Monday, April 29, 2024

జర్నీ -1

ప్రత్యేకంగా ఒక విషయాన్ని గట్టిగా చెప్పాలనిపిస్తుంది, మానవ సమాజాన్ని, మానవ జీవితాన్ని నాశనం చేస్తున్న వారికి మరణ శిక్షను విధించాలి అని ఒకవైపు, మరో వైపు ఒక్కసారి మనిషికి మరణ శిక్ష అమలు జరిగింది అంటే, ఆ మనిషి, ఆ మనుషులు మారే అవకాశం కోల్పోయారు అనే విషయాన్ని ఎలా నిర్ధారణ జరిగిందని మనసులో ఒకటే తపన ” – బెనర్జీ

రచన, బెనర్జీ, సౌమ్య, రామన్ లు 10 రోజుల ట్రిప్ వేసుకొన్నారు. మధ్యలో మయూర్, సాకేత్, మంజు మోహన్, భార్గవి వాగ్దేవి, చివరలో మార్కండేయ, సంతానం లు జాయిన్ కాబోతున్నారు,

సౌమ్య ట్రిప్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ జాయిన్ అవుతున్నది చెప్పాక రచన ట్రిప్ ప్లాన్ ఏంటో మాకూ చెపుతే సంతోషిస్తాము అని అడుగుతే, 

అయ్యో, నీకూ తెలియదా రచనా, నాకు ఒక్కడికే తెలియదు అని అనుకుంటున్నాను

ట్రిప్ ప్లాన్ సౌమ్య, బెనర్జీ లు  ప్రిపేర్ చేశారు రామన్, టాప్ సీక్రెట్ అట,  సీరియస్లీ, బెనర్జీ అందుకే బెటాలియన్ బెటాలియన్ న్ను వెంట తీసుకెళుతున్నారు,సౌమ్య కు  సచ్చేన్త పని ఉంది అంటే,  మొగుడు రికమెండ్ ఒకటి తగిలించాడు. 

వావ్, ఇవ్వాల రేపు సౌమ్య లాంటి ఔరత్ లు కూడా భర్తల మాట వింటున్నారు అంటే గ్రేట్. కంగ్రాట్స్ చెప్పాలినా అజిత్ కు సౌమ్య,

మర్యాద పూర్వకంగా అజిత్ మాట విన్నట్లు ఒక గంభీరమైన నటన అద్భుతంగా సాగించింది లే రామన్ అని రచన,

అంతేనా, 

మరి ఏమనుకుంటున్నావు, భవిష్యవాణి తో సాక్ష్యం చెప్పించ మంటావా అని బెనర్జీ, 

భవిష్య వాణి లు ఎప్పుడూ సాక్ష్యాలకు పనిచేయవు. ఇలా జరుగబోతోంది ఆని మాత్రమే చెపుతాయి అని సౌమ్యా,

గ్రేట్ రీసెర్చ్, ఎప్పుడూ ఈ రీసెర్చ్ చేసారు తమరు మేడం గారు అని బెనర్జీ,

మేడం అని సంబోధించాక గారు ను ఎలా యాడ్ చేస్తారు. మేడం పదానికి గారు ను కలపటం పరమ చెండాలంగ ఉంది అని సౌమ్య,

మంచిది మేడం, మిమ్మల్ని చాలా పెద్దగా గౌరవించాలి అని ఆ చివరలో కలిసే మీ దోస్తులు గైడ్ చేసారు, మేము అజిత్ లము కాదు కదా అని ముందే మస్కా చస్క కాక పడుతున్నాము. మీరు కాకలు తీరిన ప్రొఫెసర్, ఎంతైనా నేను మీ స్టూడెంట్ ను కదా ఆని బెనర్జీ 

కాదు, మా పెద్దమ్మ కూతురికి, అంటే మా అక్కకు మీరు స్టూడెంట్, నాకు కాదు. అయ్యో,  మీరొక్కరే కాదూ, నేను కూడా మా అక్క స్టూడెంట్ ను, నీవు నాకు సీనియర్ నాయకులు. సుమారు 4/5 ఏళ్ల వ్యత్యాసం. మా అక్క మీ అందరి ప్రతాపాల గురించి చెప్పేది. అందరిలో కన్న ఆ బెనర్జీ అనే వాడు ఉంటాడు, నా స్టూడెంట్ అని చెప్పుకోవాలి అంటే తల తీసేసినట్లు  ఉంటది అనేది. అంతలోనే విద్యార్ధి నాయకులు అంటే అలానే ఉంటారు, అలానే ఉండాలి అని చెప్పేది. మాది ఉమ్మడి కుటుంబం. అంతా కలిసే ఉండే వారిమి. మా అక్క మీ గురించి, మీ కార్య కర్తల గురించీ చాలా చెప్పేది. అక్క మాటలకు నేను పడిపోయాను. ఎలా అయినా మీరు చదువుతున్న విశ్వ విద్యాలయంలో నే సీట్ దొరికిచ్చుకోవాలి అని ప్రతిన పూనాను. మా అక్క చెప్పే సబ్జెక్ట్ సోషల్ సైన్సెస్. అక్క చెప్పేదే తీసుకున్నాను. క్లాస్ లకు అటెండ్ అవుతుంటి. మీరు ఎవ్వరూ కనిపించే వారు కాదు. మా అక్క మీ గురించి మీ కార్య క్రమాల గురించి చెప్పటం ఆపలేదు. ఒకరోజు ఉండబట్టలేక క్లాస్ రూం లో నే అడిగేశాను,

ఏమని అని రచన,

ఏమని అడుగుతాను, అడగాల్సిన దే అడిగాను, మాం అని పిలిచేది మరచి పోయి, అక్కా, రోజు ఆ విద్యార్ధి నాయకుల గురించి చేపుతావు కదా ఆ గ్రూప్ ఒక్కసారి కూడా క్లాసులకు రాలేదు అని,

క్లాస్ రూం మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యింది. మరుక్షణం ఒకటే నవ్వులు. మా అక్క కూడా నవ్వింది. నేను సిగ్గుపడుతూ బల్ల వెనక మొఖాన్ని దాచుకున్నాను. ఎవరో మగవాళ్ళ గొంతు వినిపించింది, పాపం క్లాస్ రూం కు ఇంటికి తేడ మరచి పోయి అక్కా ఆని మామ్ ను పిలిసింది. గొంతు మాత్రం భలేగా ఉంది రా. హస్కీ వాయిస్ రా, ఈ హస్కీ వాయిస్ లు ఒక్క సినిమాలలోనే ఉంటాయి అని ఇన్ని ఏళ్ల నుండి అనుకుంటున్నాను, అలాంటి వాయిస్ ఇక్కడ కూడా ఉంది, అని అనటం క్లాస్ రూం మొత్తం విన్నారు, ఇంతలో క్లాస్ లు బైకాట్ చేయాలి ఆని నినదిస్తూ విద్యార్ధి నాయకులు, కార్యకర్తలు మా క్లాస్ రూం లోకి వచ్చారు. మా అక్క నా వైపు చూసింది, నేనూ మా అక్క @ప్రొఫెసర్ వైపు చూసాను. మా అక్క కళ్ళు నన్ను చూసి నవ్వినట్లు అనిపించింది. అంతలోనే, మా అక్క మా క్లాస్ రూం ను స్వేచ్ఛగా వదిలేసి వెళ్లి పోయినట్లు నా మనసు కు అనిపించింది. అప్పుడే అజిత్ దొరికాడు. నాకు పెట్టిన నిక్ నేమ్ హస్కీ లేడి అని. మీరు మా క్లాస్ రూం లోకి వచ్చి మీరు ఇచ్చిన స్పీచ్  మీకు గుర్తు ఉందో లేదో విషయాన్ని  మీరు చేపుతే తెలుస్తుంది, నాకు మాత్రం ఇప్పుడే జరిగిందా అని ఇప్పటికీ గుర్తుకు వస్తూ ఉంది.

మెస్  ఛార్జీలు పెంచారు, మెస్ బిల్లులను  ప్రభుత్వం పోయిన సంవత్సరానివి ఇంకా రిలీజ్ చేయలేదు,  అప్పుడే మళ్ళీ పెంపకం చేస్తే పేద విద్యార్థుల చదువులు ఏమవుతాయి? పేద విద్యార్థుల చదువులు ఇక అటక ఎక్కాలినా? ఇప్పుడున్న మెస్ ఛార్జీల కన్నా ఒక్క పైసా కట్టేది లేదు అని బల్లను గట్టిగా కొట్టి మీరు చెప్పారు. మాలో ఎవరో ఒక కోతి బల్ల విరిగి పోతే మా క్లాస్ రూం యెక్క అందం పోతుంది అని కేక వేసింది, అయినా మీరేమి ఆ మాటలు పట్టించుకోలేదు, స్పీచ్ ఆపలేదు. డౌన్ డౌన్ విధ్యా శాఖ మంత్రి సుగాత్ర దేవి అని అంటూనే ఉన్నారు,  ఏకలవ్యుడి విగ్రహం దగ్గిర ఒక్క గంటలో అందరూ జమ కావాలి అని ఆర్డర్ పాస్ చేసి వెళ్ళి పోయారు,

అజీబ

#9440430263

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles