Sunday, April 28, 2024

మన ధర్మమె మనకు రక్ష

భగవద్గీత82

నీ ధర్మమే నీకు శ్రేయస్కరం!

కమ్యూనిష్టులు మా ఆర్ధిక సిద్ధాంతాలు కరెక్ట్‌ అని బలంగా నమ్మి ప్రపంచమంతా ప్రచారం చేశారు. కేపిటలిస్టులు వారి సిద్ధాంతాలే నిజమనీ, దాని వలననే ప్రగతి సాధ్యం అనీ ప్రచారం చేస్తున్నారు. ఆర్ధిక శాస్త్రం ‘‘డబ్బు’’ దాని నడకను గురించి చర్చించేదే.

ఒక చిన్న ఉదాహరణ:

డబ్బు నడక అన్ని ఇళ్ళలో ఒకేరకంగా ఉన్నదా? అందరూ ఒకటే విషయం మీద ఖర్చు పెడుతున్నారా? లేదు కదా! ఎవరి ప్రాధాన్యతలు వారివి. ఒకడు తన సంపాదన లేటెష్టు టివీలు కొనడానికి ఉపయోగిస్తే, ఇంకొకడు స్మార్టుఫోన్లు కొనడానికి ఉపయోగిస్తాడు. ఇంకొకడు పుస్తకాలు కొనడానికి ఉపయోగిస్తాడు. ఇలా రకరకాలు. ఇవి ఎప్పుడు చేస్తాడంటే తన వద్ద తిండి, బట్ట, గూడు అనే ప్రాధమిక అవసరాలు తీరడానికి కావలసినంత ఉండి మిగిలిన డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు. మిగిలిన డబ్బును ఒక్కొక్కడు ఒక్కొక్క అవసరానికి వాడతాడు. ఈ మిగిలిన డబ్బును టాక్సురూపంలో వసూలు చేయాలా? చేయాల్సివస్తే ఎంతచేయాలి?

Also read: ప్రకృతిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం ఉత్తమం

ఇది మరలా ఒక్కొక్క దేశానిది ఒక్కొక్క సిద్ధాంతాం. ఒక్కో రూటు. ఒకరు ఎక్కువ వసూలు చేసి, లేనివారికి సబ్సీడీలు ఇద్దామంటారు. అలా ఇస్తే ప్రజల దగ్గర డబ్బు ఎక్కడ ఉంటుంది వినిమియ వస్తువులు కొనడానికి? కాబట్టి తక్కువ వసూలు చేసి ప్రజల దగ్గర ఖర్చు పెట్టే సొమ్ము మిగిలిస్తే వారు ఏవో వస్తువులు కొంటారు. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి. దేశ ప్రగతి చక్రాలు దూసుకువెళతాయి అంటాడొకడు. ఇక మూడవ వాడు జనం దగ్గర మిగులు ఉండనక్కరలేదు. మనం టాక్సులు తగినంత వసూలు చేసి కాస్త మిగుల్చుదాం. ఆ మిగులును వాడు ఋణవాయిదాలు కట్టుకునేటంత ఉంచి, వ్యక్తిగత అప్పులు తీసుకోవడం.

అప్పు పుట్టే మార్గం:

జనం కొంటారు, ఉత్పత్తి పెరుగుతుంది. మరి ఇలా ఒక అప్పు మీద మరొక అప్పు నియంత్రణ లేకుండా చేసుకుంటూ పోతే మనిషి చతికిలపడడా? తీసుకున్న అప్పు తీర్చేవారులేక ఋణసంస్థలు కుదేలవ్వవా? ఎన్ని సిద్ధాంతాలో నేటి సమాజంలో. ఇన్ని సిద్ధాంతాలు రాజ్యమేలుతూ సగటు మనిషి జీవితాన్ని ఒత్తిడుల సుడిగుండంలోకి నెట్టి వేస్తున్నాయి.

Also read: ఉత్తములను ఇతరులు అనుసరిస్తారు

మరి మనిషి ఏంచేయాలి?

తన అవసరమేదో తాను ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. తోటిది తొడకోసుకున్నది కదా అని తాను మెడ కోసుకోకూడదు. తనకేది శ్రేయస్కరమో తాను నిర్ణయించుకోవాలి. ప్రక్కవాడు కోటిరూపాయలుపెట్టి బెంజికారు కొన్నాడు నేనూ కొంటాను అని ఊగి అప్పు తీసుకొని కొంటే అది కట్టలేక సతమతమై బ్రతుకు దుర్భరం చేసుకోవడమే అవుతుంది. సమాజపు పోకడలనుండి నిన్ను నీవు రక్షించుకోవడానికి పరమాత్మ ఒక సూత్రం చెప్పారు…

శ్రేయాన్‌  స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

“నీ స్వధర్మమే ఎల్లవేళలా నీకు శ్రేయస్కరం.  పొరుగు వైభవపు తళుకులు చూసి గొప్పవి అని భ్రమపడి పొరుగువాడిని అనుసరించావా, అంతే సంగతులు. నీ స్వధర్మంలో, నీ ఆలోచనలో నీవు చావడం కూడా మేలే. ప్రక్కవాడి ఆలోచనలను అమలుచేసి నరకంలో పడేకంటే అదే ఉత్తమం“.

Always be in driver’s seat. Don’t allow yourself to be driven by somebody.

Also read: విజ్ఞుల సలహాలు స్వీకరించాలి

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles