Thursday, November 30, 2023

31న దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సంస్మరణ సభ

రాయలసీమ చరిత్రలో చెరగని శిలాక్షరంగా నిలచిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ శదేవిరెడ్డి శ్రీనాథ్ ఈ నెల 22వ తేదీన పరమపదించిన విషయం విదితమే. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. తండ్రి మరణవార్త విని హుటాహుటిన బయలుదేరి మార్చి 23-24 తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. వారు వచ్చిన వెంటనే శ్రీనాథ్ పార్థివదేహాన్ని కడపకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

1957 ఆగస్టు లో కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం మండలం కొరగుంటపల్లెలో ఆయన జన్మించారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం‌ఏ ఫిలాసఫీ చదివారు. 1978లో ‘ఆంధ్రప్రభ’ బెంగుళూరు ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు. 1980లో ‘ఆంధ్రప్రభ’, ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ స్టాఫ్ రిపోర్టర్ గా కడపలో ఆయన ఉద్యోగ జీవితం ప్రారంబించారు.

అప్పటి నుండి విలేఖరిగా అత్యుత్తమ స్థాయిలో పని చేశారు. పరిశోధనాత్మకవార్తలూ, రాజకీయ విశ్లేషణాత్మక వార్తలూ పుంఖానుపుంఖంగా రాసేవారు. ఆయన వార్తలకూ, వ్యాసాలకూ, వ్యాఖ్యలకూ రాజకీయ నాయకులు విలువ నిచ్చేవారు. సాధారణ పాఠకులను తన సత్యనిష్ఠతో, నిస్పక్షపాత వైఖరితో, సమదృష్టితో, కర్తవ్య వ్యపారాయణత్వంతో, నిబద్ధతతో మెప్పించి సమాజంలో గౌరవం పొందిన అరుదైన జర్నలిస్టు శ్రీనాథ్. ఆయన జిల్లాలోని పాత్రికేయులు అందరికీ అండగా, వృత్తి పరంగా అందరికీ ఆదర్శంగా 2006 వరకు కడపలో పని చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్  జిల్లా శాఖ అద్యక్షుడుగా సుమారు 20 సంవత్చరాలు, రాష్ట్ర శాఖ కార్యదర్శిగా మూడు సంవత్చరాలు పనిచేసి జర్నలిస్ట్ లకు జిల్లాలో రక్షణ కవచంగా నిలిచారు. 1983 లో ప్రారంభమై 1989 వరకు కొనసాగిన రాయలసీమ ఉద్యమంలో ఆద్యంతం అత్యంత నిబద్దతతో పని చేశారు. రాయలసీమ కరువు చరిత్రను, ప్రజల కడగండ్లను, సీమ నీటి అవసరాల గురించి ప్రపంచానికి చాటి చెప్పారు. సీమ ఉద్యమం లో ఆయన పాత్ర చరిత్ర మరవలేనిది.

ఉద్యోగ విరమణ తరవాత ఆయన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా మూడు సంవత్చరాలు పని చేసిన కాలములో విలేకర్ల వృత్తి నైపుణ్యాలను పెంచడానికి కృషి చేశారు. ఆయన అనారోగ్యంతో మార్చ్ 22 న స్వర్గస్తులు అయ్యారు. దేవిరెడ్డి శ్రీనాథ్ కు నివాళులు అర్పించడం కోసం కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరములో ఈ నెల 31 శుక్రవారం ఉదయం 10 గంటలకు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. సభలో పాల్గొని నివాళి అర్పించవలసిందిగా విలేకర్లు, మిత్రులు, సహచరులు, శ్రేయోబిలాషులకు నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles