Monday, January 25, 2021

భారత స్టార్ షట్లర్లకు కరోనా

  • థాయ్ లాండ్ ఓపెన్ కు సైనా,ప్ర‌ణయ్‌ దూరం

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు సైనానెహ్వాల్, ప్ర‌ణయ్‌ లను కరోనా వైరస్ ఇంకావెంటాడుతూనే ఉంది. కొత్తసంవత్సరం వచ్చినా…వదల బొమ్మాళి…వదల అన్నట్లుగా పట్టిపీడిస్తోంది.

కరోనా వైరస్ కారణంగా గత 10 మాసాలుగా ఇంటికే పరిమిత‌మైన సైనా ఇటీవలే కోలుకొంది. థాయ్ లాండ్ ఓపెన్ లో పాల్గొనటానికి సన్నాహాలు సైతం మొదలుపెట్టింది. థాయిలాండ్ ఓపెన్ ప్రారంభానికి ముందు నిర్వాహ‌క సంఘం నిర్వహించిన కరోనా పరీక్షల్లో…సైనాతో పాటు పురుషుల సింగిల్స్ ప్లేయర్ ప్రణవ్ కు సైతం పాజిటివ్ వచ్చింది.

దీంతో…ప్రస్తుత సీజన్ తొలిటోర్నీలోనే పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. .తొలి రౌండ్‌లో మలేసియా కు చెందిన షట్లర్‌ కిసోనా తో సైనా తలపడాల్సి ఉంది.  

మరోవైపు…పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో పోటీకిదిగాల్సిన హెచ్ ఎస్ ప్ర‌ణయ్‌ కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణయ్యింది. సైనా భ‌ర్త పారుప‌ల్లి క‌శ్య‌ప్‌కి సైతం కరోనాపరీక్ష నిర్వహించారు. రిపోర్ట్ రావాల్సి ఉంది. భారత మరో స్టార్ ప్లేయర్ పీవీ సింధు లండన్ కేంద్రంగా సాధన చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles