Sunday, May 5, 2024

సత్తా చాటుతున్న భారత కార్పొరేట్ కంపెనీలు

  • హురున్ గ్లోబల్ – 500 జాబితా విడుదల
  • 11 భారత కంపెనీల విలువ 60 లక్షల కోట్లు
  • రిలయస్స్ కు ప్రపంచంలో 54వ స్థానం
  • యాపిల్ వరల్డ్ నెం.1

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన తొలి 500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి 11 ప్రైవేటు కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. విలువైన కంపెనీలతో అంతర్జాతీయంగా భారత్ పదో స్థానంలో నిలిచింది. భారత్ కు చెందిన కార్పొరేట్ కంపెనలీల విలువ 14 శాతం పెరిగి 60 లక్షల కోట్లకు చేరుకున్నట్లు హురూన్ గ్లోబల్ 500 నివేదిక వెల్లడించింది.మొత్తం అంతర్జాతీయ 500 కంపెనీల విలువ 50 లక్షల కోట్ల డాలర్లని హురున్ తెలిపింది. ఇది ప్రపంచంలోని ఆరు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్, బ్రిటన్ ల జీడిపీకి సమానం. హురున్ 500 కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ కంపెనీలు చైనా జీడీపీ కంటే ఎక్కువగా సుమారు 18 లక్షల కోట్ల డాలర్ల విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం.


రిలయన్స్ భారత్ లో నెం.1:

ఇక ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. కరోనా మహమ్మారిని కూడా తట్టుకుని నిలబడ్డ రిలయన్స్ డిసెంబరు 1 నాటికి కంపెనీ విలువ 20.50% పెరిగి 168.8 బిలియన్ డాలర్లకు చేరగా, అంతర్జాతీయ కంపెనీల జాబితాలో 54 వ స్థానంలో నిలిచింది. టాటాలకు చెందిన టీసీఎస్ విలువ 30 శాతం పెరిగి 139 బిలియన్ డాలర్ల చేరుకుంది.ఆ తరువాత స్థానాల్లో వరుసగా టీసీఎస్ హెచ్ ఢీఎఫ్ సీ బ్యాంక్ హెచ్ యూఎల్ ఉన్నాయి. టాప్ 500 జాబితాలో చోటు దక్కినా గత సంవత్సరం ఐటీసీ లిమిటెడ్ విలువ 22%, ఐసీఐసీఐ బ్యాంక్ విలువ 0.5% తగ్గాయి.

హురున్ టాప్-500లో అగ్రస్థానంలో యాపిల్:

హురున్ టాప్ – 500 కంపెనీల జాబితాలో యాపిల్ 2.1 లక్షల కోట్ల డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత డాలర్ రేటు ప్రకారం ఇది సుమారు 155.4 లక్షల కోట్లు. 1.6 లక్షల కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్, అమెజాన్ లు ఆ తర్వాతి స్థానంలోనిలిచాయి.

భారత్ టాప్-11లో ముంబయిలో 7 కార్యాలయాలు:

భారత్ కు చెందిన 11 అత్యంత విలువైన కంపెనీలలో ఏడు దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోనే ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి. పూణె, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీలలో మిగతా నాలుగు సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విలువైన కంపెనీలలో 242 సంస్థలు అగ్రరాజ్యం అమెరికాలోనే ఉన్నాయి. చైనాలో 51 జపాన్ లో 30 ఉన్నట్లు హురున్ నివేదిక తెలిపింది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles