Tuesday, January 31, 2023

నారా లోకేష్‌కు తప్పిన ప్రమాదం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకుడూ, మాజీ మంత్రి నారా లోకేష్ కు కొద్దిలో ప్రమాదం తప్పింది.  పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ సోమవారంనాడు ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు.  ఆ ట్రాక్టర్ అదుపుతప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ  మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపుచేశారు. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles