Friday, April 19, 2024

అగ్రీగోల్డ్ కేసుపైన త్రిసభ్య సుప్రీం బెంచ్ విచారణ

  • హైకోర్టు నుంచి కేసును సుప్రీంకి బదిలీ చేయమని కోరడం లేదన్న న్యాయవాది శ్రావణ్
  • కేసును సత్వరంగా విచారించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసుకోవచ్చునన్న జస్టిస్ లావు నాగేశ్వరరావు

దిల్లీ: తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన త్రిసభ్య బెంచ్ ముందు ఈ కేసు విచారణ జరిగింది.

అగ్రిగోల్డ్  సహా అనేక సంస్థలు లక్షల మంది డిపాజిటర్లను తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిషా, మహారాష్ట్ర, తమిళనాడు, అండమాన్ నికోబార్ రాష్ర్టాలలో మోసం చేశాయని పిటిషన్ లో అసోసియేషన్ అధ్యక్షులు ఆండాళ్ రమేష్ బాబు ఆరోపించారు. అగ్రిగోల్డ్ కేసును హైదరాబాద్ హైకోర్టు 2015 నుంచి విచారించి పలు ఆదేశాలు ఇవ్వగా గత ఏడాది మార్చి నుంచి కేసు విచారణ నిలిచిపోయిందని పేర్కొన్నారు. దీని వల్ల అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, ఎపి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిన 1050 కోట్ల పంపిణీ కి ఆటంకం కలుగుతోంది పేర్కొన్న పిటిషనర్

అగ్రిగోల్డ్ సహా అనేక కంపెనీల ఆస్తులను ప్రభుత్వాలు అటాచ్ చేశాయి తప్ప వాటిని విక్రయించి డిపాజిటర్లకు తిరిగి చెల్లించడం లేదని పిటిషనర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం అక్రమ డిపాజిట్ల సేకరణ నిరోధక చట్టం-2019 తీసుకువచ్చినా అది దేశంలో అమలు కావడం లేదని పిటిషనర్ వివరించారు. కేంద్రం డిపాజిటర్ల సంక్షేమం కోసం తెచ్చిన చట్టాన్ని అమలు చేయడంతో పాటు, హైదరాబాద్ హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న తమ కేసులో 1050 కోట్లు ఎపి ప్రభుత్వం పంపిణీ చేసేలా, ఆస్తుల వేలం త్వరగా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.

కేసు విచారణ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు పిటిషన్ లోని అంశాలపై పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ను వివరణ కోరారు. అగ్రిగోల్డ్ కేసు హైదరాబాద్ హైకోర్టు లో విచారణ జరగడమేకాక అనేక ఆదేశాలు ఇచ్చిందని మీరే చెబుతున్నారు , కరోనా మహమ్మారి వల్ల కొంత కాలంగా విచారణ జరగకపోయుండొచ్చని అభిప్రాయ పడ్డారు. హై కోర్టులో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరితే ఎలా అని ప్రశ్నించారు. హైకోర్టు నుంచి కేసు బదిలీ చేస్తే, పిటిషనర్ కేసుపై నోటీసు ఇస్తే ఇక్కడ మరో పదేళ్లు ఆలస్యం అవుతుందని వ్యాఖ్యానించారు.

దీనికి స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ తాము హైకోర్టు నుంచి కేసును సుప్రీంకోర్టు కు బదిలీ కోరడం లేదని వివరించారు. హైకోర్టులో పెండింగ్ కేసును త్వరగా విచారించమని సూచిస్తే చాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్, కేసు విచారణ వేగంగా చేయాలని హైదరాబాద్ హైకోర్టుకు విన్నవించాలని, లక్షల మంది డిపాజిటర్ల అంశం ముడిపడి ఉన్న విషయాన్ని హైకోర్టుకు తెలియజేసే వెసులుబాటు కల్పిస్తూ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles