Wednesday, September 18, 2024

ఉండవల్లికి ఊరట…రామోజీకి చుక్కెదురు!

వోలేటి దివాకర్

నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసిన కేసులో మార్గదర్శి చిట్ ఫండ్స్ లిమిటెడ్  అధినేత రామోజీరావుకు చిక్కులు తప్పడంలేదు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసును సుప్రీం కోర్టు వరకూ తీసుకెళ్లారు. ఈ కేసులో ఇతర ప్రతివాదులు కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు  చేయకుండానే సుప్రీంకోర్టులో విచారణ జరిపించే ప్రయత్నాలు ఫలించలేదు. ఉండవల్లి వేసిన ఎస్ ఎల్ పిలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడం గమనార్హం.

Also read: సెల్ ఫోన్ లో డబ్బు పంపినట్టు… పితృదేవతలకు ఆహారం పంపవచ్చు!

తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్ గురించి చేసిన  వ్యాఖ్యలపై పరువు నష్టం దావాకు సంబంధించిన కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.  అరుణ్ కుమార్‌పై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేసింది.

Also read: మోడీ మాట కూడా లెక్క చేయని పవన్… ఇదే నిదర్శనం!

మార్గదర్శి చిట్ ఫండ్స్ 2007లో కంపెనీకి వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు రూ. 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సివిల్ కోర్టులో ఆయనపై పరువునష్టం దావా వేసింది. ఇందుకు వార్తాపత్రికల్లో వచ్చిన నివేదికలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకుంది.  దానిని సవాల్ చేస్తూ అరుణ్ కుమార్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.

Also read: రూ .2 వేల కోట్లు గోదావరి పాలు …. ఎవరు బాధ్యులు?

కేసు విచారణలో భాగంగా వార్తాపత్రికల కథనాలను సాక్ష్యంగా తీసుకోవడంపై ఉండవల్లి తరుపు సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఇరువైపులా వాదనలు  విన్న తర్వాత అరుణ్ కుమార్‌పై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also read: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే…..

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles