Monday, December 9, 2024

సీతమ్మవలె భూమిలో లభించిన గోదమ్మ

శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్

సీతమ్మవలె గోదమ్మ కూడా భూమిలో దొరికింది. రాజర్షి జనకుడు యజ్ఞానికి పొలం దున్నుతూ ఉంటే చిన్నారి కనపడింది. (కన్నమ్మే కనుక కన్నట్టే కదా). అదేవిధంగా తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో నిరంతరం మంచి పూవులు పెంచి అక్కడి వటపత్రశాయికి పుష్పార్చనచేయడం కోసం తులసి మొక్కల పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే – పూలమాలని అర్థం. ఆ పూవే గోద, గోదాదేవి.  

విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి పేరు భట్టనాథుడు. నిరంతరం చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది. విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే – పెద్ద ఆళ్వారు. శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే.

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, బావిలో తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు. దేవుడికి సమర్పించడానికి కేశం వస్తే అది దోషం, అని ఆ పూవులు వదిలేయాలి.

ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

అయిదేళ్లనాడే 30 పాశురాల తిరుప్పావై గోదమ్మప్రబంధం రచించడం అసాధ్యం. తద్వారా ఆ ప్రేమ భక్తి పెరిగిపోయాయి.  ఆయనే భర్త అనుకున్నాడు. ప్రేమించినాడు. ఆమె తప్పమరెవరినీ నచ్చేవాడిని కాదు. మీకు గోదమ్మకు రంగనాథుడికి పెళ్లి కాదురాదని ఎవరౌనా అంటే కోపం వచ్చేది. ఏడుపు వచ్చేది. కూడికోడలం అని బియ్యంతో వాయినం ఇచ్చేవారు. స్వప్నంలో కూడా రంగనాథుడితోనూ ఉండాలని పెళ్లి అంటే తెలియకపోయినా ఎవరెవరో ఆ మాట అంటే అయితే ఆయనకే పెళ్లి చేసుకుంటాననే గోద. అది సాధ్యం కాదని పెరియాళ్వార్ అంటే ఆవిధంగా అనకూడదంటూ ఏడ్చేదామె. పెళ్లి అంటే పూమాలలు మార్చుకోవడమే పెళ్లి కదా. నేను అల్లిన పూవులు ముడిచి బాగానే ఉందా అనుకుని బావిలో చూసి వటపత్రశాయికి కూడా నచ్చుతుందేలే అనుకుని ఇచ్చేవాడు. అలంకరించిన పూవులనే అర్చకులు ఇస్తూ ఉన్నపుడు కేశం దొరికితే పొరబాటేమో అనుకున్నారు. కాని పదేపదే రోజూ వస్తున్నదని ఓరోజు అర్చకులు అడిగే ఎంత అన్యాయం అని బాధపడుతూ ఉంటే, నాకాపూవులే కావాలని కనుక ఇదే ఇవ్వండి అని వటపత్రశాయి కలలో విష్ణుచిత్తునికి విని ఆశ్చర్యపోయాడు. అయితే ఆ తల్లి నాక రక్షకురాలు అని అంటే ఆండాళ్ అని కీర్తించారు. ఆ విషయం విన్నతరువాత అర్చకులు భక్తులంతా మీకే కాదు మా అందరికీ ఆండాళ్ అని నమస్కరిస్తారు. గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతం ద్వారా లక్ష్మీ శరణాగతి, పరమాత్మశరణాగతి కోరుకున్నారు.

మొత్తం 108 క్షేత్రాలలో ఏ విష్ణువు మూర్తి మీకు నచ్చారు అని సరదాగా అడిగితే బృందావనం, వేంకటాచలం, శ్రీరంగంలో చాలా ఇష్టపడ్డారు. అందులో ఒక్కొక్క మూర్తికి ప్రశ్నలడిగి శ్రీరంగనాథుడే కావలన్నారట. పెరయాళ్వార్, గోదా సహా 11 ఆశ్వారులు పాశురాలతో మంగళాశాసనాలు చేసారు. 12 పన్నిద్దళ్వార్లలో ఒక్క మధురముని గారే మంగళాసనం చేయలేదు. పాండ్యరాజు కలలో కనిపించి గోదాదేవిని వధుసాలంకరంగా పల్లకితో శుల్కం తో సహా పంపించారని కోరారు. పెరియాళ్ స్వయంగా కన్యాదానం చేసి వరమాలతో శ్రీరంగనాథ మూలవరులకు ముందు నిలిచి, కర్పూర హారతి వలె ఓ క్షణాన వెలిగిపోయి  సశరీరంతో గోదమ్మ మూలవరునిలో విలీనమైపోయారు. గోదాదేవి వలె తొండరడిప్పొడి ఆళ్వార్ (విప్రనారాయణ) కూడా ఒక వెలుగై శ్రీరంగనిమూలవరునిలో సశరీరంగా కలిసిపోయారు. ఈ చరిత్రమంతా శ్రీకృష్ణదేవరాయుడు ఆముక్త మాల్యద గా కావ్యాన్ని రచించారు. అన్నమాచార్యుడు చూడరమ్మ సతులార అనే కీర్తన పాడినారు.

|| చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ |

కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||  సోబానే సోబానే సోబానే సోబానే

|| శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు |

కాముని తల్లియట చక్కదనాలకేమరుదు |

సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |

కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి || “చూడరమ్మ”

|| కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు |

తలపలోక మాతయట దయ మరియేమరుదు |

జలజనివాసినియట చల్లదనమేమరుదు |

కొలదిమీర ఈ చూడికుడుత నాంచారి || “చూడరమ్మ”

|| అమరవందితయట అట్టే మహిమయేమరుదు |

అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |

తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె |

కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి || “చూడరమ్మ”

(ఈ పాటను https://www.youtube.com/watch?v=c-VQziaApHY శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ స్వరపరచి పాడిన అన్నమాచార్య కీర్తనలు చూడరామ సతులాల వినండి.) అని టిటిడి వక్త శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్ ఇద్దరు తిరుమల శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములు తిరుమల జీయర్ మఠం సన్నధిలో తిరుప్పావై గోష్టి లో చివరి 30వ పాశురం విశేషాలను వివరించారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles