Monday, October 7, 2024

ప్రకృతిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం ఉత్తమం

భగవద్గీత81

నా భార్య ఇలా ఉండాలి. నా ఉద్యోగం ఇలా ఉండాలి. నా స్నేహితుడు ఇలా ఉండాలి. నా జీవితం ఇలా ఉండాలి. సరే. ఇవ్వన్నీ ఏమిటి? కోరికలు.

నా భార్య అందగత్తెయి ఉండాలి. అలా ఉంటేనే చేసుకుంటాను. …OK… ఆమె మొదట అందగత్తె. ఆ తరువాత ఏదో అనారోగ్యకారణాలో, పిల్లలు పుట్టడం వలననో, జంక్‌ ఫుడ్‌ తినటం వలననో ఆ రూపుమారిపోయి అనాకారిగా మారవచ్చు… నీవనుకున్న స్థితి మారిపోయింది.

నేను కట్టుకున్న స్త్రీ ఫలానా విధంగా ప్రవర్తించాలి. అమ్మాయి మంచిదే కానీ ఆమె mood ఎల్లవేళలా ఒకే విధంగా ఉంటుందా?…ఉండదు కాక ఉండదు కదా!

నా ఉద్యోగంలో నేను ఇలా ఉండాలి. నాకు ఎప్పుడూ సలామ్‌ కొడుతూ జనం ఉండాలి. నా మాట ఎప్పుడూ నెగ్గాలి. ఇది సాధ్యమయ్యే పనేనా?

నా స్నేహితుడు నా మాట ఎప్పుడూ వినాలి. నా కోసమే జీవించాలి. మరి వాడి జీవితం వాడి అభిప్రాయాలు?

Also read: ఉత్తములను ఇతరులు అనుసరిస్తారు

నా జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మరి… ఉద్యోగంలో బాసు చిరాకుతో కోప్పడినప్పుడు, ఇంట్లో భార్య అలిగినప్పుడు, నీకు జ్వరం తగిలి పడకవేసినప్పుడు నీవనుకునే ఆనందం నీ వెంట ఉంటుందా?

అంటే మనము మన జీవితంలో ఇన్ని కోరికలతో బ్రతుకుతున్నాము అన్నమాట!

Modern life has taught us to impose several conditions on ourselves. అనగా ప్రపంచం మనకు కావలసిన విధంగా ఉండాలి అని మనము అనుకుంటున్నామన్నమాట!

ప్రపంచం ఏ విధంగా ఉన్నదో దానిని అది ఉన్న విధంగా మనం చూడటం లేదు అన్నమాట?

Also read: విజ్ఞుల సలహాలు స్వీకరించాలి

నాకు ఒకతనితో పరిచయమయ్యింది. అతను చాలా బాగా మాట్లాడతాడు, ఎదుటివాడిని గౌరవిస్తాడు. స్నేహానికి ప్రాణం ఇస్తాడు. చాలాచాలా బాగా నచ్చాడు. కానీ నాకు ఒక కండిషన్‌ ఉన్నదనుకోండి. అదేమిటంటే ఎదుటివాడు నా కులమయితేనే నాకు ఇష్టం. అలాంటివాళ్ళే మంచివాళ్ళు అనే అభిప్రాయం ఉన్నదనుకోండి. ఒకరోజు అతనిది నాది ఒకటే కులం కాదు అని తెలిసినది అనుకోండి… అంతే స్నేహం గంగపాలేనా? ఇవాళ సమాజపు నడక అదేకదా!

అంటే ప్రకృతిని నేను చూడాలనుకున్న విధంగానే చూస్తున్నాను తప్ప అది ఉన్నవిధంగా నేను స్వీకరించలేకపోతున్నాను… అన్నమాట. ఇలా మనసును కండిషన్‌ చేయటమే కోరికలు పెంచుకోవడం. కండిషన్‌ చేయబడ్డ మనస్సు అశాంతికి కారణమవుతుంది.

భార్యభర్తలమధ్య విడాకులకు కారణాలేమిటి? ఒకరికొకరు వివాహానంతరం నచ్చకపోవటమే కదా! ఈ నచ్చకపోవడం అంటే? ఒకరికి కావలసినట్లుగా ఒకరుండకపోవడం. అంటే ఎదుటివారిని వారున్నవారున్నట్లుగా స్వీకరించలేకపోవడం. అదే స్వీకరిస్తే, అభిప్రాయభేదాలు అలాగే కొనసాగవు కదా!

అసలు అలా స్వీకరించాలి అని ఇప్పటి మన విద్యలు, ఇప్పటి మన సమాజం మనకు నేర్పుతున్నదా? ప్రకృతిని తాను ఉన్నట్లుగా చూడటం భారతీయత. తనకు కావలసిన విధంగా ప్రకృతిని చూడటం పాశ్చాత్య నాగరికత.

భారతీయ మూలాలు దృఢంగా ఉన్నంతకాలం సమాజంలో అశాంతి, భార్యాభర్తలు విడిపోవడం, వత్తిడి ఇవి ఉండేవికావు. ఉన్నా చాలా తక్కువ స్థాయిలో ఉండేవి.

ఎప్పుడైతే సమస్తము మనకనుగుణంగా నడవాలని కోరుకుంటామో, అప్పుడే అశాంతి. అనగా కోరికలను త్యజిస్తే శాంతి. అవి వదిలిపెట్టినవాడే స్థితప్రజ్ఞుడు.

అనగా One who relinquishes conditioned mind is Sthithapragnya. వాడు ప్రకృతిని ఉన్నదున్నట్లుగా చూసేవాడు. తన ఆత్మలో తాను ఆనందం పొందేవాడు.

భగవానుడు అందుకే అన్నారు…

ప్రజహాతి యదా కామాన్‌ సర్వాన్‌ పార్ధ మనోగతాన్‌

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే!

ప్రజహాతి యదా కామాన్‌=కోరికలను ఎవడు విడిచిపెడతాడో

సర్వాన్‌ కామాన్‌ మనోగతాన్‌=మనస్సులోని కోరికలను అన్నింటినీ కూడా వాడు ఆత్మానందముపొంది స్థితప్రజ్ఞుడని పిలవబడతాడు.

Also read: ఫలితంపైన  ఆసక్తి అనర్థదాయకం

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles