Friday, March 1, 2024

ఫలితంపైన  ఆసక్తి అనర్థదాయకం

భగవద్గీత 78

తెనాలి రామకృష్ణుడు సినిమా నా చిన్నప్పుడెప్పుడో చూశాను. అందులో ఒక ముసలి ఫకీరు రోడ్డు ప్రక్కన మామిడి చెట్లు నాటుతూ ఉంటాడు. ఢిల్లీ పాదుషా ఆ వీధి వెంట వెళుతూ ఇతనిని, ఇతను చేసే పనిని గమనించి దగ్గరకు పిలుస్తాడు. “ఏమిటి తాతా నువ్వు చేసే పని. ఆ చెట్టు పెరిగిపెద్ద అయ్యి పండ్లు ఇచ్చేటంతవరకు నువ్వు ఉంటావా? ఏమిటీ పని?” అని ప్రశ్నిస్తాడు. పాదుషాకు వంగి సలాము చేసి, “జహాపనా! మనము నాటేవి మనకోసమా? మన ముందు తరాలవారికోసం. వాళ్ళు ఆనందంగా తినాలంటే మనము ఇప్పడు నాటాలి కదా!” అని బదులిస్తాడు.

Also read: హృదయదౌర్బల్యం విసర్జించాలి

ఆ ముదుసలికి తను నాటే చెట్టు ఇవ్వబోయే పండుమీద ఆసక్తిలేదు. కేవలం చెట్టునాటడము అనే పని మాత్రమే చేశాడు. ఫలితం మీద ఆసక్తిలేదు. అలాగే కొందరు మహా ధనవంతులు తాము సంపాదించినదంతా సమాజానికి ఇచ్చివేసి మళ్ళా సంపాదిస్తూనే ఉంటారు. వారికి సంపాదన ఒక హాబీ. సంపాదన అంటే వారు చేసిన వ్యాపారం వలన వచ్చిన ఫలితం. ఆ ఫలితం మీద ఆసక్తిలేదు.

మనము వచ్చేనెల రిటైర్‌ అవ్వబోతున్నాము. పేపరువారు ప్రకటన (add) కోసం వస్తారు. మీ రిటైర్మెంట్‌ జీవితం ఆనందంగా గడవాలని, ఒక పదిమంది వాళ్ళ డబ్బులతో ప్రకటన వేయిస్తారు. దీనివలన పేపరు వాడికి లాభం తప్ప వేయించినవాడికేమన్నా ఉందా? మహా అయితే నాలాంటి బ్యాంకు మేనేజరుకు ఒక ఉపయోగం. ఫలానా ఆయనకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వస్తాయి, వెళ్ళి అడిగితే డిపాజిట్లు రావచ్చు అని తెలుస్తుంది.

Also read: ప్రాధాన్యక్రమం నిర్ణయించుకోవడం ప్రధానం

రిటైర్మెంట్‌ అంటే విశ్రాంత జీవనమా? ఏ పని చేయనక్కరలేదా?

మన శరీరం సహకరించినంతమేరా ఏదో ఒక పని చేసుకుంటూ పోవటమే. అబ్బే దాని వలన లాభం లేదు అని అంటారు కొందరు. లాభం అంటే ఫలితం. అది డబ్బురూపంలో… ఉహూ! ఈ ఆలోచన కాస్త సవరిద్దాం. భావితరాలకు ఉపయోగపడే ఏ పని అయినా ఎందుకు చేయకూడదు? భగవానుడు కర్మఫలాన్ని వదిలివేయమన్నాడు కానీ కర్మలను కాదు. పైగా ఇంకొక మాట చెప్పారాయన…

ఎవరయితే కర్మఫలాన్ని వదిలివేస్తాడో వాడికే శాంతి. అది పట్టుకునేవాడికి అంతా అశాంతి. అప్పుడే stress మొదలయి BPకి, Diabetesకి, మనం lifestyle disorders అంటామే వాటికి దారితీసేది. ఒక competitive examలో ఫలితం నీ performance మీద ఆధారపడి  ఉండదు. మిగిలిన వారి performance మీద ఆధారపడుతుంది. How best you perform doesn’t matter. How best the others perform ఇది deciding factor.

పిల్లలకు గీతాబోధ చిన్నతనం నుండే చేస్తే పరీక్షలో సెలక్ట్‌ కాలేదనే ఒత్తిడినుండి వారు దూరం అయి కేవలం పరీక్ష బాగా వ్రాయడం మీదనే దృష్టి పెడతారు. ఫలితం దానంతట అదే వస్తుంది.

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్‌

అయుక్తః కామకారేణ ఫలేసక్తో నిబధ్యతే॥

న్యాయంగా సరిగా ఆలోచించేవాడు ఫలితాన్ని కోరకుండా శాంతిని పొందుతాడు. అలా కానివాడికి మిగిలేది అశాంతి మాత్రమే.

Also read: విజయమో వీరస్వర్గమో తేల్చుకో!

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles