Monday, May 6, 2024

4 విమానాలలో అఫ్ఘాన్ నుంచి భారతీయులు క్షేమంగా దిల్లీకి రాక

దిల్లీ: కాబూల్ లో చిక్కుకున్న భారతీయులలో కొందరు ఆదివారం ఉదయం దిల్లీ దగ్గర హిండన్ విమానాశ్రయంలో క్షేమంగా దిగారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం 168 ప్రయాణికులను తీసుకొని కాబూల్ నుంచి నేరుగా దిల్లీ వచ్చింది. వారిలో 107 మంది భారతీయులు. 24 మంది అఫ్ఘానై పౌరులైని సిక్కులూ, ఇద్దరు అఫ్ఘాన్ సెనేటర్లు దిల్లీలో దిగిన ప్రయాణికులలో ఉన్నారు.

అఫ్ఘాన్ నుంచి వచ్చినవారందరికీ టీకాలు విమానాశ్రయంలోనే వేశారు. ఆర్ టీ పీసీఆర్ పరీక్షలు కూడా అందరికీ చేశారు. తాలిబాన్ తన ఇంటిని తగులబెట్టారని చెబుతూ ఈ విమానంలో వచ్చిన అఫ్ఘాన్ మహిళ విలపించింది. తనను ఆదుకున్నందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పింది.

కడచిన రెండు దశాబ్దాలలో నిర్మించిన వ్యవస్థ అంతా కుదేలైపోయింది. ఇప్పుడు అక్కడ అంతా శూన్యం,’’అంటూ బోరున విలపించారు అఫ్ఘాన్ పార్లమెంటు సభ్యుడు నరేంద్రసింగ్ ఖల్సా. తజికిస్తాన్ రాజధాని దుషాన్ బే నుంచీ, కతార్ రాజధాని దోహా నుంచీ ఆదివారం ఉదయమే మూడు విమానాలు (విస్తారా, ఇండిగో, ఎయిర్ ఇండియా)దిల్లీలో దిగాయి. ఈ విమానాలలో మొత్తం 135 మంది భారతీయులు వచ్చారు.  భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొని రావడానికి రోజుకు రెండు విమానాలను వినియోగించడానికి అమెరికా, నాటో దళాలు అనుమతి మంజూరు చేశాయి. కాబూల్ లోని హమీద్ కార్జాయ్ విమానాశ్రయం అమెరికా, నాటో దళాల అధీనంలో ఉంది.

భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలియబర్చుతూ ట్వీట్లు పెట్టారు. ‘భారత్ మాతా కీ జై’  అంటూ నినాదాలు చేస్తూ విమానం ఎక్కుతున్న భారతీయులను చూపించే చిన్న వీడియోను కూడా పంపించారు. విమానాశ్రయం వెలుపల భారతీయులను తాలిబాన్ వేధించారు. వారిని పోలీసు స్టేషన్ కు తీసుకొని వెళ్ళి ప్రశ్నించారు. వారిని తాలిబాన్ అపహరించారంటూ స్థానిక పత్రికలలో వార్తలు రావడంతో అధికారులూ, బంధువులూ కలత చెందారు. కాబూల్ నూ, అఫ్ఘానిస్తాన్ లో అత్యధిక ప్రాంతాన్నీ గత ఆదివారం ఆగస్టు 15న తాలిబాన్ స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. భారతీయులక స్వాంతంత్ర్యం వచ్చిన రోజు అఫ్ఘాన్లు స్వాంతంత్ర్యం కోల్పోయారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles