Monday, November 11, 2024

సంచారి తత్త్వాలు

                 —————————

(From “The Wanderer” by KAHLIL GIBRAN)

                2. మెరుపులూ, పిడుగులూ

                ———————- ——————

         అనగనగా ఒక రోజు ఒక  క్రిస్టియన్  బిషప్  చర్చిలో  కూర్చొని   ఉండగా, మతం పుచ్చుకోని ఒక  స్త్రీ  వచ్చి , అతనితో  ఇలా  అంది.

         “నేను  క్రిస్టియన్ మతం  కాదు. నాకు  నరకపు అగ్ని జ్వాలల నుంచి విముక్తి  ఉందా?”

బిషప్ “లేదు. పవిత్ర జలాలు జల్లించుకొని , మతం తీసుకున్న వారికే  మోక్షం  వస్తుంది.”

అతను ఆ మాటలు అంటూ ఉండగానే , ఓ పిడుగు ఉరుముతూ  ఆ చర్చి మీద పడింది. చర్చి కాలి పోయింది. గ్రామస్తులందరూ  పరుగుతో వచ్చి ఆ  స్త్రీ ని  రక్షించ గలిగారు. బిషప్ ఆ పిడుగు మంటల్లో కాలి పోయాడు!!

                    3. నవ్వుకన్నీళ్లు

                        ———————-

ఒక రోజు సాయంత్రం నైలు నదీ తీరంలో  ఒక హైనా, ఒక మొసలి కలుసుకొని  అభివందనలు తెలుపుకున్నాయి.

హైనా  ” రోజులెట్లా  గడుస్తున్నాయి  సార్?” అని అడిగింది.

మొసలి ” దారుణంగా ఉన్నాయి. ఒక్కో సారి నా  బాధలో, దుఃఖంలో నేనేడ్చినా అందరూ అవి  ‘మొసలి  కన్నీళ్ళే అంటున్నారు. అది నా గుండెపై

సమ్మెట పోటులా  ఉంది.” అంది.

అపుడు  హైనా ఇట్లా అంది. ” నీ బాధ, దుఃఖం  గురించే  మాట్లాడుతున్నావు. నా గురించి కొంచెం  ఆలోచించు. ఈ లోకంలో  అందం, అద్భుతాలూ, ఆశ్చర్యాలూ చూసి, కేవలం ఆనందంతో నవ్వితే  చాలు – జనాలు అది ‘హైనా నవ్వు’ అంటున్నారు.”

Also read: సంచారి “తత్త్వాలు”

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles