Friday, April 26, 2024

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే…..

ఇండియా టీవీ ‘వాయిస్ ఆఫ్ ది నేషన్’ ఒపీనియన్ పేరిట జూలై 11 నుంచి 24 వరకు జరిపిన అభిప్రాయా సేకరణలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మరోసారి మోదీ ఘన విజయం సాధిస్తారని అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ‘ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది. ఇండియా టీవీ-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ దేశంలోని 136 పార్లమెంటరీ నియోజకవర్గాలలో 34,000 మందితో నమూనా సర్వే చేశారు. వీరిలో 19,830 మంది పురుషులు ,14,170 మంది మహిళలు ఉన్నారు.

ఏపీ,తెలంగాణ ఫలితాలు ఆసక్తికరం

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 ఎంపి స్థానాల్లో వైసీపీ, టీడీపీ విజయం సాధిస్తాయని వెల్లడైంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ కూటములు ఒక్క సీటును కూడా గెలవలేవని తేల్చింది. తెలంగాణలో ఎన్డీయే 6, యూపీఏ 2, ఇతరులు 9 సీట్లు సాధిస్తాయని తేలింది.

Also read: సార్వత్రిక ఎన్నికల సారథి సోము వీర్రాజే ? !

 ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 362 సీట్లలో భారీ మెజారిటీతో విజయం సాధించగలదని చెప్పింది. సర్వే ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 97 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేసింది.
చిన్న, ప్రాంతీయ పార్టీలు , స్వతంత్రులతో సహా ‘ఇతరులు’ 84 సీట్లు గెలుస్తారని అంచనా.

రాష్ట్రాల వారీగా స‌ర్వే ఫలితాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.

అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో ఎన్డీయే అత్యధికంగా 76 గెలుచుకోవచ్చు, యూపీఏ, ఇతరులు ఒక్కొక్కటి రెండు సీట్లు మాత్రమే గెలుస్తారని అంచనా. బీహార్‌లో మొత్తం 40 సీట్లలో ఎన్‌డిఎ 35, యుపిఎ ఐదు సీట్లు గెలుచుకోవచ్చు.

Also read: పోలవరం కొట్టుకుపోతే ….. ఆ నివేదిక ఏం చెప్పింది?

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్‌డిఎ 37 స్థానాలను గెలుచుకోగా, బిజెపియేతర ప్రతిపక్షాలు మిగిలిన 11 స్థానాలను గెలుచుకోవచ్చు. తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె నేతృత్వంలోని యుపిఎ మొత్తం 39 స్థానాలకు గాను 38 స్థానాలు గెలుచుకుంటుందని, మిగిలిన ఒక్క సీటును ఎన్‌డిఎకు వదిలివేస్తుందని అంచనా. ఎల్‌డిఎఫ్ అధికారంలో ఉన్న కేరళలో బిజెపియేతర ప్రతిపక్షం రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోగలదు.

టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో, మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ మొత్తం 42 సీట్లలో 26, ఎన్డీయే 14 ,యూపీయే రెండు గెలుస్తుందని అంచనా వేయబడింది. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మొత్తం 26సీట్లు బీజేపీ26 గెలుచుకోవచ్చు. అలాగే గోవాలో మొత్తం 2, రాజస్థాన్ లో మొత్తం 25, ఢిల్లీలో మొత్తం 7 ఉత్తరాఖండ్ లో మొత్తం 5, హిమాచల్ ప్రదేశ్ మొత్తం 4. త్రిపురలో మొత్తం 2 సీట్లను ఎన్డీయే కూటమి కైవసం చేసుకోవచ్చని అంచనా వేశారు.

Also read: విమానంలో బయలుదేరిన మిస్టర్ బ్యాలెట్ బాక్స్ ఎవరు?

మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లలో ఎన్డీయే37 యూపీఏ11. మధ్యప్రదేశ్ లో మొత్తం 29 సీట్లలో 28, యూపీఏ1,ఛత్తీస్‌గఢ్ లో మొత్తం 11లో ఎన్డీఏ 10, యూపీఏ1. జార్ఖండ్ లో మొత్తం 14లో ఎన్డీయే 13, యూపీఏ1 ఒడిశాలో మొత్తం 21గాను, ఎన్డీయే11, యూపీఏ2, ఇతరులు 8, పంజాబ్ లో ఎన్డీయే 3, యూపీఏ 3, ఆప్ సహాఇతరులు 7. హర్యానాలో ఎన్డీయే9, యూపీఏ 1, జమ్మూ & కాశ్మీర్, లద్దాఖ్ లో మొత్తం 6 సీట్లకు గాన ఎన్డీయే 3, ఇతరులు 3 సీట్లు సాధిస్తారు అని సర్వేలో వెల్లడైంది. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మొత్తం 28 సీట్ల కు గాను, ఎన్డీయే 23, యూపీఏ 4 ఇతరులు1 సీట్లను గెలుచుకోవచ్చు. అస్సాంలో ఎన్డీయే 11, యూపీఏ1, ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనాకు వచ్చారు.

మళ్ళీ మోడీ కావాలి

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని మళ్లీ ఎన్నుకుంటామని 48 శాతం మంది ఈ సర్వేలో చెప్పారు. మోదీ తర్వాతి స్థానాల్లో రాహుల్ గాంధీ 11 శాతం , మమతా బెనర్జీ 8 శాతం , సోనియా గాంధీ 7 శాతం , మాయావతి 6 శాతం, శరద్ పవార్ 6 శాతం, అరవింద్ కేజ్రీవాల్ 5 శాతం, నితీష్ కుమార్ 4 శాతం , కె చంద్రశేఖర్ రావు 3 శాతం ,ప్రియాంక వాద్రా 2 శాతంతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.

Also read: తమిళనాడులోనూ ఏక్ నాధ్?.. మహారాష్ట్రకు…తమిళనాడుకు సారూప్యత ఇదే!

మోదీకి బలమైన రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న ప్రశ్నకు 23 శాతం మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపగా, 19 శాతం మంది అరవింద్ కేజ్రీవాల్‌ను ఎంచుకున్నారు. 11 శాతం మంది మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపగా, 8 శాతం మంది నితీష్ కుమార్, సోనియా గాంధీల వైపు మొగ్గు చూపారు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles