Saturday, April 27, 2024

పెద్దాయనను తిడితే పెద్దవాడివి కాలేవు: రేవంత్ కు జగదీశ్వర్ చురక

  • చెత్తగాళ్లకు వచ్చేదే చెత్త ఆలోచనలు
  • జోకర్లు, బ్రోకర్లలా మాట్లాడడం వారి విజ్ఞత
  • నిర్మాణాత్మక మైన ఆలోచనలు వారికి ఎప్పుడూ రావు
  • రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి
  • మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి
  • జీవితంలో ఏ ఒక్క రోజు బాధ్యతాయుతంగా పనిచేసిన చరిత్ర లేని వారికి ఏమి తెలుస్తుంది
  • అసలు నీకు పదవి ఎలా వచ్చిందో నీ పార్టీ వారే బహిరంగంగా చెబుతున్నారు
  • ప్లినరీ విజయవంతం కావడంతో తట్టుకోలేక పోతున్నారు
  • టి ఆర్ యస్ క్యాడర్ లో నూతన ఉత్తేజం చూసి మతిభ్రమించింది
  • విజయగర్జనతో మతులు పూర్తిగా దెబ్బ తింటాయి
  • రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ,అద్భుతమైన పాలనా దక్షత ఉన్న పార్టీ టి ఆర్ యస్
  • తోబుట్టువుగా, తండ్రిగా,మేనామామగా అందరిలో ఒకరిగా దీవెనలు అందుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  • పెద్దలను అనుకరిస్తేనే పెద్దవాళ్ళం అవుతాం
  • పులి వేషం వేస్తే పులులు కారు, చిల్లర మాటలు మానుకోవాలి
  • ఆ భాష మాకు వచ్చు, ప్రజల్లో ఏహ్యభావం కలుగుతోందన్నది గమనించాలి
  • అసెంబ్లీ లో చర్చకు సిద్ధం అంటే తోక ముడిచింది ఎవరూ?
  • పరిపాలన అంటే ఏమిటో తెలుసుకుని మాట్లాడు. సి యం డి ప్రభాకర్ రావు నివేదిక ఎక్కడ ఇచ్చారు?
  • ఏ ఏ అధికారులు ఎక్కడికి పోతున్నారో నీకు చెప్పాలా?
  • పనితీరును పట్టి ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది
  • పాలనా దక్షత ఎలా ఉండాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి నేర్చుకో
  • అవాకులు చవాకులు మానుకో

నల్లగొండ: చెత్తగాళ్లకు వచ్చేదే చెత్త ఆలోచనలని అటువంటి చెత్తగాళ్ళు మాట్లాడుతుంటే జోకర్లు,బ్రోకర్లు,లోఫర్లు గుర్తుకు వస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. అటువంటి వారికి నిర్మాణాత్మక మైన ఆలోచనలు ఎప్పటికీ స్పూరించవని ఆయన ఎద్దేవాచేశారు.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు,వానాకాలం పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసే అంశంపై మంగళవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి అని హితబోధ చేశారు. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి అని ఎప్పుడన్నా బాధ్యతగా ప్రవర్తిస్తే గదా బాధ్యత తెలిసేది అని ఆయన దుయ్యబట్టారు. జీవితంలో ఏ ఒక్కరోజు బాధ్యతాయుతంగా పనిచేసిన చరిత్ర లేని వారికి పాలనా అనుభవం ఎలా తెలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి నిలదీశారు.అసలు పిసిసి పదవి నీకు ఎలా వచ్చింది అన్నది మీ సొంత పార్టీ నేతలే చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

20 వసంతాలు పూర్తి చేసుకుని 21 వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నిర్వహించిన టి ఆర్ యస్ పార్టీ ప్లినరి విజయవంతం కావడంతో తట్టుకోలేకనే అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన విమర్శించారు. టి ఆర్ యస్ క్యాడర్ లో వచ్చిన నూతన ఉత్తేజాన్ని చూసి వారికి మతిభ్రమించిందన్నారు. నవంబర్ 15 న జరుగు విజయగర్జన సభతో వారికి మతులు పూర్తిగా పోతాయని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా అద్భుతమైన పాలనా దక్షత ఉన్న నేత గా ముఖ్యమంత్రి కేసీఆర్ ను యావత్ భారతదేశం కితాబిస్తుంటే ఇటువంటి చిల్లర మాటలతో విమర్శలకు దిగడం వారి విజ్ఞతకు నిదర్శనమన్నారు. తోబుట్టువుగా, మేనామామగా, తండ్రిగా అందరిలో ఒకరిగా ప్రజా దీవెనలు అందుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిడితే పెద్దోళ్ళు కాలేరు అన్న నగ్న సత్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పెద్దాయనను తిడితే పెద్దమనుషులు కాలేరని పెద్దమనుషులను అనుకరిస్తే నే పెద్దమనుషులమవుతామని ఆయన ఉద్బోధించారు. పులి వేషం వేస్తే పులులు కారని, అటువంటి  చిల్లర మాటలు మానుకోవాలని  రేవంత్ రెడ్డికి మంత్రిజగదీష్ రెడ్డి హితవు పలికారు. అటువంటి బాష మాకూ వచ్చనీ, అదే బాష ను  మాట్లాడితే ప్రజల్లో ఏహ్యభావం కలుగుతుందన్న ఇంగితంతో మాట్లాడలేక పోతున్నామని ఆయన దెప్పి పొడిచారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధం అని ప్రకటిస్తే తోక ముడిచింది ఎవరూ అన్నది ప్రజలకు స్పష్టంగా తెలుసు అని ఆయన చెప్పారు. పరిపాలన అంటే ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతామన్నది గుర్తుంచుకోవాలి అన్నారు. సి యం డి ప్రభాకర్ రావు నివేదిక ఎక్కడ ఎప్పుడు ఇచ్చారని, అది రేవంత్ కు చెప్పి ఇచ్చారా అంటూ ఆయన నిలదీశారు. ఏ ఏ అధికారులు ఎక్కడికి పోతున్నారన్నది నీకు చెప్పాలా అంటూ సూటిగా ప్రశ్నించారు. పనీతిరును పట్టి ఎవరెవరిని ఎక్కడ ఉంచాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. పాలనా దక్షత ఎలా ఉండాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి నేర్చుకో అంటూ ఆయన చెప్పారు.

ఈ విలేకరుల సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు నల్లగొండ, మిర్యాలగూడ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, యన్. భాస్కర్ రావు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles