Thursday, November 30, 2023

ఒక చట్టం ఒక మతం సాధ్యమా?

ఉమ్మడి పౌరస్మృతి-2

నానా రకాల దాడులు, దండయాత్రలతో భారతదేశంలో విభిన్నమైన జాతులు, మతాలు, కులాలు బతుకుతున్నాయి. కులాలు ఎన్ని ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? నాలుగు ప్రధానమైన వృత్తులతో మొదలైన వర్ణాలు తరువాత కులాలుగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏ రాష్ట్రాలలో ఎన్ని రకాల కులాలు ఉన్నాయో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ కులాల వారు ఆయా ప్రాంతాలను రాష్ట్రాలను కలిసి, కొత్తగా జాతులుగా తయారయ్యాయి. కులాలు పోతే తప్ప దేశం బాగుపడదు అనే పెద్దలు ఉన్నారు కాని వారిది మరో కులంగా మారిపొయింది. మనుషులని గుర్తించేవారు మరిచిపోయారు. ప్రతివాడూ ఫలానా కులానికి చెందిన వాడైపోయాడు. ఇక మతాలు కూడా కలిసిపోయిన తరువాత, కులాంతర, మతాంతర వివాహాలతో ఏ కులాలున్నారనాలి? ఏ మతాల వారిని ఏమనాలి? ఇంత వైరుధ్యాలు, వైవిధ్యాలు, భారతదేశంలోనే ఎక్కువైపోతూ ఉంటే, ప్రపంచీకరణం తరువాత అక్కడివారు ఇక్కడివారు కలిసిపోయిన తరువాత మనుషులంతా ఒకటే అనే సినిమా నినాదాలు పనికి రావు. విడిగా ఉన్నా ఉన్నంతవరకు బతకడం నేర్చుకోకప్పదు. ఇండియా ఒకటే ఇండియా ఒకటే పార్టీ, ఇండియా ఒకటే జనం అనే భ్రమలనుంచి, ప్రసంగాలనుంచి బయటకు రావాలి. భక్తులు ఉంటే దేవుడికి భక్తితో ఉండాలి గాని, రాజకీయ నాయకులకు, సినిమా నటులకు, క్రికెట్ దేవుళ్లకు, దొంగ స్వాములకు కోట్లరూపాయలు ఇచ్చుకోవడం వంటి, భక్తితొ దండాలు పెట్టుకుని, పూనకాలు తెచ్చుకుని నాలికల్లో శూలాలు గుచ్చుకోవడం పిచ్చి పని. మనకు భారతం ఒక్కటే భారత రాజ్యాంగం ఒక్కటే, కాని 30 కన్న ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి. వందలాది భాషలున్నాయి. యాసలు ఉన్నాయి. శూలాలే గుచ్చుకునే వాడికి, యూసిసీ అని విచ్చుకత్తులతో విజృంభించడం అనాగరికం.

సమాఖ్య లక్షణం ఇదా?

అన్ని రకాల మతాల వారికీ ఒక్కటే రకం ‘ఒకే దేశం ఒకే చట్టం ఒకే మతం’ అని అధికరణం 50లో చెప్పిన ఫెడరల్ (సమాఖ్య) లక్షణం కాదని అధికరణం 44పేరుతో వచ్చే విరుద్ధమైన రాజ్యాంగ తత్వాన్ని రద్దు చేద్దామా అన్నది ప్రశ్న. ఆర్టికిల్ 44 లో ఉన్న ఆదేశిక సూత్రానికి, ఆర్టికిల్స్ 25, 29లకు ప్రాథమిక హక్కులకు మధ్య తీవ్రమైన వైరుధ్యం ఉంది. ఆర్టికిల్ 25, 29లకు హక్కులను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వపైన ఉంది. కాని ఆర్టికిల్ 44 కేవలం ఆదేశిక సూత్రమే కాని ఆదేశం కాదు. తమ మతానికి చెందిన వ్యవహారాలను నిర్వహించుకునేది మైనారటీలకు హక్కు ఉందని ఆర్టికిల్ 25 ప్రకటించింది. సంస్కృతపరమైన విభిన్న లక్షణాలను రక్షించుకునే హక్కు ఆర్టికిల్ 29కింద ఉంది. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న  చట్టాలున్నాయి. ముస్లింలు, క్రైస్తవులకు విడివిడిగా స్వంత చట్టాలు ఉన్నాయి. ఈ మతాలలో అమలు చేసుకునే భారత రాజ్యాంగం కింద హక్కులు ఉన్నాయి.

బిజెపి అధ్వర్యంలో కొత్త లా కమిషన్ 2018 అనేక అంశాలను కూలంకషంగా పరిశోధించారు. ఎన్నికలు వచ్చే సమయానికి వారికి నచ్చే విధమైన యూసిసి కావలసి వచ్చింది. 2018 కమిషన్ దాదాపు 190 పేజీల వివరణతో కూడిన సలహాలు ఇచ్చింది. కాని ప్రభుత్వం వారికి ఎన్నికలలో గెలిపించే పథకం వలె యూసిసి కనిపిస్తుందని అనుకుంటున్నారు. ఒక్కే నినాదం, యూసిసి కావలా వద్దా అనే రిఫరెండం కావలంటే సాధ్యం కాదు. అనేక సిఫార్సుల గురించి అనేక అంశాలు ఇవి.

బాలకార్మికులను తయారు చేస్తున్నదెవరు? 

బాల కార్మికులను తయారుచేసేవాళ్లు పార్లమెంట్ సభ్యులే. పెళ్లి నిర్బంధంగా రిజిస్టర్ చేయడం ముఖ్యమైన నిబంధన. పిల్లల పుట్టిక మరణాల రిజిస్ట్రేషన్ చట్టం మరొకటి. లా కమిషన్ 270వ నివేదిక లో నిర్బంధ రిజిస్టర్ చేసే పెళ్లి బిల్లు 2017 తేల్చడం లేకుండా పెండింగ్ లో ఉంది. తప్పు పార్లమెంట్ వారిది కాదు, అది యూసిసితో ముడిపడిన సమస్య. లా కమిషన్ 270వ నివేదికలో వివాహపు లీగల్ వయసు గురించి, పర్సనల్ చట్టాల కింద రిజిస్టర్ నియమాలు, స్పెషల్ వివాహ చట్టం కింద చేసే రకాల వివాహపు నిర్ణయించేవనే కచ్చితంగా రిజిస్టర్ చేయాలనేవి కూడా ఉంటాయి.  ప్రభుత్వ లక్ష్యాలు సమస్యలు కూడా. అన్నింటికన్నా పెద్దది.  వివాహానికి సమ్మతించే వయసు అందరికీ ఒకటే ఉండాలంటే ఏది? ఈ సమస్యను రాజ్యాంగం విషయంలో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తారు? ఇండియన్ మెజార్టీ వయసు 18 సంవత్సారలని 1875 నుంచి అమలులో ఉంది. కాని మహిళ పెళ్లి వయసు 21. ముందీ రెండిటి వైరుధ్యం మార్చే శక్తి ఎవరికుంది?  మన సంప్రదాయాలలో, మతాలలో తదితర విషయాల్లో పెళ్లి చేసుకునే వారిలో యువకుల్లో ఎక్కువ ఉండాలని, అమ్మాయి వయసు తక్కువ ఉండాలని నిర్ణయించే పెద్దలను ఎవరు మార్చాలి? బలవంతంగా మార్చడం సాధ్యమా? బాలకార్మికులను తయారు చేస్తున్నది వీరే కదా.

బాల్య వివాహ నిషేద చట్టాలు, సమ్మతించే వయసు నిర్ణయించే క్రిమినల్ చట్టాలు, రేప్ వయసు గురించి చెప్పే క్రిమినల్ చట్టం. POCSO Acts పోక్సో చట్టాలవి ఉంటాయి. పదహారేళ్ల అమ్మాయి, 18 ఏళ్ల అబ్బాయికి మధ్య పెళ్లి valid అని చెల్లుతాయి కాని voidable అంటే రద్దుకోరదగిన పెళ్లి అని హిందూ చట్టం నిర్ణయించింది. ముస్లిం చట్టం ప్రకారం భారత్ లో మైనర్ వాడికి రజస్వల అయిన అమ్మాయి పెళ్లి చెల్లుతుందని చట్టాలు ఇదివరకు చేసుకున్నాం.

పెళ్లిపందిరినుంచి షష్టి దాకా

పెళ్లి చేసుకోవడం హాయిగా సాధ్యం కాని విడాకులు సాధించే సమస్య పోలీసు స్టేషన్లు, కోర్టులు తేల్చడం సాధ్యం కాదు. చట్టాల్లో అనేక కారణాలున్నప్పడికీ విడాకులు తేవడానికి పొసగించే కష్టమనే కారణాల మీద విడాకులు ఇచ్చే సుప్రీంకోర్టు కొత్త కారణం పుట్టించారు,  వీరి మధ్య సయోధ్య సాధించడం ఎవరికీ జరుగుతుంది? భార్యభర్తలలో నిజం చెప్పేదెవరు? వారి అబద్ధాలని తేల్చడం సృష్టి చేసిన వారికి కూడా సాధ్యం కాదు. క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, డొమెస్టిక్ వయెలెన్స్ నుంచి రక్షించే చట్టాల గురించి మధ్యవర్తులు, ఎవరూ ఎప్పలేరు. ఏ మాత్రం సమయం లేని సుప్రీంకోర్టులు తేల్చలేక వదూవరులు పెళ్లి నుంచి మొదలైన తగాదాలు షష్టి దాటినా మామూలే.  

పెళ్లితో మొదలైన భార్యభర్తలలో ఇద్దరూ సంపాదించినా, డబ్బున్నా, లేకున్నా, అనేక రకాల సమస్యల్లో వారి ఆస్తి తగాదా ఏ విధంగా పరిష్కరించాలి?  సంతానంలో పరిష్కారం మరింత సంక్లిష్టం. కోర్టులు నిర్ణయించాలి. వారంతా గొప్పవారే అనుకున్నా, కిందికోర్టు నుంచి సుప్రీంకోర్టుదాకా లాయర్లు పనిచేస్తూ ఉంటారు. అందరకీ డబ్బులు అవసరం కదా. ఎవరి తప్పుల విషయం దొరకకపోయినా విడాకులు ఇవ్వడం మంచిది కదా. సొంతంగా సంపాదించిన డబ్బు ఏ విధంగా పంచుకుంటారు? దానికి చట్టాలు ఏ విధంగా రాయాలి?

విడాకుల కారణాలల్లో లెప్రసీ వంటి జబ్బులనుంచి తొలగించాలని ఒక సిఫార్సు ఇచ్చారు. ఈ ఒక్కటే కాదు చాలా జబ్బుల విషయంలో ఆలోచనలు చేయాలి. రోగాలు చికిత్సలు లేని వారికి విడాకులు అవసరమవుతాయి. జంటలో సంతానానికి సాధ్యం కాని ఒకరికి విడాకులు సులువుగా జరగాలి.

71న లా కమిషన్

రకరకాల విడాకులతో మరో రకం విడాకులు ఇవి. 71న లా కమిషన్ కింద 1978లో నివేదిక వచ్చింది. మా తప్పేంలేదు అయినా “no fault divorce” విడాకులు తప్పని కేసులు ఇవి. దాన్ని ఏవిధంగా కూడా వైవాహికం విరిగిపోయే “irretrievable breakdown of marriage” అంటే అటువంటి కేసులు గురించి సిఫార్సు చేసింది. మరే రకాలు లేని కారణాలలో ఈ విడాకుల కేసులు కావాలి.

పాంచాలి మహిళలు

రాజ్యాంగంలో షెడ్యూల్డ్ తెగల జీవులైన పాంచాలి మహిళలు ఉంటారు polygamy అంటే ఒకే భర్తకు చాలా మంది భార్యలు,  polyandry అంటే ఒక భర్త కు అయిదుగురు లేదా ఎక్కువ భార్యలు లేదా పాంచాలి వలెనే ఒకే అర్జునుడి గారికి అనేక భార్యలు కూడా ఉండవచ్చు. రాజ్యాంగంలో ఇటువంటి సాంప్రదాయాలను కూడా గుర్తించారు మరి.  ఇప్పుడు యూసిసి లో ఏం చేస్తారు? అందుకే 2018లో లా కమిషన్, అదీ బిజెపి అధ్వర్యంలో ఉన్న లా కమిషన్ కూడా ఇది సాధ్యం కాదు బ్రదర్ లేదా కో బ్రదర్స్ అని చెప్పేసుకోవచ్చారు.

242వ లా కమిషన్

2012లో 242వ లా కమిషన్ ఇంకే నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక పేరు: ‘‘పెళ్లి సంబంధాల మధ్య చేసే స్వేచ్ఛతో జోక్యం చేసే నిరోధించడం, పరువు సంబంధిత సంప్రదాయాల పేరుతో (మనం పత్రికల్లో పరువు హత్యలే అనేవారు) ఉండే చట్టపరంగా కూడిన సూచించే అంశాలు’’. ఖాప్ పంచాయితీలు అంటారు.  దాదాపు వాటిని కోర్టువివాహాలనీ, కులాంతరాల  వివాహాలని, మతాల మధ్య లేదా మతాతీతమైన వివాహమనిీ, అంతర్జాతీయ వివాహాలనీ, రెండు పక్షాల మధ్య ఘర్షణలు, జంటలను వేధించేవారు. ఇది రాయడమే కష్టం, అర్థం చేయించడం ఇంకా కష్టం. అటువంటి పరువు దౌర్జన్యాల గురించి ఏ విధమైన చట్టం చేయగలం అనేది తీవ్ర సమస్య. 

ముస్లిం లో మహిళలకు వివక్షలు విపరీతంగా ఉన్నాయనీ, తక్షణ విడాకులు (తలాక్ ఇ బయిన్ talaq-e-bain), ఒప్పందపు వివాహం (ముటాMuta, లేదా కాంట్రాక్ట్ పెళ్లి) లేదా కొంతకాలం వివాహ జీవితంలో ఒక వ్యక్తితో (లేదా మొగుడితో) ఉండాలనే (నికాహ్ హలాలా Nikah halala) వంటి వ్యవహారాలు ఇస్లామిక్ చట్టాల్లో ఉన్నాయి.

1909 సిక్కు వివాహ చట్టం ఆనంద వివాహ చట్టం 1909 ఉన్నా, అందులో విడాకుల నియమాలు లేవు. వాటిని హిందూ వివాహ చట్టాలను సిక్కుల విడాకుల నియమాలు ఉపయోగిస్తున్నారు.

ఇవి కొన్ని ఉదాహరణలు. యూసిసి కి ఒక పనిచేసే మంచి రూపు ఇవ్వాలి. అంతకు ముందు చాలా సంక్లిష్టమైన అంశాలను సమాధానాలు సంపాదించాలి.

Also read: అన్ని మతాలకు ఒకేలా ఒక ‘లా’ ఎలా?

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles