Thursday, May 9, 2024

అన్ని మతాలకు ఒకేలా ఒక ‘లా’ ఎలా?

ఉమ్మడి పౌరస్మృతి-1

చౌహాన్ తన నివేదిక వివరాలలోపర్సనల్ లాఅంటే వ్యక్తిగతమైన అని అర్థం కాదు. ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం అంశాలు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో సమానత్వం, దాంతో మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంచాలి.

ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు సలహాలు ఇచ్చాయే గాని  స్పష్టమైన తీర్పులలో ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. ఇటువంటి సంక్లిష్టమైన యూసిసి విషయంలో పార్లమెంట్ చట్టం చేయాల్సిందే కాని సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలని స్పష్టం చేయడం సాధ్యం కాదు. ఏ నెలలో లేదా రాబోయే ఎన్నికలలో హాం ఫట్ అని ఒక యూసిసిని సృష్టించండం సాధ్యం అవుతుందనుకోవడం తప్పు.

హిందూ, ముస్లిం మహిళలకు ఒకే పౌరస్మృతి

హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న  చట్టాలున్నాయి. ముస్లింలు, క్రైస్తవులకు విడివిడిగా స్వంత చట్టాలు ఉన్నాయి. ఈ మతాలలో అమలు చేసుకునే భారత రాజ్యాంగం కింద హక్కులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం మైనారీలకున్న హక్కును ఉల్లఘించి చట్టాలు పార్లమెంటులో చేస్తారు కావచ్చు. అప్పుడు కొన్ని సంవత్సరాల తరువాత సవరించి కొట్టివేసేదాకా ఎన్నికల్లో జనం తనకు సమర్థించాలనే ఆలోచన కూడా ఉండవచ్చు.

కోడ్ అంటే ఏమిటి

యూనిఫార్మ్ సివిల్ కోడ్ అని యూసిసి అందరికీ తెలిసింది. కోడ్ అంటే అనేకానేక చట్టాలన్నీ క్రోడికరించి కోడ్ అంటారు. కోడ్ యూనిఫార్మ్ గా ఉండాలి. కాని అందులో చట్టాలన్నీ ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మొదలైనా మతాలవారికి విడిగా చట్టాలు తెచ్చుకోవచ్చు. ఒక్క హిందూ మతం వారికి కూడా నాలుగు ప్రధానమైన చట్టాలే కాదు. అనేక చట్టాలు అందరికీ వర్తించేవాటిలో, అన్ని మతాలవారితో కూడా హిందూ మతం వారు కూడా వాడుకోవచ్చు. ఉదాహరణ: Protection from Domestic Violence Act, ఈ చట్టం అందరికీ ఉపయోగమై వర్తిస్తుంది. అందులో వయెలెన్స్ అన్నంత మాత్రాన అది క్రిమినల్ చట్టం అనుకుంటారు, కాని అది సివిల్ కేసు. అందులో అన్నీ సివిల్ కోర్టుల్లో విచారణ చేస్తారు. ఈ చట్టం ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు వగైరా చాలామందికి అవసరం. ఇది కీలకమైన యూనిఫార్మ్ సివిల్ చట్టమే. క్రిమినల్ కేసులు కూడా అన్ని మతాల వారికి ఉపయోగపడేదీ, ఎక్కువగా వాడుకునే వారు హిందువులే. ముస్లింలు క్రైస్తవులు కూడా ఉపయోగిస్తారు. వినియోగం చేస్తున్నఅనడం సరైన మాట. చాలామంది దుర్వినియోగం అంటారు. దానికి కారణం అందరూ అబద్ధాలు ఆడతారు. భార్యలైనా భర్తలైనా లేదా వారి బంధువులైనా అబద్దాలు విపరీతంగా చెబుతూ అంటారు. లాయర్లని బద్నాం చేస్తాం గాని ముఖ్యంగా భర్త అబద్ధాలు చేబుతారు. భార్యలను తక్కువే లేదు, కనుక చాలామంది లాయర్ లు అబద్దం చెప్పకపోబోతే కేసు నిలబడదండీ అంటారనీ అంటారు. లాయర్ కన్నా బంధువులే అబద్ధాలు చెప్పివారు. జడ్జిగారు ఏమీ చేయలేరు. సాక్ష్యంపైన ఆధారపడి తీర్పు చెబుతారు. అన్ని అబద్ధాల ఆధారంగానే సాక్ష్యాలు ఉంటాయి. అందరూ అనకండి కొందరు అంటారు, చాలా తెలివిగా. రెండో ఉదాహరణ విడాకుల కేసులు. నిజం చెప్పగలిగిన విడాకుల కేసుల్లో ఉన్నవాడు ఎవరైనా ఉంటే వారికి యూసిసి కావాలనే దన్నుగా ఉందనవచ్చు.  నిజం చెప్పే దమ్ము ఉంటే యూసిసి సాధ్యం. కనుక ఒక యూసిసి అనేది నిమిషాల్లో అన్ని మతాలకు అన్ని కులాలకు ఒకటే కోడ్ ఉంటుందనుకుంటే అది అసాధ్యం.

ఇది ‘‘‘హిందూ అవిభక్త కుటుంబం’?

‘హిందూ అవిభక్త కుటుంబం’ అంటారు కదా, ఇది ‘హిందూ’ అనొచ్చా, ‘అవిభక్త’ అనొచ్చా, ఇంక ‘కుటుంబం’ అని గుండెమీద చెప్పగలరా?మరొక సమస్య ఏమంటే యూసిసి కావాలంటే వసుధైవ కుటుంబం అనీ, కాదంటే కుటుంబం వద్దు అనీ కాదు. ఉదాహరణకు అవిభక్త కుటుంబం అంటే నిజంగా ఉందా, ఉందనే భ్రమ లేదా? ‘హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)ను రద్దు చేస్తారా? అని మాజీ న్యాయమూర్తి బల్బీర్ సింగ్ చౌహాన్ తీవ్రమైన సమస్యను మన ముందుకు తెచ్చారు.

ఉమ్మడి పౌరసత్వాన్ని సమర్థిస్తున్న ప్రధాని మోదీ

హిందూ చట్టాల కింద లోపభూయిష్టమైన కొపార్సనరీ అంటే HUF అనే సమిష్టి కుటుంబ సభ్యులకు వాటాల లెక్క చాలా సంక్లిష్టంగా తయారైంది. దాదాపు సమిష్టి కుటుంబాలు లేకుండా పోయినా వారికి HUF సభ్యత్వం ఇస్తూ, కేవలం పన్ను సంబంధిత వేధింపులకోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనుక వాటిని పూర్తిగా తొలగించాలని లా కమిషన్ సూచించింది. సమిష్టి టెనన్సీ బదులు టెనన్సీ ఇన్ కామన్ తో జన్మతో వచ్చే హక్కులను సంబంధించిన కొపార్సరీనర్లకు ఉండకూడదు అని కూడా సిఫార్సు చేసారు.  (In Tenancy in Common, the ownership portion passes to the individual’s estate at death. In Joint Tenancy, the title of the property passes to the surviving owner. Some states set Joint Tenancy as the default property ownership for married couples, while others use the Tenancy in Common model.)

హిందూ అవిభాజ్య కుటుంబపు సంస్థల కింద పన్నులను రద్దు చేయాలని సిఫార్సు చేసారు. HUFలో Corporate Governance వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. కనుక కార్పొరేట్ పరిపాలనలో హెచ్ యూ ఎఫ్ కుదరదని కమిషన్ సూచించింది. ఇది మీకు అర్థం కాకపోతే మీ తప్పు కాదు, అంత సంక్లిష్టమైనది.

రాజకీయాలు కాదు. అందరికీ న్యాయం జరిగేలా చూడాలి.

ఒక్కటి తప్పక….

కేంద్ర ప్రభుత్వం 21వ లా కమిషన్ వివరంగా పరిశీలించిన మూడుసార్లు తలాక్ విడాకుల విషయంలో తప్ప ఇతర యూసిసి అంశాలమీద ఆలోచించారు. సుప్రీంకోర్టు బల్బీర్ సింగ్ చౌహాన్ కమిషన్ రూపొందించారు. ప్రముఖ ముంబై హైకోర్టు న్యాయవాదిదుష్యంత్ అరోరా  సహా ప్రసిద్ధ వ్యక్తులు నీలాంజన రాయ్, టిఎమ్ కృష్ణ, మేజర్ జనరల్ వోమ్ బాత్కేరే, గుల్ పనాగ్, బెజవాడ విల్సన్, ముకుల్ కేశవన్‌లతో కూడిన ప్రముఖ పౌరుల బృందంతో అక్టోబర్ 2017లో ప్రగతిశీల ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా రూపొందించారు. మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ దాన్ని అంగీకరించారు. రెండుసార్లు ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించి లా కమిషన్ నివేదికను కూడా విడుదల చేసింది. అయితే గతనెల (జూన్ 14 నుంచి) యూసీసీపై పౌరులతో సహా మతపరమై సంస్థలు, వివిధ భాగస్వామ్య పక్షాలను కూడా తమ అభిప్రాయాలు చెప్పి ఉంటారు. ఎందుకంటే జులై 14నాటికి  లా కమిషన్ గడువు ముగిసింది.

పౌరస్మృతి స్వరూప స్వభావాలు

పోనీ ఉమ్మడి పౌరస్మృతి స్వరూప స్వభావాలు, విధివిధానాలు ఎలా వుంటాయో వివరిస్తున్నారా? చిత్తు బిల్లు ఏదీ వివరించకుండానే పార్లమెంటుకు సమర్పిస్తారా? కనీసం జనంముందు తెచ్చే ముందు చర్చ జరిపించకుడా నెల రోజుల్లో అధికారాలు లక్షల లేదా కోట్ల మంది వచ్చినారని చెబుతూ లోకసభ్ కు వోటింగ్ జరిపించి, లెక్కపెట్టకుండా తమ సొంత బలం చాలని గెలిపిస్తారా?  రాజ్యాంగబద్ధ స్థానాల్లో వున్నవారు ముందు ఒక విధాన పత్రాన్ని కూడా ఇవ్వరా?  దాని మీద చర్చలు, సంప్రదింపులు జరిగాక అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పౌరస్మృతి చేయవలసిన బాధ్యత లేదా? లేకపోతే ఆర్డినెన్స్ ద్వారా యూసిసి రూపొందిస్తారా ఏమి?

సుశీల్ మోదీ, ఆదివాసీలను మినహాయించాలి.

దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒకోలా ఉంటుంది.

ఈశ్యాన ప్రాంతాలనుంచి యూసిసిను మినహాయిస్తారా?

మరొక తీవ్రమైన అంశం ఏమంటే ఈశాన్య రాష్ట్రాలను, ఆదివాసీలు, గిరిజన తెగలను యూసీసీ నుంచి మినహాయించాలని ‘పార్లమెంటరీ ప్యానెల్‌ ఆన్‌ లా’ చైర్మన్‌ సుశీల్‌ మోదీ జూలై 3న సిఫారసు చేశారు. ఆరెస్సెస్‌ కూడా గిరిజనులను ‘ఉమ్మడి పౌర స్మృతి’ నుంచి మినహాయించాలని కోరింది. కనుక అనేక మినహాయింపులతో ఒక బిల్లు జనం ముందుకు తేకుండా ఎన్నికల లక్ష్యంతో యూసిసిని ప్రభుత్వం చేయవచ్చు.  ఇది మనదేశం, ఇక్కడ విభిన్న మతాలు ఉన్నవారికి ఒకే లా ఒక లా చేయడం యూసిసి సరైనదా అని చర్చిస్తున్నారు. ఈ చర్చలో ఏం చేయాలో ఆలోచించండి.

గొవాలో పౌరస్మృతి భిన్నం

గోవాలో ‘లా’

ముఖ్యంగా లా కమిషన్ గోవా రాష్ట్రం ఉపయోగించే ఉమ్మడి పౌర స్మృతి ఉందంటారు. కాని నిజానికి గోవాలోని పౌర స్మృతి కావలసింది కాదు. భర్త లేదా భార్య లేదా జంటలో సజీవంగా ఉండగా హిందువులు రెండవ వివాహం చేసుకునేందుకు గోవా పౌర స్మృతి అనుమతిస్తుంది. ఇతర మతం వారికి ఇటువంటి స్వేచ్ఛ లేదు. కనుక ఈ నియమాలను పాటించడం దేశమంతటా సాధ్యం కాదు, వివాదాస్పదమైనవి కూడా. కనుక అన్ని మతాలవారూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గోవాలో  వివాహానికి ముందు ఒప్పందాలు న్యాయబద్ధమైనవే. ఎవరైనా సరే తన సొంత వారసులకు కాకుండా ఇతరులకు సంక్రమింప చేసే ఆస్తుల విషయంలో స్పష్టమైన పరిమితులను గోవా పౌరస్మృతి విధించిందని 2018 లా కమిషన్ వివరించింది.

ప్రముఖ లాయర్ దుష్యంత్ అరోరా హిందూ ధర్మశాస్త్రం లేదా హిందూ కోడ్, లేదా వివాహం, ఆస్తి వారసత్వం, దత్తత, మనోవర్తి వంటి విషయాలలో హిందువులకు ఉపయోగిస్తారు. ఇది పర్సనల్ చట్టం. సమీప బంధువుల మధ్య వివాహాన్ని మేన బంధువుల మధ్య అంటే మేనత్త లేదా, మేనమామ కూతురి దక్షిణాన ఒప్పుకుంటారు.

ఎన్నని చట్టాలు చేయాల్సి వస్తుందో తెలుసా?

‘‘రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు కుటుంబ చట్టాలకు మధ్య సంఘర్షణ తొలగించడానికి ఉమ్మడి పౌర స్మృతి చట్టం సాధించడం  ఈ దశలో సాధ్యం కాదు. వాంఛనీయం కాదు హక్కులకు కుటుంబ చట్టాలకు మధ్య సంఘర్షణ రాబోయే కాలాల్లో వివక్షను, అసమానతలను తగ్గించడానికి క్రమంగా ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేసే దశలో సాధ్యమవుతుంది’’ అని ఆ లా కమిషన్ వివరించింది.

ఉదాహరణకు అక్రమ సంతానాలు అని ముద్ర పొందిన వారికి వివక్షకు గురవుయిన పిల్లలకు చట్టాలు ఏ విధంగా చేస్తారు? మహిళలకు భార్యాభర్తల మధ్య కల్తీ ప్రేమలు రావడం వల్ల, అందుకు క్రిమినల్ కేసులు కోర్టుకు రావడం వల్ల, ముస్లింలు చాలామందికి పెళ్లి చేసుకోవడం వల్ల రకరకాల సమస్యలు, క్రిమినల్ ఘర్షణలు వస్తూ ఉన్నాయి. పార్సీ లో విడాకుల సంఘర్షణలు మరికొన్నివి.  మరికొన్ని సుప్రీంకోర్టులో వివాదాలు పెండింగ్ ఉండడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి.

ఉమ్మడి పౌరస్మృతికి అతీతంగా లౌకిక పౌరస్మృతి సాధ్యమా?

లివ్ ఇన్ సంతానలను ‘సక్రమం’ చేయడం ఎ‘లా’?

మతంమార్పిడి దంపతులలో ఒకరికి విడాకులను హక్కుగా ఇవ్వాలి. కాని చాలామందికి తెలియదు. బహుభార్యత్వంలో ఇద్దరిమధ్య కష్టాలు,  అక్రమ సంతానం పిల్లలను ‘‘అక్రమ’’ అనడం అన్యాయం కదా.

లివ్ ఇన్ పేరుతో సహజీవనం చేసేవారి సంతానాన్ని ఏమంటారు. వివాహం వంటి వివాహితులని చట్టాలు చెప్పాలి. వారి సంపదను, అక్రమపు సంతానానికి వారి ఆస్తి ఏ విధంగా పంచడం సాధ్యం? స్వార్జిత ఆస్తి పంచడం ఒక సమస్యఅయితే, పిత్రార్థిత ఆస్తి నియమాలు ఇంకా సమస్య కలిగినవి. 

1890 గార్డియన్స్ వార్డన్స్ చట్టం సెక్షన్ 19(ఏ) తొలగించాలంటున్నారు. మైనర్ భర్తను భార్యకు గార్డియన్ గా నియమించాలి. మిగతా పరిస్థితిలో భార్యను ఆస్తిగా భర్తగారు పరిగణించకూడదు. మరికొన్ని సవరించాల్సి ఉంది. 

లా కమిషన్, అన్ని లింగాలకు చెందిన పిల్లలను దత్తత చేసుకునే సమానంగా అవకాశం ఉండాలని, పరస్పరం ఆడ మగల మధ్య దత్తతకు ఒప్పుకోకూడదని పిల్లల భద్రత, రక్షణ చట్టం 2015 కింద ఉండాలని సిఫార్సు చేసారు.

ఒంటరి మహిళగా ఉన్నాదత్తత, ఆడ అయినా మగ అయిన వారికైనా దత్తత, అమ్మాయితో పాటు మగవారికి కూడా దత్తత ఇచ్చే అవకాశం ఉండాలి. తండ్రిగా ఉన్న వ్యక్తికి కూడా దత్తత తీసుకొనే అవకాశం ఉండాలి. మగ మేజర్ వాడైనా, మహిళ మేజర్ అయినా దత్తత తీసుకోకూడదని నిషేధం ఇదివరకు ఉండేది. పిల్లల పోషణ విషయంలో అన్ని మతాల వారికి అందరికీ వర్తించే చట్టం ఉండాలి.

మరణించిన దగ్గరి వారెవరో ఆ మగవారి వారసత్వ లెక్క ప్రకారం ఆస్తి సంక్రమణ జరగాలనంటారు.  స్పెషల్ పెళ్లి చట్టం 1954 కింద వివాహం సంబంధాన్ని వ్యతిరేకించే వారు నోటీస్ చేసే 30 రోజుల సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వధూవరులను రక్షించడానికి చర్యలు ఇచ్చే అవకాశం ఉండాలి. కులాంతర మతాంతర వధూవరులను రక్షించాలి. యూసిసి ఒక ఖాళీ, నిరర్థకమైన నినాదం కారాదు.

మాడభూషి శ్రీధర్ 26.7.2023

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles