Friday, April 26, 2024

అమెరికాలో బైక్ పై అసాధారణమైన సద్గురు ఆధ్యాత్మికయాత్ర

37 రోజులు, 9477 మైళ్లు, 19 రాష్ట్రాలు: అమెరికా ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని శోధించే ప్రక్రియలో తాను అనుభూతి చెందిన విషయాలను సద్గురు పంచుకుంటున్నారు.

యోగి, మార్మికులు, అంతేకాక న్యూయార్కు టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత సద్గురుకు మోటార్ సైకిల్ పై ఉన్న అభిమానం అందరికీ తెలిసిందే. ఎన్నో దశాబ్దాలుగా మోటార్ సైకిల్ పై లెక్కలేనన్ని ప్రయాణాలు ఆయన చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ 36 రోజులపాటు అమెరికాలోని, 19 రాష్ట్రాలలో, 9477 మైళ్ళ దూరం ఎంతో సాహసోపేతంగా ప్రయాణం చేసిన తర్వాత, ‘‘ఈ ప్రయాణం మిగతా వాటి లాంటిది కాదు’’ అన్నారు ‘ఈశా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు సద్గురు.

సద్గురు తన ప్రయాణం 16 మంది సభ్యులతో కలసి అమెరికా సంస్కృతిని, చరిత్రని,  అక్కడి ఆదిమజాతి ప్రజల సంప్రదాయాలను తెలుసుకోవడానికి అమెరికా అంతా ప్రయాణించారు. ఐరోపా దేశం నుంచి అన్వేషకులు, ఆక్రమణదారులు రాకముందే, లక్షల కొద్దీ ప్రజలు ఈ దేశంలో నివాసం ఉంటున్నారు. ఒక కోటి మందికిపైగా ఆదివాసులు ఒకప్పుడు అమెరికాలో నివసించారు. కానీ, శతాబ్దాలుగా బానిసత్వానికి, అణచివేతకు వారు గురి కాబడ్డారు. కొన్ని అంచనాల ప్రకారం ప్రస్తుతం ఈ దేశంలో వారు 30 లక్షల మందికి కన్నా తక్కువే ఉన్నారు.

అనేక శతాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్న ఆదిమజాతి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గుర్తించడం కోసమే సద్గురుఈ ప్రయాణం చేబట్టారు. ‘‘ఒకప్పుడు ఇక్కడ 500 కు పైగా జాతులు ఉండేవంటారు. మరి అంత సంస్కృతిని 37  రోజులలో ఎవ్వరూ పూర్తిగా అనుభూతి చెందలేరు. కాని, ప్రపంచంలో వారికి కనీసం కొంత గుర్తింపు కలిగించేలా మనం చేయగలం. మనం వారి గతాన్ని సరిదిద్దలేము, కనీసం వారి భవిష్యత్తుకు బాట వేద్దాం,’’ అంటారు సద్గురు. ‘‘మాతో సంభాషణలు జరిపిన అమెరికా ఆది జాతీయులకు మా కృతజ్ఞతలు’’ అన్నారు సద్గురు.

sadhguru spiritual tour by bike in America

హుటా (Utah) రాష్ట్రంలోని జియాన్ నేషనల్ పార్క్ అంటి అందమైన ప్రదేశాలనుంచి, ముస్సూరీ రాష్ట్రంలోని ‘మిసిసిపి’ నది, వ్యోమింగ్ లోని అతి గొప్ప పురాతన స్థలం ‘మాటో టిపిలా’, ఇంకా సౌత్ డకోటా రాష్ట్రంలోని క్రేజీ హార్స్, ఇలా అనేక ప్రాంతాలను, ఆదిమ జాతీయుల గొప్ప సంస్కృతిని సద్గురు అన్వేషించారు. ఆయన ముసోరీ రాష్ట్రంలోని బ్రహ్మాండమైన ‘మెరామిక్ కావెర్న్స్’, వ్యోమింగ్ లోని ‘ఓల్డ్ ఫైత్ ఫుల్ గీజర్’ ‘ఎటర్నల్ ఫ్లేం’ ఇంకా అనేక ఇతర ప్రఖ్యాత స్థలాలు సందర్శించారు.

‘‘గత 40 – 45 ఏళ్లుగా నేను ఎడతెరిపి లేకుండా ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూనే ఉన్నాను. కానీ ఈ ప్రయాణం మాత్రం మిగతా వాటి లాంటిది కాదు. నిజానికి ఈ ప్రయాణం 21 రోజులకే పూర్తి చేయాలని అనుకున్నాం, కానీ అది 37 రోజుల పాటు సాగింది. 16 మంది ఉన్న మా జట్టు ఒకే అంగంలాగా పని చేసింది. మేము చూసింది అనుభూతి చెందింది మాటల్లో వర్ణించడం చాలా కష్టం’’ అంటారు సద్గురు.

సద్గురు అక్టోబర్ 12 న ఆదిమ మానవుల దినోత్సవం నాడు మెక్సికన్, అమెరికా ఆదిమ జాతికి చెందిన రాపర్ ‘బ్లాక్ పీస్ టాబు’ తో ‘ఇన్ కన్వర్జేషన్’ చర్చ జరిపారు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు ‘విల్ స్మిత్’, ఆయన కుటుంబాన్ని ఆయన ఇంట్లో కలిశారు. ‘‘సద్గురు మా ఊరికి వచ్చారు, నేను గత కొంత కాలంగా ఆయనని ఫాలో అవుతున్నాను. ఆయన ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించారు. మా కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక వ్యక్తులను, ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకు పోని వారిని కలవాలని నా ఆకాంక్ష’’ అన్నారు విల్ స్మిత్ ఒక వీడియో సందేశంలో. అదే సద్గురు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ప్రఖ్యాత మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ‘మైక్ టైసన్’ (Mike Tyson) తో క్రిందటి వారం సద్గురు సంభాషించారు. ఆయన మళ్ళీ బాక్సింగ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు, అందరూ దానికై ఎదురుచూస్తున్నారు. ‘నాజ్ డైలీ వ్లాగ్స్’ అని పేరుగాంచిన ఇజ్రైలీ దేశానికి చెందిన వ్లాగర్ ‘నాజెర్ యాసిన్’ తో కూడా సద్గురు సంభాషించారు.

Of Motorcycles and A Mystic:

https://www.instagram.com/tv/CFyvj7HAN1N/?utm_source=ig_web_copy_link

Exclusive photos from the journey: 

https://drive.google.com/drive/folders/1I5RVdfEi0zsQn5wkmDlk_D8lU0LQXG-W?usp=sharing

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles