Saturday, February 24, 2024

జిప్సీ కారు, నాలుగో తరం!

జర్నీ -2

(కిందటి వారం తరువాయి)

‘‘మీ గుంపులో నుండి బయటకు వచ్చిన ఒక విద్యార్థినిని నేను అడిగాను.’’

‘‘ఏమని? చెవిలో పువ్వు ఎలా పెట్టుకోవాలి అనా?’’ అని రామన్ అన్నాడు.

‘‘చెవ్విలో పువ్వు పెట్టుకోవటం తెలుసు. అది అడగలేదు. ఏకలవ్యుడి విగ్రహం దగ్గిరకు రాకపోతే ఏమవుతుంది’’ అని అడిగాను. ‘‘దానికి ఆ విద్యార్థిని ఏం చెప్పిందో తెలుసా? నేనూ మా ఆయన మీ ఇంట్లో ఫస్ట్ నైట్ జరుపుకుంటాము అని చెప్పింది. అయ్యో, అంత పనీ చేస్తారు అని భయపడి ఏకలవ్యుడి విగ్రహం దగ్గరకు మా క్లాస్ అమ్మాయిలందరం వచ్చాము.’’

నిజమా అని బెనర్జీ అడిగాడు. ‘‘నిజమా ఏంటి బెనర్జీ? భయం భయం ఆ విద్యార్థిని ఏం చెప్పింది ఫస్ట్ నైట్ చేసుకుంటాము అన్నది కదా’’ కదా అని ముగ్గురు ఒకేసారి అన్నారు.

‘‘ఇదెక్కడి న్యాయం? నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ రోజు మీటింగ్ లో కూడా మీరు  ఈ రోజు అమ్మాయిలు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు  అన్నారు, ఫస్ట్ నైట్ చేసుకుంటాము  అని చెప్పిన విద్యార్థిని మీ చెవిలో ఏదో చెప్పారు. రాసిచ్చిన లిస్ట్ ప్రకారం నా పేరు అంజలి. స్మితా పాటిల్ అని పిలిచారు. విద్యా శాఖ మంత్రి బొమ్మ దహన సంస్కార కార్యక్రమంలో పాలుగొనుటకు మా ముగ్గురిని  ముందుకు రావాలి అని పిలిచారు మీరు. మేము బెరుకు బెరుకు గా వచ్చి నిలబడ్డాము. ఆ రోజు కార్యక్రమానికి మమ్మల్ని ముగ్గురిని మాత్రమే  విద్యార్థులకు ముఖ్య అతిథులను చేశారు. ముఖ్య అతిథులుగా పాలుగొన్న మా వార్త  మరుసటరోజు అన్ని లీడింగ్ పత్రికలలో బ్యానర్ ఐటెం అయ్యింది. మా  ముగ్గురి ఫోటోలు, డిమాండ్స్… అబ్బా, అప్పటి రోజులు, మళ్ళీ వస్తే బావుణ్ణు’’ అంటూ సౌమ్య కళ్లను ఒత్తుకున్నది, గొంతు మూగపోయింది, స్వరం గద్గతికంగా మారింది 

‘‘అరె, కానివ్వు సౌందర్య రాశి’’ అని రామన్ అన్నాడు.

‘‘నీ జ్ఞాపక శక్తికి జోహార్లు’’ అంటూ బెనర్జీ మెచ్చుకున్నాడు.

‘‘మా మంచి కూచి కదూ’’ అంటూ రచన సౌమ్యను దగ్గిరకు తీసుకోని గట్టిగ కౌగిలించుకుని వదిలింది,

‘‘నా మూడ్ కు మంచు పట్టింది, తరువాత, ఆ మధ్యలో దోస్తులు జాయిన్ అయ్యాక చెపుతాను, మెమోరీస్ మీతోనే పంచుకుంటే ఆనందం ఇంతా అంతా కాదు, వేడి వేడి కాఫీ తాగుదాము ఆ సర్ధార్ జి దగ్గిర’’

‘‘అయ్యో రామా…’’

‘‘రాముణ్ణి ఎందుకు పిలుస్తున్నావు? అక్కడెక్కడో అయోధ్యలో ఉన్నాడు. నేను ఇక్కడే ఉన్నాను. నన్ను పిలువు రచనా’’ అంటూ రామన్ వేలమాడాడు.

‘‘రాముడు అయోధ్యలో ఉన్నా పలుకుతాడు’’

‘‘ఎలా?’’

‘‘ఇప్పుడు నీవు పలకలే నన్ను పిలువు అని. అలా. ఓకే, సౌమ్యా సర్దార్జి దగ్గిర ఛాయ్ తాగుదాము. కాఫీ వద్దు.’’

‘‘మరి కాఫి ఎప్పుడూ?’’

‘‘ఓ అదా… మధ్యలో మన స్నేహితులు, రామ్ పెదనాన్న మేనమామ కూతురు వాళ్ళు… అదే మధ్యలో…’’

‘‘ఓ, అక్కడ కదూ, సరే. సర్డార్జీని చేరుకోవటానికి ఇంకా సమయం పడుతుంది.’’

‘‘ఆల్మోస్ట్ ఆల్ వచ్చేశాము. సర్దార్జీకి చెప్పి పెట్టాను. నీ కిష్టమైన పిండి వంటలు కూడా చేపించి పెట్టమన్నాను’’ అని బెనర్జీ అన్నాడు.

‘‘మాకు లేవా?’’ అంటూ రచన బుంగ మూతి పెట్టింది.

‘‘ఆగు రచన. బెనర్జీ సౌమ్యకు మస్కా కొడుతున్నాడు. అర్థం కాలేదా? చూడు సౌమ్య గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారో.’’

‘‘అదే చూస్తున్నాను. మాట్లాడుతూ మాట్లాడుతూనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. బెనర్జీ, ఈ డొక్కు కారు ఇంకా ఎందాక? అని రచన అడిగింది.

‘‘ఇది డొక్కు కారు కాదు మహా తల్లీ, దీన్ని జిప్సీ అంటారు. ఈ వాహనం మా ఇంటి ఇలవేల్పు.’’

‘‘వాహనాలు ఎప్పటి నుండి ఇలవేల్పు లు  అయ్యాయి బెనర్జీ?’’ అంటూ రామన్ అడిగాడు.

‘‘రామన్, కొంచెం నీ నోరు అదుపులో పెట్టుకో రా. దారిలో నీకు ఇష్టమైన, ప్రియమైన భోజనం ఏర్పాటు చేపిస్తున్నా.. ప్లీజ్ రా’’ అంటూ  బతిమిలాడాడు బెనర్జీ.

‘‘ఓకే’’ అంటూ రెండు చేతులు జోడించి, ‘‘నీ జిప్సీ గురించి వివరించు వింటాను.’’

‘‘జిప్సీ బాడీని చూడు, ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇప్పుడు ఇలాంటీ జిప్సీలు మార్కెట్ లో ఎక్కడా కనిపించట్లేదు. ఈ జిప్సీ ని   నాలుగవ తరం వాళ్లు నడుపుతున్నారు. ఇలాంటిది ఎక్కడ దొరుకుతుంది చెప్పు.’’

‘‘జిప్సీ కబుర్లు ఎన్ని సార్లు చెప్పినా, మనం  ఇప్పుడే వింటున్నట్లు వింటాము, బెనర్జీ కూడా ఇప్పుడే చెపుతున్నట్లు చెపుతూ పోతారు.   బెనర్జీకి యాస్టకు రాదు, మనకూ యాస్టకు రాదు, మళ్లీ మళ్లీ అడిగి చెప్పించుకుంటాము. ఏంటో ఈ జిప్సీ కీ మనకు ఉన్న బంధం’’ అంది రచన గుసగుసగా.

‘‘ఓయ్ రచనా, ఏదో మీరు మీరే చేవ్వులను కొరుక్కుంటున్నారు, నాకూ చెప్పండి, నేను మీకేమి డ్రైవర్ ను కాను’’ అన్నాడు బెనర్జీ.

‘‘అయ్యో బెనర్జీ, నీకు వయసు పెరుగుతుందే కానీ బుర్ర ఎదిగి వస్తున్నట్లు లేదు, నీ జిప్సీ కథనే నేనూ వినిపిస్తున్నాను. నీ కుడి పక్కన ఫిక్స్ చేసిన మైక్ ఉంది కదా, దాన్ని ఆన్ చెయ్యి, నీ జిప్సీ గురించి చెప్పు, నోరు నొప్పి పెట్టదు. నిదానంగా మధ్యలోని గమ్యం వరకు చెప్పు, మరచి పొతే రామన్ కూడా నీకు గుర్తు చేస్తాడు, నేను సౌమ్య ఏమైనా మిగిలిపోయిన మేమోరీలు ఉంటే అందిస్తాము’’ అన్నది రచన.

మైక్ ను ఆన్ చేసి మెల్లగా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే పాటను హం చేస్తూ ‘‘ఎక్కడి వరకు జిప్సీ గురించి చెప్పాను?’’ అని అడిగాడు.

‘‘నాలుగో తరం వాళ్ళు జిప్సీ తోలేస్తున్నారు అని ఆగావు బెనర్జీ,’’ అంటూ రామన్ అందించాడు.

‘‘అంటే, బెనర్జీ ఇప్పుడు నాలుగో తరంలో చేరాడా?’’ అని సౌమ్య చమత్కరించింది.

‘‘జెస్ట్ 47 years మాత్రమే. నాలుగో తరం మనిషిలా లేనా? ఏం రామన్ నేను ఎలా కనిపిస్తున్నాను? సీరియస్లీ అయాం ఆస్కింగ్ రా, ఈ జర్నీ మొత్తం ను విప్లవంతో ముంచాలని చాలా ఆశతో బయలుదేరతీశాను. నేను నాలుగో తరం మనిషిని  కానా?’’ అని గట్టిగా గోల చేయటం మొదలు పెట్టాడు బెనర్జీ. ఆ గోల మొత్తం మైక్ లో అలలు అలలుగా వెళ్లి దారెంబడి ప్రయాణీకుల చెవులను తాకుతున్నాయి. అక్కడక్కడ కొందరు ఆగి చూస్తున్నారు. వాహనదారుల్లో కొందరు ఆగి చూసి, తంసప్ లా చేతిని చూపి మళ్ళీ ప్రయాణం సాగిపోతున్నారు. మరికొందరు ‘‘ఇదేందిర గోల, జాగ్రత్త జాగ్రత్త’’ అంటున్నారు.

Also read: జర్నీ -1

(ఇంకా ఉంది)

అజీబ

#9440430263

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles