Friday, May 3, 2024

సన్యాసి అంటే ఎవరు? కులం, వర్ణం అంటే ఏమిటి?

భగవద్గీత – 25

Retinue of servants at beck and call, fleet of vehicles, all available luxuries to enjoy and giving some eatables in a stylish manner as prasada to the so called devotees, seeking donations for erection of empires… this is the scene we find when we visit a modern Sansyasi!

ఒక పరివ్రాజకులు, తన కరుణాదృష్టి శిష్యుల మీద సదా ప్రసరింపచేస్తూ ఒక ఊరి నుండి మరియొక ఊరికి పాదచారియై ప్రయాణిస్తూ, అనుగ్రహభాషణం చేస్తూ, ధర్మప్రబోధం చేస్తూ తాను నిత్యానుష్ఠాన పరుడై ప్రజలను ధర్మమార్గంలోకి నడిపించే మహానుభావుడు.

Also read: అంతా ఆత్మస్వరూపమే!

కంచిపెద్దస్వామి వారు చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామివారు! ఆయన పరివ్రాజక ధర్మాన్ని తు.చ. తప్పకుండ ఆచరించిన యోగిపుంగవుడు.

సన్యాసాశ్రమానికి ఒక నిర్వచనం.

పాడుబడ్డ ఇంట్లో మఠం స్థాపించి, పతనమయిపోతున్న విలువలు సముద్ధరించి, నా దేశం నాధర్మం అంటూ అహర్నిశం పరితపించి చేతిలో చిల్లిగవ్వ లేకుండా గురువుపట్ల అచంచల విశ్వాసంతో ప్రపంచానికి భారతావని గురించి చాటి చెప్పిన మహర్షి స్వామి వివేకానందుడు.

అసలు భిక్ష స్వీకరించడానికి చేతిలో పాత్ర కూడా లేకుండా తమ కరాలనే పాత్రలుగా చేసుకొని ఒక గుడ్డ ముక్క మాత్రమే శరీరాన్ని కప్పుకోవటానికి ఉంచుకుని రాగద్వేషాలకు అతీతులయి సత్యాన్వేషణ చేస్తున్న మహనీయులు ఎందరో ఈ దేశంలో.

Also read: ఎవరి జాతకం ఏమిటో ఎలా తెలియాలి?

మనిషి తన స్వభావాన్ని బట్టి తన వృత్తి నిర్ణయంచుకుంటాడు! అతని వృత్తిని బట్టి అతని వర్ణం!

Teachers and scientists, business men, politicians, men opting for Service. ఇవే కదా మనం వేరే భాషలో చెప్పినప్పటికీ అవే వృత్తులు! ఇంతకంటె ఎక్కువ classification చేయగలమా మనం?

పుట్టుకతోనే నిర్ణయించబడేది కాదు కులం! కుల సంఘాలు సమాజంలో పుట్టించే కలకలం మనం చూస్తుంటే మనసు పడే వేదన వర్ణనాతీతం.

చివరకు ఎవరో వివేకానందస్వామిని కూడా మీ కులం ఏమిటి అని అడిగారట! అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఈ శరీరం ‘‘కాయస్థం’’!

సన్యాసి అంటే ఎవరు? కులం, వర్ణం అంటే ఏమిటి?

సుస్పష్టంగా గీతాకారుడు చెప్పినప్పటికీ మన తలకెక్కటంలేదు.

మన అజ్ఞానం ఎక్కడిదాకా విస్తరించింది అంటే! మనిషి ఎవరయినా చనిపోతే భగవద్గీత వినిపించడం దాకా! గీతా శ్లోకం ఒక్కటి కూలంకషంగా తెలిస్తే చాలు బ్రతుకు గడపటానికి! అది జీవితనౌకకు చుక్కాని! అంతే గానీ చావుకు వినిపించేది కాదు.

మనిషి జీవితాన్ని ఎలా గడపాలి! సమస్యలను ఎలా ఎదుర్కోవాలి.

ఆత్మగౌరవంతో ఎలా బ్రతకాలో తెలియాలనుకుంటే గీతలో కనీసం ఒక్క శ్లోకాన్ని అయినా నేర్చుకొని ఆచరణలో పెట్టటానికి ప్రయత్నం చేస్తే చాలు. జన్మ చరితార్ధమవుతుంది!

Also read: రాగద్వేషాలను విడిచినవాడు సన్యాసి!

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles