Friday, April 26, 2024

సీఎం జగన్ ను ప్రశంసించిన మెగాస్టార్

  • కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు
  • స్వాతంత్ర్య సమరయోధుడికి దక్కిన అరుదైన గౌరవం

కర్నూలు ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతటి గొప్ప దేశభక్తుడి పాత్రను తాను పోషించడం తన అదృష్టమని చిరు ట్వీట్ చేశారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి గుర్తింపు నివ్వడం ఆనందంగా ఉందని చిరంజీవి ట్విటర్ వేదికగా తెలిపారు.

అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడికి దక్కిన గౌరవంగా చిరంజీవి కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నేను నటించడం, ఆయన పాత్రను నేను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి ట్వీట్ లో తెలిపారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. కొణిదెల ప్రొడెక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.

Also Read: కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles