Monday, April 29, 2024

బీజేపీ ‘గ్రేటర్’ వరాలు

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)  ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ  మేనిఫెస్టో విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్   విడదల చేసిన ఎన్నికల ప్రణాళికలోని ముఖ్యాంశాలు ఇవి:

Also Read: ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు

  • జీహెచ్ఎంసీలో నూటికి నూరు శాతం పారదర్శక పాలన, లంచాల  బెడద నివారణ, మహిళల భద్రతకు ప్రాధాన్యం. వచ్చే అయిదేళ్లలో వారి కోసం 15 పోలీస్ స్టేషన్ల ఏర్పాటు
  • జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధాన మంత్రి అవాస్ కింద లక్ష ఇళ్ల నిర్మాణం
  • హైదరాబాద్ నగరవాసులకు రోజంతా  ఉచితంగా మంచినీరు
  • ఇంటింటిక కుళాయి కనెక్షన్
  • మురికివాడల్లోని పేదలకు ఇంటి పన్ను రద్దు
  • ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు
  • వంద యూనిట్లలోపు  పేద వినియోగదారులకు, కులవృత్తిదారులకు ఉచిత విద్యుత్
  • వరదల నియంత్రణకు సమగ్ర ప్రణాళిక, వరద బాధితులకు రూ. 25 వేల వంతున సాయం.
  • నగరవాసులకు ఉచితంగా  కరోనా వాక్సిన్
  • నమో గంగా తరహాలో మూసీ నది ప్రక్షాళన
  • విద్యార్థులకు ఉచితంగా లాప్ టాప్ లు, వై ఫై సదుపాయం
  • ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ
  • జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు మెట్రో, ఎంఎంటీసీ సేవలు 
  • మహిళలకు మెట్రోలో, బస్సుల్లో ఉచిత ప్రయాణం. మహిళలకు కిలోమీటర్  కు ఒక మరుగుదొడ్డి.
  • ద్విచక్రవాహనాలకు,ఆటోలకు ఇప్పటి వరకు ఉన్న చలాన్ల రద్దు ఇలా ఉండగా  జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ఈ నెల 29వ తేదీన హైదరబాద్ వస్తున్నారు.

Also Read: గ్రేట‌ర్‌లో గెలుపెవ‌రిది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles