Saturday, December 7, 2024

లాకోర్టు అన్యాయంపైగర్జించిన రావిశాస్త్రి, ఒక్కొక్క ఒక్కో అక్షరాగ్ని

మాడభూషి శ్రీధర్

తన రచన ఏ చెడ్డకి సాయం చేస్తోందో, ఏ మంచికి హాని చేస్తోందో ఆలోచించవలిసిన అవసరం ప్రతీ రచయితకు ఉంది

-రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాధ శాస్త్రి)

గుప్పున సారా కంపు కోర్టు గొల్లున సంతలో కోర్టు. అబద్ధాలకి పాముల పుట్ట కోర్టు బందిలదొడ్డికి రాచబాట కోర్టు’’ ఇదీ కోర్టుల గురించి లాయర్‌ అయిన రావిశాస్త్రి అభిప్రాయం. కాదు, అనుభవం. ‘‘అక్కడ అనాథుల ఆక్రందన, అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటిజాలు. అదేసుమా కోర్టు! అని కూడా నాకు రాయాలని ఉంది. అయితే, సెంటిమెంట్‌ సాబ్‌ స్టఫ్‌, ఏడుపురాత రాసేనని తప్పక చాలామంది వెక్కిరిస్తారు’’ అని అనుమానిస్తారు. మన నాటకాలలో ప్రకాశముగా అనీ సంభాషణలో ఉంటాయి. ఇదీ మన కోర్టుల మీద న్యాయం మీద రావిశాస్త్రి అన్యాయం పైన కొరడా ఝళిపిస్తుంటాడు.

రావి శాస్త్రి. ఇంగ్లీషు పదంలో రాస్తే తెలుగులో రవి శాస్త్రి అంటారు తెలుగు పత్రికల వారు. రావి శాస్త్రి గురించి తెలియని పాత్రికేయులు రవి శాస్త్రి అనే రాస్తారు. ఇంకా ఆ పతనం ఇంకా రాలేదనుకుంటాను. నేను చాలా కాలం ‘న్యాయం’ పేరుతో వార్త పత్రికల్లో వారం వారం రాసేవాణ్ణి. మిత్రులు నా కాలమ్ లో దాన్ని అన్యాయం అనేవారు. ఎందుకంటే ప్రతిసారీ నేను అన్యాయం గురించే రాసేవాడిని కదా.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సంపన్నుల రక్షణకు న్యాయస్థానాలు, పోలీసులు చట్టాలు వాడుకుంటున్నారు. న్యాయాన్ని అన్యాయానికి బలి చేస్తున్నారు అంటూ రాచకొండ విశ్వనాథ శాస్త్రి మనసులో బాధపడేవారు.

విశాఖ రచయితల సంఘం కార్యదర్శిగా, చాలా కాలంవిరసం సభ్యుడు. అంతకుముందు కొన్నాళ్లు కాంగ్రెస్ లో ఉన్నాడనడం అవసరం లేదు. ‘ఎన్నెస్‌’ పేరుతో కథా సంపుటిఎన్నెస్‌ ప్రకాశరావువెలువరించిన. ఆ కాలంలో ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణిస్తే రావిశాస్త్రి స్మృతి కవిత ‘ఎన్నెస్‌ ప్రకాశరావు’ కదిలించే కవిత.

‘‘నువ్వు లేవు నవ్వులు చిందేవ్‌ నువ్వు లేవు. పువ్వులు అందించావ్‌ కథలెన్నో పండిరచేవ్‌ కలలెన్నో సృష్టించావ్‌. పావురాల వీధిలో డేగలు, కోయిలమ్మ గూటిలో పాములు ఉంటాయని మాకు చెప్పాక నీ మనోధైర్యం నీ గుండె నిబ్బరం మాకాధర్మం ఎన్నెస్‌ ప్రకాశరాయ!’’అని కళ్లు నింపుకుంటాడు.

మాజీ భారత సుప్రీం కోర్టు న్యాయ మూర్తి ఎన్‌.వి. రమణ అప్పుడప్పుడు రావిశాస్త్రి కథల గురించి, కవితాత్మగా వివరించాడు. ఈ పాడు లోకానికి కోర్టు న్యాయాన్యాయాలకు కళ్లు కట్టినట్టు పాడుకున్నాడు. ‘రత్తాలు రాంబాబు’ నవలలో వేశ్యగృహంలో తన స్నేహితురాలు ముత్యాలు ఏడు నిలువుల లోతు నూతిలో ఆత్మహత్య చేసుకున్నప్పుడు, రత్తాలు పడ్డ మానసిక వేదన, ఆరు చిత్రాల ‘కథాసంపుటిలో’ మామిడిచెట్టు కథలో తను అద్దెకు దిగిన ఇంటి పెరడులోని మామిడి చెట్టు పక్క ఇంటి వారికి నీడనిస్తుందన్న అక్కసుతో మామిడిచెట్టును కొట్టి వేయించిన ఇంటి యజమాని చర్యతో నీడకోసం పలవరించిన నాయకుడి మాటల్లో మనల్ని కవిత్వం పలకరిస్తుంది ఇలా తవ్వుకుంటూ పోతే ఇదో పెద్ద పరిశోధనా గ్రంథం అవుతుందని శిఖామణి రచయిత బాధపడ్డాడు. ఈ కవి దీన్ని తెలుగులో కవితాత్మక వచనం అన్నాడు. ఓ ఆరుద్ర, తర్వాత వేగుంట మోహన ప్రసాద్‌ కనిపిస్తాడని విమర్శలు అంటున్నారు.

రావిశాస్త్రి. తాడిత, పీడిత వర్గాల,పేద, నిమ్న బడుగు జనుల ఆక్రందనలను, దు:ఖాన్ని పాఠకుల గుండెలకు సూటిగా నాటుకునేలా తన రచనలు సాగించారు. మానవతామూర్తి. అట్టడుగు ప్రజల వాడుక భాషలో పాఠకులకు హత్తుకుపోయే రీతిలోగురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిల శైలిలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికలంలోరచయిత, వాటిలో అతి ముఖ్యమైనవి కథా సాగరం (1955), ఆరుసారా కథలు (1961), ఆరు సారో కథలు (1967), రాజ మహిషి (1968), కలకంఠ (1969), బానిస కథలు (1972), ఋక్కులు (1973), ఆరు చిత్రాలు (1974), రత్తాలు ` రాంబాబు (1975), సొమ్ములు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త బంగారం, ఇల్లుల గొప్పవి. రాజు మహిషి, రత్తాలు ` రాంబాబు అనే రెండు అసంపూర్తి నవలల్ని వ్రాసారు. ప్రజాదరణ కూడా పొందిన నవల కూడా అల్పజీవే. అప్పట్లో ఆంధ్రలో మధ్యపాన నిషేధం చట్టం వల్ల సమాజంలో జరిగిన పరిణామాలను చిత్రిస్తూ అయన రాసిన ఆరు సారా కథలు తెలుగు సాహితీ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపి ఎంతో మంది విమర్శకుల్ని ఆలోచింపచేసాయి.రావి శాస్త్రి గారు నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922, జూలై 30న శ్రీకాకుళంలో జన్మించారు. స్వస్థలము అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామము. తండ్రిన్యాయవాది, తల్లిరచయిత్రి.

రావి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయము నుంచి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి 1946లో లా నేర్చారు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి జనాన్ని న్యాయాన్ని నడిపించడం తెలుసుకున్నారు.  మేత కోసం అడవులకు వెళ్లే గొర్రెపిల్లతో నగరాలకు వెళ్లే గ్రామస్తుల మధ్య అతను సమాంతరంగా చిత్రించాడు.

“కూలీలు మరియు వ్యవసాయదారులు వారి స్వంత ప్రయోజనాలను కాపాడుకోవాలి, వారు అణచివేతను సహించకూడదు, విఫలమైతే వారు వేధింపులకు గురవుతారు. పాలకులు హిరణ్యకశిప (తన ప్రజలను వేధించిన రాక్షస రాజు) గా మారినప్పుడు, ప్రజలు భగవంతుడు నరసింహుని పాత్రను ధరించాలి,” అని రావిశాస్త్రి ప్రకటించారు. లాంబ్, డికెన్స్, జేమ్స్ జాయిస్,గురజాడ అప్పారావు శ్రీశ్రీ రచనలతో ప్రేరణ పొందారు.

తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేమ్స్ జాయిస్ “చైతన్య స్రవంతి” ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది.

ఆంధ్ర ప్రాంతంలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేశాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన నిజం నాటకంలో వ్యక్తం చేసారు. ఆయన రచన ఒక్కో అక్షరాగ్ని.

1) కథాసాగరం (1955)2) ఆరుసారా కథలు (1961)3) రాచకొండ కథలు (1966)4) ఆరుసారో కథలు (1967)5) రాజు మహిషి (1968)6) కలకంఠి (1969)7) బానిస కథలు (1972) 8) ఋక్కులు (1973) 9) ఆరు చిత్రాలు (1974)10) రత్తాలు-రాంబాబు (1975)11) సొమ్ములు పోనాయండి, 12) గోవులోస్తున్నాయి జాగ్రత్త13) బంగారం14) ఇల్లు

నాటకం నాటికలు: 1) నిజం నాటక2) తిరస్కృతి నాటిక3) విషాదం నాటిక

పురస్కారాలు, తిరస్కారాలు

1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ కళాప్రపూర్ణను తిరస్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. 1966లో తీసుకున్న సాహిత్య అకాడమీ అవార్డును ఇచ్చివేసారు. గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించారు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. రచయిత తాను వ్రాస్తున్నది ఎటువంటి మంచికి హాని కలిగిస్తుందో, ఎటువంటిచెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరంవుండి. మంచికి హాని, చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని భావిస్తాను” అన్నారు రావిశాస్త్రి. ఈ విప్లవ రచయిత విగ్రహం విశాఖబీచ్ రోడ్డులో ప్రస్తుత యువరచయితలకు మార్గదర్శకంగా తరాల ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు ఆయన.

(జులై 30, రావిశాస్త్రి జయంతి)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles