Wednesday, May 8, 2024

ప్రాధాన్యక్రమం నిర్ణయించుకోవడం ప్రధానం

భగవద్గీత 76

ఒక ఊరు. అందులో ఒక పోష్టాఫీసు. ప్రతిరోజూ వందల ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఉన్నది ఒక్కడే Postman. అన్ని ఉత్తరాలు సకాలంలో అందరికీ బట్వాడాచేసి తన ఇంటికి త్వరగా వెళ్ళాలంటే… చాలా తక్కువ సమయంలో తిరగవలసిన దూరం ఏది… అనగా సాధ్యమైనంత అతి తక్కువదూరం ఏదో ముందు ఆయన తెలుసుకుని, తదనుగుణంగా తన ఉత్తరాలు ఒక క్రమపద్ధతిలో పేర్చుకొని ఆ విధంగా తిరుగటం మొదలుపెడతాడు.

Also read: విజయమో వీరస్వర్గమో తేల్చుకో!

He has to find out shortest possible route. ఇది Mathematics-Graph theoryలో Chinese postman problem పేరిట బోధిస్తారు. అనగా ఆ postmanకి తాను చేయబోయే పనిపట్ల, ఆ పని ఎలాచేయాలో అనే దానిపట్ల, ఆ ఊరిలో ఉన్న వీధులపట్ల పూర్తి అవగాహన ఉండాలి. He should know his work. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసి ఉండాలి.

“KNOW YOUR WORK” అని ABDUL KALAM గారు ఒక ఉపన్యాసంలో చెపుతారు. ఆఫీసు పనిఅయిపోయిన తరువాతకూడా నీ ముందు ఫైళ్ళు పేరుకొనిపోయి ఉన్నాయంటే నీవు Efficientగా పనిచేయడంలేదు అని అర్ధం. అనగా నీ ప్రాధాన్యతలను నీవు నిర్ణయించుకోలేక గందరగోళంలో ఉన్నావు అని అర్ధం. అందుకే, ‘PLAN YOUR WORK – WORK YOUR PLAN’ అని అనుభవజ్ఞులు చెపుతారు. మరి దీనికి గీతకు ఏమిటి సంబంధం?

Also read: నీ మనసే నీ మిత్రుడు

నాలుగవ అధ్యాయంలో పదహారవ శ్లోకంలో పరమాత్మ ఒక విషయం చెపుతారు.

‘‘చేయదగిన పని ఏమిటి, మరియు చేయకూడని పని ఏమిటి? (What to do and What not to do) దీనిని నిర్ణయించుకోవటం గొప్ప గొప్ప ఋషులకు, మునులకు, దేవతలకు కూడా అత్యంత క్లిష్టమైన విషయము.

కిం కర్మ కిమకర్మేతి కవయో?ప్యత్ర మోహితాః

తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్జ్ఞాత్వా మోక్ష్యసే?శుభాత్‌

పండితులుకూడా కర్మ ఏదో, కర్మకానిది ఏదో తెలియక తికమకపడుతున్నారు. సంసార బంధనములనుండి విముక్తి పొందడానికి అవసరమైన కర్మస్వరూపం ఏదో వివరిస్తాను వినుము.

అధ్యాత్మిక విషయాలలో కానీ, ఆఫీసుపనిలో కానీ, ఇంటివ్యవహారాలలో కానీ… నీ ప్రాధాన్యతలు నీవు నిర్ణయించుకోకుండా అడ్డదిడ్డంగా చేస్తే అష్టకష్టాలు పడటం ఖాయం. Does and Don’ts తెలిసి ఉండాలి. అప్పుడే ముక్తి. Liberation లేకపోతే శ్లేష్మంలోపడ్డ ఈగలాగ గిలగిల తన్నుకోవాల్సిందే…

Also read: సంకల్పాలు త్యజించినవాడే యోగి!

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles