Friday, April 26, 2024

వాట్సాప్ ప్రైవసీని అడ్డుకోండి

  • ఢిల్లీ హైకోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వం
  • మే 15 తర్వాత అమలు కానున్న ప్రైవసీ పాలసీ

కొత్త  ప్రైవసీ పాలసీ అమలు చేయకుండా వాట్సాప్‌ను నిరోధించాలని ఢిల్లీ హైకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. వాట్సాప్‌ కొత్త గోప్యతా విధానం వల్ల అత్యంత విలువైన దేశ సమాచార భద్రత, చట్టాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సీమా సింగ్‌, మేఘా సింగ్‌ అనే ఇద్దరు మహిళలు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీంతో కేంద్రం తరఫున ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ శుక్రవారం తన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కొత్త గోప్యతా విధానం తీసుకురాకుండా వాట్సాప్‌ను నిరోధించాలని అఫిడవిట్ లో తెలిపింది.

Also Read: సామాజిక మాధ్యమాలకు ముకుతాడు

వినియోగదారులకు వాట్సాప్ భరోసా:

వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త గోపత్యా విధానాన్ని వినియోగదారుడు తప్పనిసరిగా అంగీకరించాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్ ను డిలీట్ చేయాల్సి ఉంటుంది. దీనిపై భారత్‌ సహా అంతర్జాతీయంగా పలు దేశాలనుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. దీని అమలును మే 15కు వరకు తాత్కాలికంగా వాయిదా వేసింది. అప్పటి వరకు ఎవరి ఖాతాను రద్దు గాని, సస్పెండ్‌ గాని చేయబోమని వాట్సాప్ ప్రకటించింది. వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకుంటోందని ఆందోళనల నేపథ్యంలో వినియోగదారుల సమాచారానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని వాట్సాప్‌ స్పష్టం చేసింది. ఎండ్ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్ డ్‌ టెక్నాలజీని వినియోగిస్తుండటంతో మెసేజ్‌లను తాము కూడా చూడలేమని ఇప్పటికే వాట్సాప్ స్పష్టం చేసింది.

కొత్త ఫీచర్లతో ఆకర్షించేందుకు యత్నాలు:

మరోవైపు ప్రైవసీ పాలసీపై వినియోగదారులకు తలెత్తే సమస్యలను సందేహాలను తొలగించే ప్రయత్నం చేస్తూనే వాట్సాప్ కొత్త ఆప్ డేట్స్, కొత్త ఫీచర్స్ తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు వాట్సాప్ గ్రూప్ చాట్ లలో ఉండే మ్యూట్ ఆప్షన్ కు మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. గతంలో మ్యూట్ ఆప్షన్ కేవలం 8 గంటల నుంచి గరిష్టంగా సంవత్సరం వరకు ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా గ్రూప్ చాట్ మ్యూట్ ఆప్షన్ ను జీవితాంతం సెట్ చేసుకునే ఫీచర్ ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. దీంతో ఎంతకాలం మ్యూట్ కావాలో అంతకాలం ఎంచుకునే వీలుంది.

Also Read: వాట్సప్ హాండ్సప్!

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles