Friday, April 26, 2024

ఒడిశా లో సింగరేణి అధికారులు

  • గనుల ప్రాంతాల్లో అధికారుల సందర్శన
  • అనుమతులపై ప్రభుత్వ అధికారులతో చర్చలు
  • బొగ్గు రవాణాకు ప్రత్యేక రైలు మార్గం

ఒడిశా రాష్ట్రంలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనిబ్లాకు, న్యూ పాత్ర పాద బొగ్గు బ్లాకుల కు సంబంధించి పలు అంశాలపై సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ అండ్ బలరాం సారథ్యంలో ఉన్నతాధికారుల బృందం మంగళవారం నాడు లో పర్యటించింది. సింగరేణి ఉన్నత స్థాయి అధికారులు  ప్రభుత్వ ఉన్నతాధికారులు తో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ బృందంలో డైరెక్టర్ తో పాటు అడ్వైజర్ మైనింగ్  డి ఎన్  ప్రసాద్ ,అడ్వైజర్  నైని  విజయ రావు, జిఎం ఎస్టేట్స్  ఎస్.డి.ఎం సుభాని ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.

డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్  అండ్ బలరాం సారధ్యంలోని ఈ బృందం  రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి  వినీల్ కృష్ణ ను కలిసి నైని బ్లాకు సంబంధించి సహాయ సహకారాలు, న్యూ పాత్ర బ్లాకు కు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేయాల్సిన అనుమతుల గురించి వివరించారు . న్యూ పాత్ర పద గనికి సంబంధించి  భూ సేకరణ తో పాటు పూర్తిస్థాయి సోషియో ఎకనామిక్ సర్వే ను చేపట్టాలని సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ విజ్ఞప్తి చేయగా గా వీటిపై స్పెషల్ సెక్రటరీ పూర్తి సానుకూలత వ్యక్తం చేస్తూ సింగరేణి గనుల కు రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభిస్తుందనే హామీ ఇచ్చారు.

Also Read: సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ల విస్తరణ

ఇదే ప్రాంతంలో సింగరేణి తో పాటు గనులను నిర్వహిస్తున్న  మినరల్ కార్పొరేషన్, మహానది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ హిందాల్కో, నాల్కో, కెపిసిఎల్ వంటి సంస్థలతో కలిపి బొగ్గు రవాణా కోసం ప్రత్యేక రైలు మార్గం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి  పూర్తి సహకారం అందించాలని డైరెక్టర్ కోరగా దీనికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రత్యేక కార్యదర్శి  వినీల్ కృష్ణ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అలాగే ఒడిశా రాష్ట్ర గనులు మరియు ఉక్కు శాఖ కార్యదర్శి  సురేంద్ర కుమార్ , రెవిన్యూ శాఖ కార్యదర్శి  విష్ణు పాద సేథీ,  మైనింగ్ కార్పొరేషన్ కార్యదర్శి  బలవంత సింగ్ లతో కూడా సింగరేణి ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.  సింగరేణి గనులు ఉన్న అంగూల్ జిల్లా కలెక్టర్ తో కూడా అధికారుల బృందం సమావేశమయింది

Also Read: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ఈ పర్యటనలో భాగంగా డైరెక్టర్ ఫైనాన్స్   ఎన్ .బలరాం సారథ్యంలో ఉన్నతాధికారుల బృందం  నైని బొగ్గు బ్లాకు ప్రాంతాన్ని సందర్శించింది .అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించింది. మరింత వేగంగా పనులు  పూర్తి చేసి అనుకున్న సమయానికి ముందే బొగ్గు ఉత్పత్తి జరగాలని సూచించారు. నైనీ బ్లాకు తో పాటు  సమీపంలోని ఉత్కల్  సి బ్లాక్ మచి కుట్ట  బ్లాకులను కూడా అధికారుల బృందం సందర్శించింది .ఈ పర్యటనలో జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్  పి. సత్తయ్య. జనరల్ మేనేజర్ ఫైనాన్స్  సుబ్బారావు, జనరల్ మేనేజర్ నైనీ  సురేష్ ఏ. జి ఎం అన్వేషణ విభాగం పంకజ్ తదితరులు పాల్గొన్నారు.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles