట్టి మేపుతా

ఎవడబ్బ సొమ్ము

ఎవడు దానం చేస్తున్నాడో

ఆలోచించకుండా

నువ్వు నాకు వోటు వేసేసేయ్

నువ్వు మాగొప్ప చవటవని

దయచేసి మరోసారి నిరూపించుకో.

Also read: బాగుపడాలంటే

Also read: గమ్యం

Also read: ఆకలి కేక

Also read: అరుణం

Also read: శివోహం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles