Sunday, April 28, 2024

రజోగుణము మోహావేశపరమైనది

భగవద్గీత 72

Most modern కారు. Accelerator touch చేస్తే చాలు సర్రున పరుగెడుతుంది.  బాగా డబ్బున్న ధనవంతులు తమ పిల్లలకు అలాంటివి కొనిచ్చి `నా కొడుకుకు అన్నీ ఇచ్చాను` అని ఆనందపడుతుంటారు. తప్పులేదు… కానీ, వాడికి ఆ కారును అదుపుచేస్తూ రోడ్డుమీద నడపగల శక్తి ఉన్నదా లేదా అని గ్రహించకుండా ఇస్తే ఫలితం… ప్రతిరోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాం.

Also read: స్వభావం  ప్రధానం

ఒక అందమైన భవంతిని చూశాడు ఒక మామూలు ఉద్యోగస్తుడు. తనకూ అలాంటిది కావాలని ఆశపడ్డాడు… తప్పులేదు… ఆశపడడం వరకూ తప్పులేదు… ఆ ఆశ నెరవేర్చుకోవడానికి వ్యాపారమార్గమో, ఇంకా డబ్బు ఎక్కువ వచ్చే ఉన్నత ఉద్యోగమో సంపాదించి… ఆ కల నెరవేర్చుకుంటే తప్పులేదు. కానీ తను ఉన్న ఉద్యోగంలోనే చేయాలని అనుకొని లంచాలబాట పడితే… పట్టుబడనంతవరకు ఆహా… ఓహోఅని చుట్టుపక్కలవారు అంటుంటారు. వాడిలోనే ఎవడికో ఈర్ష్యపుట్టి ప్రభుత్వానికి పట్టిస్తే… జీవితం…?

అందాన్ని ఆరాధిస్తే తప్పులేదు. ’’A thing of beauty is a joy for ever’’ జాన్‌ కీట్స్‌ మహాశయుడు Endymion అనే poemలో ఉటంకించిన పంక్తులవి.

సౌందర్య ఆరాధన ఆరాధనవరకయితే ఫరవాలేదు. కానీ, ఆ సౌందర్యాన్ని స్వంతం చేసుకోవాలని ఆరాటపడితే, సాగినన్నాళ్ళుసాగి పతనమయిన రావణాసురుడి కధ పునరావృతమవుతుంది.

Also read: పని నేర్చుకున్న తర్వాతనే పర్యవేక్షణ

అసలు ఇవ్వన్నీ ఏమిటి?

మనస్సు చేసే మాయాజాలమిది. మానవుడికున్న గుణాల ప్రభావమిది.

ఏమిటా గుణాలు?

రజోగుణము, తమోగుణము, సత్త్వగుణము.

ఒక వస్తువు తను ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలోనే ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది న్యూటన్‌ మొదటి సూత్రంపేర పిలవబడుతున్నది. దీనిని Inertia అని పిలుస్తారు. అనగా జడత్వము. ఇలా స్థిరంగా ఉండటం పదార్ధ లక్షణం. దానిని మార్చాలంటే కొంత శక్తిని ప్రయోగించాలి.

ఇలా జడంగా ఉండే గుణం తమో గుణం. అయితే, దానిని మార్చటానికి వాడే శక్తి రజోగుణం.

అర్ధం కాలేదా ?

ఒక కారు ఉన్నది. అది ఎప్పుడు పరుగెడుతుంది? దానిలో పెట్రోలు పోసి మండించి acceleration ఇచ్చినప్పుడే కదా! లేదంటే కారు తనంతటతాను ఉన్నచోటే ఉంటుంది. అది `తమోగుణమ`యితే… మండే పెట్రోలు `రజోగుణమ`న్నమాట!

సరే, కారు ముందుకు విపరీతమయిన వేగంతో కదిలింది అనుకుందాం. ఏ ప్రాంతంలో ఎంతవేగంతో నడపాలి, ఎక్కడ బ్రేకువేయాలి, స్పీడుగా ఎప్పుడు పోవాలి… ఇలా సమన్వయం చేసే బుద్ధినే `సత్త్వగుణం` అని అంటాము. Act of balancing అన్నమాట.

Also read: ఎవరి మనస్సు శాంతితో నిండి ఉంటుంది?

జీవితంలో ప్రతి సంఘటన అంతే!

ఏది ఎంత వరకో తెలిసి తన పరిధిలో తాను ఉండేవాడు సత్త్వగుణ సంపన్నుడు. కోరికల వెంటపడి, పరుగులెట్టి ప్రమాదంలో చిక్కుకునేవాడు ‘‘రజో’’ గుణ ప్రధానుడు. అసలు కదలికలేలేక ఉన్నచోటనే ఉండేవాడు ‘‘తమో’’ గుణ ప్రధానుడు .

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్‌

తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్‌ (14- 7)

రజః -రజో గుణము

రాగాత్మకం-మోహావేశ స్వభావము

విద్ధి-తెలుసుకొనుము

తృష్ణా-కోరికలు

సంగ-ఆసక్తి (attachment)

సముద్భవమ్‌-ఉద్భవించిన

తత్‌-అది

నిబధ్నాతి-బంధించేవేస్తుంది

కౌంతేయ-అర్జున ఓ కుంతీ పుత్రుడా

కర్మసంగేన-కామ్య కర్మల పట్ల ఆసక్తి వలన

దేహినమ్‌-జీవాత్మ

ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినటువంటిది. అది ప్రపంచంలోని వస్తువులపట్ల కోరికలు మరియు అనురాగముల వలన జనిస్తుంది. అంతేకాక ఆత్మను కామ్య కర్మల పట్ల ఆసక్తి వలన బంధింపచేస్తుంది.

అనగా భౌతిక ప్రాపంచిక వ్యవహారములే రజో గుణము యొక్క ప్రధానమైన లక్షణము.  రజో గుణము అనేది ఇంద్రియ భోగములు, అవి ఇచ్చే సుఖము కోసం ఉన్న కోరికను, కామమును మరింతగా పెంచుతుంది. శారీరిక, మానసిక వాంఛలను మనిషిలో రగిలిస్తుంది.

Also read: కనులుమూసినా నీ రూపే

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles