Friday, April 19, 2024

ప్రసాదభక్తి అంటే ఏమిటి?

భగవద్గీత – 8

మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఎన్ని తీర్ధాలలో మునిగినప్పటికీ మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా లేక పోతే అవన్నీ నిరర్ధకము.

మన దేహమో, మన జీవాత్మో, మన ఇంద్రియాలో మన మోక్షానికి, మన బంధనాలకు కారణం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే!

Also read: ఏది పగలు, ఏది రాత్రి?

మరి కారణం ఏమిటయ్యా? విచారిస్తే మనస్సే అన్నిటికీ కారణం అని తెలుస్తున్నది. ఇది మనకు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు ఇలా చెపుతారు!

భ్రమన్‌ సర్వతీర్ధేషు స్నాత్వా స్నాత్వా పునః పునః

నిర్మలమ్‌ న మనో యావత్‌ తావత్సర్వం నిరర్ధకమ్‌

నదేహో నచజీవాత్మా న ఇంద్రియాణి పరంతప

మనః ఏవ మనుష్యాణామ్‌ కారణం బంధమోక్షణాత్‌.

అదే వ్యాసుల వారు ఇంచుమించు అదే అర్ధం వచ్చేటట్లు భగవద్గీతలో పరమాత్మ చెప్పిన విషయాన్ని చెపుతారు!

Also read: నిండిన చెరువు

ప్రసాదేసర్వదుఃఖానామ్‌ హానిరస్యోపజాయతే. అని అంటారు భగవానుడు.

అనగా! మనోనిర్మలత కలిగిన ఈ స్థితప్రజ్ఞునికి సర్వదుఃఖములయొక్క నాశనము జరుగుచున్నది!

మనం దేవాలయములకు వెళ్ళినప్పుడు ఈ ప్రసాదభక్తి కలగాలి, అంటే మనోనిర్మలత్వంతో కూడుకున్న భక్తి అన్నమాట అంతేకానీ 100 రూపాయలకు 3 లడ్లు కొనుక్కునే ‘‘ప్రసాదం’’ భక్తి కాదు!

Also read: విషయవాంఛల విషవలయం

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles